28, నవంబర్ 2012, బుధవారం

ప్రపంచ తెలుగు మహాసభలకు "టేల్గులో" ఆహ్వానం

ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో డిసెంబర్ మాసంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో హడావుడి మొదలయింది. వాయువేగంతో తెలుగు గురించి విపరీతంగా ఆలోచించడం మొదలుపెట్టారు పాలకులు. ఇవ్వాళ మన రాష్ట్రంలోని నాయకులలో ముఖ్యంగా దృశ్య శ్రవణ యంత్రాలలో చర్చల్లో పాల్గోనే ప్రముఖుల్లో తెలుగు ఇంగ్లీషు కలిపి మాట్లాడే వారే చాలా మంది వున్నారు. ఎంత ఎక్కువగా ఆంగ్ల పదాలు కలిపితే అంత బాగా మాట్లాడినట్లు లెక్క. వీరికితోడు మన దృశ్య శ్రవణ యంత్రాల కార్యక్రమ నిర్వాహకులు "dont గో ఎనీవేర్, just వన్ సెకండ్లో వి విల్ బి విత్ u, అప్పటి దాకా వన్ స్మాల్ బ్రేక్" అంటారు. ఈ వాక్యంలో మనం ఒక గంట కూర్చొని తెలుగు పదాలు వెదికితే ఒకటో ఆరో దొరకకపోదు. ఇది మొత్తం తెలుగు కార్యక్రమం. అంతదాకా ఎందుకు, మన ముఖ్య మంత్రిగారికే తెలుగు సరిగా రాదు. ఆయన సభాధ్యక్షులుగా వున్నప్పుడు వారి ఊత పదాలు మనకు తెలియనివి కావు. దయచేసి మీ కుర్చీలు మీరు తీసుకొని వెళ్ళండి. (ప్లీజ్ టేక్ యువర్ సీట్స్). రాజకీయ నాయకుల పిల్లలే కాదు మన పిల్లల్లో ఎంత మంది (తెలుగు మాధ్యమంలో చదవడం వదిలేయండి) కనీసం తెలుగు రెండవ భాషగా నేర్చుకోవడానికి ఇస్టపడుతున్నారు? వాళ్ళు నేర్చుకున్టామన్నా తల్లితండ్రులము మనం ఒప్పుకోము, ఎందుకంటే, ఎక్కువ మార్కులు కావాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు, తెలుగు రాదు గాని, నూటికి 95 మార్కులు అప్పటికి అప్పుడు సంస్కృతం రెండవ భాషగా తీసుకుంటే (చెప్పే వాడికి రాదు, వినేవాడికి రాదు, దిద్దేవాడికి అంతకన్నా రాదు) మార్కులు తప్పకుండా వస్తాయని నమ్మకం. అది నిజం కూడా! 
   

ఎంతసేపటికి మనం పక్కనవున్న తమిళనాడుతో పోల్చుకొని వాళ్ళెంత భాషాదురభిమానులో మనం పొగుడుతాం. కానీ ఆ రాష్ట్రం భారతదేశానికి ఒక అంచున వుంది. తమిళనాడు పొరుగు రాష్ట్రాలన్నీ దక్షిణాది రాష్ట్రాలే. కాని మన దురదృష్టం మన చుట్టుపక్కల ఒడిష, చత్తీస్గడ్, మహారాష్ట్ర ఒక వైపు ఇంకొకవైపు తమిళనాడు కర్నాటక రాష్ట్రాలు వున్నాయి. ఈ ప్రత్యెక భౌగోళిక పరిస్తులవలన , దేశంలోనే హిందీ తర్వాత మాట్లాడే అతిపెద్ద భాష ఐన తెలుగు ప్రమాదంలో పడింది. ఈ భౌగోళిక పరిస్తితులవలననే మన రాష్ట్రంనుండి గెలిచిన పార్లమెంట్ సభ్యులలో ఒరియా, కన్నడ మరాఠీ మూలాలు కల వాళ్ళు  కూడా వున్నారన్నది  అక్షర సత్యం.
 

మరొక విషయం - నామఫలకాలను తెలుగులో రాస్తేనో, సినిమాలకు తెలుగు పేరు పెట్టినంత మాత్రాన భాషాభివృద్ధి జరగదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటినుండి త్రిభాషా సూత్రాన్ని(తెలుగు, ఉర్దూ మరియు హిందీ ) పాటిస్తుంది. కానీ తమిళనాడు వారు తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమె వారు ఆమోదించారు. మనమేమో ప్రాంతాలవారీగా కొట్టుకొని చస్తున్నాము. తెలుగులో ఆదికవి నన్నయ్యా లేక పాల్కురికి సోమనాదుడా అనే అప్రస్తుత వాగ్వివాదాలతో నిత్యం కొట్టుకుంటున్నాం. ఇది కేవలం దిన పత్రికల పుటలు నిన్డటానికి ఉపయోగ పాడుతుండే కానీ, భాషాభివృద్ధికి తోడ్పదు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం ఒకరు ఔనన్నది ఇంకొకరు కాదనడం. కాని ప్రక్క రాష్ట్రాలవారు పారిశ్రామిక అభివృద్ధితో ముందంజలో వున్నారు. ఇది కూడా మన భాష దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం. మన పిల్లలు ఇక్కడి కాలేజీల్లో తాంత్రిక విద్య (టెక్నికల్ కోర్సు) చదివితే ప్రాంగణ ఉద్యోగాలు చాలా తక్కువ. అదే తమిల్నాడులోకానీ కర్ణాటకాలో గాని చదివితే - BHEL-రెండు యూనిట్లు, తోళ్ళ పరిశ్రమలు, లోదుస్తుల పరిశ్రమలు, ఆటోమొబైల్ రంగంలో హ్యుండై, టఫే, లే లాండు, ఫోర్డ్, నిస్సాన్, టి వి ఎస్, కోనే, జాన్సున్ లిఫ్ట్లు .... లిస్టు రాయాలంటే చేయ్యినోప్పి పుడుతుంది. ప్రతి జిల్లా ఒక పారిశ్రామిక వాడా. ఇక కర్నాటక రాష్ట్రానికి వస్తే, టయోట, వోల్వో, అన్ని ప్రముఖ సాఫ్టువేరు కంపనీలు, బస్ బాడీ తయారీ, ఓటిస్ లిఫ్ట్లు, ఎ పి సి, కొత్తగా హీరో హోండా ఇంకా అనేక పరిశ్రమలు ఇక్కడే. ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ రెండవ తరం పిల్లలు చాలామంది ప్రక్క రాష్ట్రాల్లో స్థిరపడి ఆ రాష్ట్రంలోని వాడుక భాషను, బ్రతుకు తెరువుకోసం మరియు మనుగడ కోసం నేర్చుకుంటున్నారు. అక్కడి పాటశాలల్లో చేరే ఈ రెండో తరం పిల్లలు వేరే దారి లేక ఇతర భాషలను రెండవ మూడవ భాషలుగా నేర్చుకోవడం మూలాన మన భాష అంతరించి పోతుంది.
 

కాబట్టి, రాష్ట్రం రాజకీయంగా స్థిరత్వం లేకుండా ఆర్ధికాభివృద్ధి సాధించలేదు. చైనా వాడికి ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే ఇంగ్లీష్తో పనిలేదు. ఏం వాళ్ళు అభివృద్ధి సాధించట్లా? తమిళనాడులో ఏ రాజకీయ పక్షం అధికారంలో వున్నా స్వాతంత్ర్యానంతరం గణనీయమైన పారిశ్రామికాభివృద్దికి బాటలు వేసింది. ఈ కారణంగానే వాళ్ళల్లో వలసలు తక్కువ. పారిశ్రామిక, వ్యవసాయ పురోభివ్రుది లేకుండా, అన్నిరంగాలలో వలసలు అరికట్టకుండా మన భాషకు మనుగడ లేదు.

27, నవంబర్ 2012, మంగళవారం

బాబోయ్ డిసెంబర్ వస్తోంది

డిసెంబర్ వస్తుందంటేనే  భయం వేస్తుంది. చలి పులి భయపెడుందని కాదండి. అంత తీవ్రమైన చలిలో కూడా  వేడి వేడి పకోడీ లాంటి  విషయాలు ఉంటాయ్. ప్రతి సంవత్సరం ఐతే, డిసెంబర్ 6న మసీదును కూలగొట్టారాని ఒక వర్గం వాళ్ళు అక్రోసిస్తే ఇంకొక వర్గం వాళ్ళు మేము పడగొట్టామని పండుగ చేసుకుంటారు. ఇలాంటి ప్రోటీన్ (అదేనండి రొటీన్) విషయాలతోపాటు, డిసెంబర్ 9 2009న చిదంబరం గారు లుంగీ కట్టుకొని మరీ అర్ధరాత్రి ప్రకటించిన స్వాతంత్రం. దాన్ని తూచ్ అంటూ ఇంటూ కొట్టి మళ్ళీ లుంగీ కట్టుకొనే డిసెంబర్ 23 పగలు పూట చేసిన ప్రకటన. డిసెంబర్ 9ని రాష్ట్రంలోని కొంతమంది విజయ దివాస్గా జరుపుకుంటే మరి కొంతమంది డిసెంబర్ 23ను విజయోత్సవాల పేరిట పండుగ చేసుకుంటారు. దీనికి తోడూ ఇటీవల తెలంగాణా కాంగ్రెస్ (4గురు) పార్లమెంట్ సభ్యులు పెట్టిన చివరాఖరి  గీత (అదేనండి డెడ్ లైన్) కూడా డిసెంబర్ తొమ్మిదే . ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికి తలకు ఒక్కింటికి షుమారుగా రూ 1.50 ఖర్చు పెట్టి డిసెంబర్ 27-29 తారీఖులలో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఏ మేరకు విజయవంతం అవుతాయోనన్న భయం సర్కారును పట్టి పీడిస్తోంది.

 
ఇవి చాలవన్నట్లు మన పొరుగు రాష్ట్రంలో డిసెంబర్ 8న యడురప్ప గారి క జ పా (కర్ణాటక జనత పార్టీ) ఆవిర్భావం కాబోతోంది. డిసెంబర్ 9వ తారీఖు నుండి కర్ణాటక విధాన సభ సమావేశాలు జరగబోతున్నాయ్. ఈ సమావేశాలు జరుగుతాయా లేదా అసెంబ్లీ రద్దు అవుతుందా అనేది యడురప్ప గారి మీద ఆధార పడివుంటుంది. మరి ఇది కూడా కమలనాధులకు పెద్ద విషయమే కదా?? 
 
టి వి చానళ్ళకు, పత్రికలకు మాత్రం పండగే, పండగ.
 

23, నవంబర్ 2012, శుక్రవారం

కేకే తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు

తా చెడ్డ కోతి వనమెల్లా చెడిపిందట !! ఆయనే ఇంతవరకు ఏ ప్రత్యక్ష ఎన్నికలలో కూడా కనీసం వార్డు సభ్యునిగా కూడా ఎన్నిక కాలేదు, ఇప్పుడేమో ఎవరిదారి వారు చూసుకున్దామనుకుంటున్న కొద్దిమంది తెలంగాణా పార్లమెంటు సభ్యులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు. 
     

ఏ రాజకీయ నాయకుడైనా తన భవిషత్తు గురించి తోలి ప్రాధాన్యం ఇస్తాడు కాని పార్టీ గురించి ప్రజల గురించి ఆలోచించడు. పాపం మందా గారు, గుత్తా గారు అంతకు మునుపు తే దే పా తరఫున పార్లమెంట్ సభ్యులు. వారికి తెలుసు, 2009లో కాంగ్రెస్ మాత్రమె గెలుస్తుందని. తక్షణం జంప్ కొట్టారు. ఇప్పుడు అంతో ఇంతో గెలుపు అవకాశాలు వున్న పార్టీలు తెలంగాణలో రెండే రెండు. కాని కేకే గారి ప్రకారం వీరంతా తె రా సా లో మాత్రమె చేరాలి. లేదంటే ఉద్యమ కారులు వీళ్ళని వదలరు . 
    
ఇవ్వాళ కాకపొతే రేపైనా వై.కా.పా కొంగ్రేస్స్లో కలవాల్సిన పార్టీ. కాబట్టి అందులో చేరితే అంతో ఇంతో పార్లమెంటు సభ్యులకు లాభం కాని, తే రా సా లో లాభం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేటు కంపెనీ లాంటిది. ప్రైవేటు కంపనీలో ఎ ఉద్యోగి ఐనా మేము ఉద్యోగం వదిలేస్తాం అంటే, వద్దులే బాబు, వేరే కంపనీలో నీకు ఎంత వస్తుందో చెప్పు అంతా మేమే ఇస్తాం అంటారు. కాదు కూడదు అంటే, ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తినిఇంకొంచం ఎక్కువ ఇచ్చి స్వగృహ ప్రవేశం జరిపించి "పునరాగమనాయచ" ని మంత్రం చెప్తారు. అలాగే, చిదంబరం మొదలుకొని, అంటోని , ప్రణబ్ ముఖేర్జి, శరద్ పవార్ వరకు ఎంతో మంది సొంత కుంపట్లు వెలిగించి అవి సరిగ్గా మండక సగంలో ఆపేసిన వాళ్ళే .   మళ్ళీ కాంగ్రేస్స్లో కలిసినవారే. వారంతా ఇప్పుడు మంచి మంచి పదవులు అనుభవిస్తున్నారా లేదా? తెలివంటే అది. 
 
కాబట్టి,తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ లు చక్కగా వై పాలో చేరిపోయి మళ్ళీ ఎన్నుకోబడి మంత్రులవడం మంచిది. నా ఉచిత సలహా తప్పక పాటిస్తారని భావిస్తూ...

21, నవంబర్ 2012, బుధవారం

మోటారు వాహన చట్ట సవరణలు అవసరం



మనకు స్వాతంత్రం సిద్ధించి 60 సంవత్సరాలు  దాటినా,  కొన్ని చట్టాలు ఇంకా బ్రిటిష్ వారు రూపొందించినవే అనుసరిస్తున్నాం.     ఉదాహరణకు - మోటార్ వెహికల్ ఆక్ట్ - రోజు  పాటశాలల్లో  పాఠాలు ప్రారంభించే ముందర మనం ఒక స్తోత్రం పఠిస్తాం.   భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు అని..   ఎక్కడండి ఆచరణలో ??  పంజాబ్ నుంచి బయలుదేరిన లారీ 3 అంతరాష్ట్ర చెక్కు పోస్టుల పోస్టుల దగ్గర మూడు చెరువల నీళ్ళు తాగి, 3000 లంచం ఇచ్చి వచ్చీ రానీ  భాషలో మాట్లా డాలి.    ఎందుకీ ఖర్మ?    ఈ దేశంలో నమోదైన  వాహనం ఏ  రాష్ట్రానికైనా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఎందుకు లేదు.  ఇలాంటి చట్ట సవరణలు ఎవరు చేస్తారు?   మన పార్లమెంట్ సభ్యులు కాదా?     ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజే అని గొంతు చించుకునే భా జ పా వారు చెయ్యలేదు.    స్వాతంత్ర్యానంతరం ఎక్కువ రోజులు మనల్ని పరిపాలించిన కొంగ్రేస్స్ వారు చెయ్యలేదు. 

మన సొంత ద్విచక్ర వాహనం కాని కారు గాని ప్రక్క రాష్ట్రంలో దొంగల్లాగా వాడుకోవాలి.   మనం రోడ్ టాక్స్ చేల్లిన్చాము కదా అంటే, మీరు చెల్లించింది మీ రాష్ట్రంలో మా రాష్ట్రంలో కాదు.    పోనీ రిజిస్ట్రేషన్ మార్చుకున్దామా అంటే మళ్ళీ మనం ఇక్కడ పన్ను చెల్లించి, ఎక్కడైతే మొదలుగా రిజిస్ట్రేషన్ ఐనదో వారినుంచి మనమే డబ్బులు వాపసు తీసుకోవాలి.   ఇది జరిగే పనేనా.      పక్క రాష్ట్రం వాహనం ఎప్పుడు వస్తుందా వాణ్ని పట్టుకొని అదిరించి బెదిరింఛి  ఒందో రెండువందలో  లాగుదామని ట్రాఫిక్కు సైతం గాలికి వదిలేసి వాహనదారుల మీదికి అమాంతం దూకే బడుగు పోలీసులు.     ఏంటి ఇదంతా?      

చెక్ పోస్టుల దగ్గర వసూలు చేసే డబ్బులు నెలవారీ మామూళ్ళ రూపంలో సంభందిత మంత్రి గారి వరకు వెళ్తాయి  అనడంలో సందేహం లేదు.    అందుకే ఇలాంటి అర్ధం పర్ధం లేని చట్టాల్ని మార్చడానికి మన పార్లమెంటు సభ్యులకు పాపం  తీరిక లేదు.         అదే వారి జీత భత్యాల విషయంలో ఆఘ మేఘాల మీద సవరణలు చేస్తారు.       దీనికి చిన్న చట్ట సవరణ అవసరం వుంది.    అన్ని రాష్ట్రాలలో రోడ్డు పన్ను ఒకే విధంగా ఉండేలా చూడడం.    అలా రాష్ట్రాలో వసూలైన డబ్బు మొత్తం కేంద్ర ఖాతాలోకి జమ చేయబడాలి.      కేంద్రం దామాషా పద్ధతిలో ఆ పన్ను మొత్తాన్ని రాష్ట్రాలకు పంచాలి.      ఎవరైనా సొంత ఉపయోగం కోసం వాహనాన్ని పొరుగు రాష్ట్రాలకు తీసుకొని పొడలచుకుంటే కేవలం (NOC) నిరభ్యంతర పత్రం, అది కూడా అంతర్జాలంద్వారా, తీసుకొని దగ్గర వుంచుకోవాలి.     

కనీసం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలనాటికైన (2047) ఈ చట్టం అమలులోకి వస్తుందని ఆశిస్తూ.

20, నవంబర్ 2012, మంగళవారం

ముందస్తుగా కూస్తున్న జంపు జిలానీలు


ఒక బస్సు ఢిల్లీ నుంచి బయలుదేరింది.    కండక్టర్  బొచ్చ గారు -  ఓరయ్యో టికెట్టు తీసుకోండి, ఓలమ్మీ టికెట్ తీసుకోండి అంటూ శ్రీకాకుళం యాసలో  గావు కేకలు పెడతాన్నాడు.   టీవిలో సినిమాలు పాటలు చూడాల్సిన అవసరంలేదు.   మా చిరు  మా బస్సులోనే ప్రయాణం చేత్తన్నాడు గందా నేరుగానే  చూసేయ్యోచ్చు.    ఏటంటారు.   బేగ బస్సు ఎక్కండి.       ఇంతలో మోకాళ్ళు నొప్పితో బాధపడుతున్న వృద్ధులు బస్సు ఎక్కడానికి నానా తంటాలు పడుతున్నారు.    వాళ్ళంతా తొందరాగా బస్సెక్కి కనీసం 70 ఏళ్ల యువకుడిని  ఎన్నుకున్టాము, పెద్ద కమాండ్ ఏమి చెప్తే అది చేస్తాం, మాకు కొంచెము కూర్చోవడానికి సీట్లు ఇప్పించండని  వేడుకుంటున్నారు.     బొచ్చ  గారు వారందరినీ కూర్చోపెడుతున్నారు.    మూడు ప్రాంతాల వారు కలివిడిగా విడి విడిగా కూర్చుని కలిసుండి విడిపోవాలా లేక విడిపోయి కలిసుండాలా అని విచ్చల విడిగా  జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. 

                                              @@@

చిత్తూర్ నుంచి బయలుదేరిన బస్సు, చాల మరమ్మత్తుల తర్వాత కొత్త కొత్త సీట్లతో, పసుపు రంగుతో ఖాళీగా బయలుదేరింది.    డాబు  గారు టికెట్ బ్రదర్,  టికెట్ తమ్ముడు,   రావాలి మీరందరూ నన్ను హైదరాబాద్కు సురక్షితంగా చేర్పించాలి అంటూ e టికెట్   i pad  ద్వారా  sms చేస్తున్నాడు.          కులానికి ఒక రకంగా బడ్జెట్  కేటాయింపులు చేసాను.     మీరంతా ఈ విధంగా ముందుకి పోవాలి.      తమ్ముడూ  ముందుకు పోవాలంటే, మా బస్సు వదిలేసి వేరే బస్సుకి పొమ్మని కాదమ్మా.   ఎనకమాలకి పొండి, చాలా ఖాళీ ఉందమ్మా, నడిచి నడిచి కాళ్ళు బొబ్బలు ఎక్కినై.    కొంచం కూపెరాట్ చెయ్యాలి తమ్ముళ్ళు.   

మా దగ్గర సొంత టి వి, పత్రిక లేకపోయినా,   లావయ్య బాబు  వున్నాడు, మధ్య మధ్యలో తొడ  చరిచి మిమ్మల్ని వుద్రేకపరుస్తాడు.    ఇక సీతయ్య సంగతి చెప్పక్కర్లేదు, ఆయన నా మాటే కాదు, ఎవ్వరి మాటా వినడు.  జై హైటెక్ సిటీ, జై జై ధన్యభూమి.
                                                     ***

సూపెర్ ఫాస్ట్ బస్సు లాంటి కారు కరీంనగర్ నుంచి బయలుదేరింది.      బస్సు పేరు  నైజాం - ఉగాది/దీవాలి/దసరా/డిసెంబర్ 9999.    కండక్టర్ చేతిలో టికెట్లు, కొడుకు చేతిలో టికెట్ పైసల సంచి.       జరుగుర్రి జరుగుర్రి, పదండి ముందుకు తోస్కోని తోస్కోని.    జల్ది రావాలే తమ్మి.    జాగా అసలు లేదు.     నాన్ స్టాప్ మన కారు.    ఈడకెల్లి సురూ చేసినమంటే,  సీదా  మన ప్రాంతం నుండి బయల్దేరి మన ప్రాంతంలోని విధాన సభకి పోతది.     ఇగో కోదండం సప్పుడు చెయ్యకు, వయా గన్ పార్క్ పోదాంలే గాని .      ఫ్రీ పాసు తోని  స్టాఫ్ లెక్క ఎక్కుతావు ఏం  లొల్లి చేస్తావ్ బై.     ఇంతలో ఎవరో గట్టిగా అరవటం మొదలు బెట్టారు.     అన్నా 100 మంది ప్రయాణం చెయ్యాల్సిన బస్ల 150 మందిని ఎక్కిస్తివి, ఎం కథ?   అరె   నీకు మంచం కోళ్ళ  లెక్క తెల్వదర బై.       4 అని 3 చెప్పి 2 చూబెట్టి ....   పార్టీ నడుపుడంటే  మజాకార బై.    బొమ్మల పెట్టె, పేపర్, దఫ్తర్ ఇన్ని చూడాలే.     అరె   హర్ష, ఎందుకురబై వాణ్ని కొడుతున్నావు, ఊకో,   టీవీ గాళ్ళు పంచాయతీ పెడతారు.   తవికమ్మ నువ్వు బస్సులో  మంచిగా  ఆడుకో,  మన నైజాం హైదరాబాద్ల  టాంకు  బండుమీద తర్వాత ఆడుదం .   మన దగ్గర సైన్మా గాళ్ళు ఎవ్వలు లేరు.   ఇంతలో ఎవరో బిగ్గరగా "నారాయణ నారాయణ" అని అరిచాడు.    గా  రానాయన మూర్తి ఆక్టింగ్ ఏమో యాక్ తూ.    అన్ద్రోల్ల పెండ బిర్యాని లేక్కనుంటది.     నువ్వే పూలతో ఆడుకో తల్లీ అందర్నీ ఆడిపియ్, ఏడిపియ్!   అది కాదన్నా - మన ఎర్ర నారాయణ.    వూకోబై సప్పుడుచేయాకు, నేను లేనని చెప్పి పంపియ్. 
                                                       ###


అది ముడుపలపాయ బస్టాండ్.     జనం రద్దీ ఎక్కువైంది.   అన్ని బస్సులు హైదరాబాద్ లోని విధాన సభకు వెళ్ళడానికి సిద్ధంగా వున్నై.   

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వోల్వో బస్సు ముడుపులపాయ  బస్టాండు లోకి  వచ్చి ఆగింది.     ఒకటే జనం.   కొంతమంది సీట్లల్లో కర్చిఫ్లు వేస్తున్నారు.    కొంతమంది ఎమర్జెన్సీ ద్వారం గుండా  దూకుతున్నారు.  డ్రైవర్తో     బాగా చనువు వుండి  మేళ్ళు పొందిన వారు  అటునుంచి  తొందరగా బస్సు ఎక్కేడానికి ప్రయత్నిస్తున్నారు.   ఈ కండక్టర్ అందరు కండక్టర్ లాగా డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వట్ల.     టికెట్తో పాటు డబ్బులిచ్చి బుగ్గలు నిమిరి ఓదారుస్తున్నాడు.   కొంతమందికి పెరుగన్నం తినిపిస్తున్నాడు.    ఇంతలో  రాoబాంబు  ఎవరికో సైటు వెయ్యడం గమనించిన కండక్టరు, లాగి పెట్టి తన్ని టికెట్ చిన్చేశాడు.     ఇంతలో ఒక మూలనుంచి "అరిస్తే కరుస్తా, నా జోలికొస్తే  చరుస్తా" అని శబ్దాలు వినపడ్డాయ్.   కండక్టర్ గారికి అనుమానం వచ్చి,  చూడమ్మా కూజా నీ యాక్టింగ్ బాగున్నప్పటికీ, నీ టికెట్టే RAC లో వుంది, ఈయన ఎక్కడనుంచి వచ్చాడు.    ఆయన్ని కొంచం కిందకు దించి ఓదార్చు తల్లీ లేదంటే ఆయన కొడుకుల్ని బస్సేకించి నటనతో చంపితే నేను మళ్ళీ ఓదార్పు యాత్రకి బయలుదేరాలీ... పెరుగన్నం తినలేక, బుగ్గలు సాగదియ్యలేక చస్తున్నాను.   మనకు సినిమా వాళ్ళు అక్కరలేదు.   మన గ్రూప్ సాంగ్  పెద్దాయన ఓ  పెద్దాయన పాడులోకం పెద్దాయన అని  పాడుకుంటూ చేతులూపుకుంటూ వెళ్దాము.   సరిగ్గా అదే సమయానికి ఎవరో అభర్ది -   సార్  బస్సు ఓవర్ లోడ్ అయ్యింది బయల్దేరదామా అన్నాడు.   ఆగందయ్యా, మన ఒయాసిస్సు గాలూ  తమ్ముళ్ళను తీస్కోని ఇప్పుడే చార్మినార్ నుంచి బయలుదేరారూ .  దగ్గరుండి కర్ఫ్యూ పెట్టించి వస్తానన్నారు.   వారు హైదరాబాదు నుంచి వచ్చి మన బస్సు ఎక్కుతారు. 
                                                      $$$

అది ఒక  చిన్న గుడి.   కృష్ణా రెడ్డి గారు గుడికి  బూజులు దులిపి చింతపండుతో  రాముడి విగ్రాహాలని ధగ ధగ లాడే ట్లు చేస్తున్నాడు.      ఇంతలో  టెంకయ్య నాయుడు గారు వచ్చి,  కృష్ణా రెడ్డి  ఇఫ్  యు కంటిన్యూ విత్ రాం, వి  విల్ గో డాం  , ఆఫ్టర్ దట్ వి  మే హావ్  టు  అప్లై జండు బాం  అండ్  హావ్ టు టేక్ రెస్ట్ ఇన్  అక్షరధాం .     మన మూడు ముక్కలాట బయటికి తీసి లేటెస్టుగా   మూడు రాష్ట్రాల ఆటా   ఆడాలి అంటూ లుంగీ గట్టిగా బిగిచ్చాడు.    మిగిలిన రెండు ప్రాంతాల్లో మన బస్సులు తుస్సు మని ఖాళీగా తిరుగుతున్నాయ్.    ఇక్కడ కూడా పెద్ద జనం కనపడటంలేదు.   కొంచం గొడవలు సృస్టి న్చమ్మ కృష్ణా రెడ్డి.  కులం, మతం, ప్రాంతం, భాష, యాసా ఎన్ని విషయాలున్నాయ్.     ప్రొసీడ్.     
                                          %%%

అన్ని బస్స్తాండ్లు తిరనాళ్ళని తలపిస్తున్నాయ్.   కానీ, అందరి ద్రుష్టి కొత్తగా వచ్చిన వోల్వో మీదనే వుంది.  ప్రజలకు మాత్రం తెలుసు, అందరూ అందరేనని.    





19, నవంబర్ 2012, సోమవారం

థాకరే పూజ్యనీయుడా ???

మరాతీలను ఏకతాటిపై తెచ్చి వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి బాల్ థాకరే అనడంలో సందేహం లేదు.     ఆయన మృతికి సంతాపం.     ఒక వ్యక్తి మరణిస్తే అతని గతం తాలూకు చెడును  గురించి చర్చించుకోవడానికి ఎవరూ సాహసించరు.    ఎందుకు??     

థాకరే స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నట్లు దాఖలాలు లేవు కాని ప్రాంతాల మధ్య, జాతుల మధ్య విద్వేషాగ్ని రగిల్చి ఎందరో అభాగ్యుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడన్నది   అక్షర సత్యం.     మతాన్ని, భాషని అడ్డం పెట్టుకుని రాజ్యం ఏలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసాడు.    బహుశా ఎన్నికల కమిషున్ ఓటు హక్కును రద్దు చేసిన వాళ్ళలో థాకరే మొట్టమొదటి వాడు.

కర్నాటక నుండి వలసవెళ్లి హోటల్ రంగంలో స్థిరపడిన కన్నడిగులను చిత్రహింసల పాలుచేసిన థాకరే  పూజ్యనీయుడా??   ఎక్కడైతే స్థానికంగా వున్నవాళ్ళు ఎక్కువ పని చెయ్యడానికి ఇష్టపడరో  అక్కడికి వలసలు పెరగటం సర్వ సాధారణం.   అమెరికా గాని, ముంబై కాని ఆఖరికి హైదరాబాద్ కాని....   

బీహార్ నుంచి వచ్చిన ఆటో / టాక్సీ ద్రైవెర్లను, పానీ పూరీ అమ్ముకొని పోట్టపోసుకునే ఉత్తర ప్రదేశ్ బడుగు జీవులను నడి రోడ్ల మీద అమానుషంగా గొడ్లను బాదినట్లు బాది హిమ్సించినది నిజం కాదా??  

శివసేనకి తెరాస కి కొన్ని విషయాల్లో చాలా దగ్గరి పోలిక వుంది.      పోలిక లేనిదల్లా -- ఆయన గారు పక్క రాష్ట్రాలనుంచి పొట్టకూటికోసం వలస వచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తే, మన క చ రా గారు మాత్రం సాటి తెలుగు వాళ్ళ మీద దాడులను ప్రోత్సహించాడు.      ఈ రెండూ దుర్మార్గాలే, కాదంటారా???

15, నవంబర్ 2012, గురువారం

అసలు సిసలైన లీడర్ - జగన్

ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు గాడు ...  ఇది పాత సామెత.   ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే జగన్  గాడు ... ఇది సరికొత్త సామెత.

వారానికో శాసన సభ్యుడు, రోజుకో మాజీ నాయకుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు "కట్టలు కట్టలు గా" వచ్చి జగన్ పక్షాన చేరుతున్నారు.      సరికొత్తగా, గంప గుత్తగా, మజ్లిస్.     మజ్లిస్తో దోస్తీ రాయలసీమలో మరియు తెలంగాణలో  జగన్కి ఏంతో మేలు చేస్తుంది అనడంలో సందేహం లేదు.   ఎలాంటి జన సమర్ధన లేని భా జ పా  వారు చార్మినార్ దగ్గర  పాపం కార్తీక మాసంలో భాగ్యలక్ష్మీ గుడి వ్రతం చేసి గొడవలు సృష్టించి అమాయకులను బలిచేసి వచ్చే ఎన్నికల్లో వోట్లు దండుకున్దామనుకుంటే, అదును చూసి పదునైన దెబ్బ కొట్టాడు జగన్ మరియు ఒవైసీ ద్వయం.    జగన్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.    అందరూ జగన్ని  వాళ్ళ నాన్న పోలిక అంటారు.   కాని నేను మాత్రం వాళ్ళ నాన్నే జగన్ పోలిక అంటాను.      తండ్రిని మించిన తనయుడు.  ఇంత  చిన్న వయసులో నాలుగు గోడల మధ్యలో వుండి కూడా కాంగ్రెస్, తెరాస, తె దే పా లని  చావు దెబ్బ కొట్టాడు.    శభాష్  జగన్!   నువ్వే నిజామైన లీడరువి.

14, నవంబర్ 2012, బుధవారం

దురహంకారి రావణ "జెట్" మలాని




ఏవిటో ఈ మధ్య భా జ పా వారికి అన్నీ కష్టాలె.   ఒక పక్క సూట్కెసు కంపెనీల "గడ్డు" కరి గారి అవస్తలు, మధ్యలో స్వామి వివేకానంద తెలివి తేటలని దావూద్తో పొల్చడం,  దక్షిణ భారత దేశంలో (కర్నాటకలో) తిప్పలు...   ఇవన్ని చాలవన్నట్లు భా జ పా వారి ఇష్ట దైవం రాముడి (అవకాశం వుంటే వారి ఎన్నికల చిహ్నంగా కూడా  వాడుకొనే వారు)  మీద జెట్ మలాని గారి వ్యాఖ్యానం.   ఎన్నికలప్పుడు మాత్రమే రాముడి పంచలోహ విగ్రహాలు బైటకు తీసి చింత పండుతో తోముతారు.   ఎన్నికలు లేనప్పుడు ఇలా వ్యాఖ్యానాలు చెయ్యడం, వారి మాజీ కెంద్ర  మంత్రిగారి ఆధ్వర్యంలో  టాంకు బండు మీద అన్నమయ్య విగ్రహం పడగొట్టడం వీరి ద్వంద నీతికి తార్కాణం. 

రామాయణాన్ని జెట్ మలాని గారు మద్యం సేవించకు ముందు చదివుంటే ఈ రకమైన అసందర్భ ప్రేలాపన చేసి వుండే  వాడు కాదు.  


సీతా దేవి అపహరణ తర్వాత ఆమె జారవిడిచిన నగలను గుర్తించమని నైరాస్యంలొ, ఆత్రుతలో వున్న శ్రీరామ చంద్రుడు లక్షమణుని  కోరతాడు .    దానికి సమాధానంగా  లక్షమణుడు అన్నగారికి చెప్తాడు--  నేను వదినగారి కాలి మంజీరాలని మాత్రమే గుర్తించగలుగుతాను, అదికూడా నేను రోజు ఆవిడ పాదాలకు నమస్కారం పెడతాను కాబట్టి అని .  


కేవలం ఉన్నత స్థాయి  కేసులను మాత్రమే వాదించి గంటల పంచాంగం ప్రకారం డబ్బు  దండుకొనే  "జెట్"  గారికి విషయం పూర్తిగా తెలీక రాముణ్ణి లక్ష్మనుణ్ణి తూల నాడాడు.   శత్రు సమ్హారం జరగాలని వున్నపుడు అవతార పురుషులు ఉద్భవిస్తుంటారు, అదే దశావతారములలోని మర్మం.  ఇందులో భాగమే  అపోహలు, అనుమానాలు, అగ్ని ప్రవేశం మున్నగునవి.    అంతే గాని లక్ష్మణుడు ఎ కె 47 తుపాకితో ఎందుకు కాపలా కాయలేదు, రాముడు రజకుని మాటలు విని అమ్మవారిని ఎందుకు అగ్ని ప్రవేశం చేఇంచాడు ఇవన్నీ  ప్రతి పక్షాల కుట్ర అని ప్రశ్నించడం అర్ధ రహితం.







 

11, నవంబర్ 2012, ఆదివారం

రెండు కళ్ళ సిద్ధాంతం

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజా బాహుళ్యంలో చేర్చబడ్డ చాలా కొత్త పదాలలో " రెండు కళ్ళ సిద్ధాంతం" ప్రముఖమైనది.    అతి సులభంగా వాడుకలోకి వచ్చిన నరుకుతా, బొంద పెడతా, రైలు పట్టాలు పీకుతా, నాలుకలు కోస్తా మొదలైన పదాలకి   " రెండు కళ్ళ సిద్ధాంతం" అనే దానికి చాలా వ్యత్యాసం వుంది.    ఈ సిద్ధాంతం డార్విన్ గాని న్యూటన్  గాని లేదా మనందరికీ గుర్తులేని మన తెలుగువారు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు గాని కనిపెట్టింది కాదు.    మన రాజకీయ గురువిందలు ఎదుటివాళ్ళని తిట్టేతందుకు ప్రతిపాదించినది మాత్రమె.    ఈ గురువింద పార్టీల గురించి తెలుసుకుందాము -- 

01) తే దే పా :   మీరు శాసనసభలో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నట్లు తీర్మానం పెట్టండి, మేము రేనాల్డ్స్ పెన్నుతో చెరిగిపోకుండా సంతకం పెడతాము, బస్తీమే సవాల్ అని మేక పోతూ గాంభీర్య ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు.    బూట్లు అరిగేలా పాదయాత్ర చేసి మాత్రము ఏమి లాభము చెప్పండి.   రెండిటికి చెడ్డ రేవడి అయ్యింది వీరి పరిస్తితి. తీర్మానం చేసిందాకా ఆ ప్రాంతం వాళ్ళు నోరుమూసుకొని వుండి , తీర అమ్మగారు పుట్టిన రోజుకి ఆంధ్ర ప్రదేశ్ అనే కే కును కత్తిరిచ్చే సరికి  రాజి నామాలు, రాజకీయాలు, పరుగేత్తడాలు, రంకెలు వెయ్యడాలు.      బస్సులు తగలపెట్టండి, ధర్నా చేయండి, ఉద్యమించండి అని చెప్పేదేదో సంతకం పెట్టకముందు చెప్తే ఈ తిరుగుళ్ళు ఉండేవి కాదు.    పాపం బాబు గారు ఏ పని చేసినా కనిపిచ్చి కనిపిచాకుండా, వినిపిచ్చి వినిపిచ్చాకుండా చేస్తారు.   నేను వ్యతిరేకం కాదు అంటాడు కాని అనుకూలం అని మాత్రం చెప్పాడు.   కర్ర విరక్కుండా పాముని చంపడమంటే ఇదే మరి.   


02) కాంగ్రెస్ : తనది కాకపొతే తాటిమట్టికు ఎదురు దేకమన్న్దట వెనకటికి ఎవడో.    పాపం చిదంబరం గారు లుంగీ గట్టిగా చుట్టుకొని, తమలపాకులుచ్చి (ఆయన రెండు నోట్లో వేసుకొని)  మూడేళ్ళపాటు తన్నుకోండి తర్వాత చూద్దాము   అన్నారు.   ఈయనగారు వెలిగించిన చిచుబుడ్డి  టాంకు బండ్  మీద నీళ్ళల్లో నిలబడ్డ బుద్ధుడి సాక్షిగా, మురికినీళ్లలో పడిన "గబ్బిలం" జాషువా గారి  సాక్షిగా, అన్యం పుణ్యం తెలియని అన్నమ్మయ్య సాక్షిగా,    ఇంకా వెలుగుతూనే వుంది.  ఒక పార్లమెంటు సభ్యుడేమో  తన పరిశ్రమలు కాలుష్యం అనే విషం చిమ్ముతూ విశాఖ లోనో, పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనో   పెట్టుకొని తన ప్రాంతం వాళ్లకి ఉద్యోగాలు రాలేదని నానా యాగీ చేస్తాడు.      3 పార్టీలు మారి 3 చెరువుల నీళ్ళు తాగి (తను  మాత్రం ఫిల్టర్ నీళ్ళు తాగుతాడు) నా నియోజిక వర్గములో  ఫ్లోరైడు సమస్య  వుంది కేవలం కలిసి వుండడం వల్లే ఇది వుంది లేకపోతె చేత్తో తీసేసినట్లు పొయ్యేది అని సెలవిస్తారు.    ఇంకొక జంట కవులేమో కోట్లల్లో కాంట్రాక్టులు చేసుకుంటూ, జాతీయ రహదారులపై అడ్డంగా గోడలు కట్టిస్తారు.     మరి ముఖ్యంగా సగం ఆంగ్లం, సగం తెలుగులో మాట్లాడే  ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికలలో పంచాయతి బోర్డు సభ్యునిగా కూడా ఎన్నుకోబడని వారి సంగతి సరే సరి.    మొన్న మొన్నటిదాకా అమెరికాలోవుండి , అమాంతం వూడిపడ్డ మరొక నాయకుడు చేతికి మట్టి అంటకుండా  పిల్లలని రెచ్చ గొట్టడంలో  సిద్దహస్తుడు .    వీరుగాక - కేరళ నుంచి NGO గా వచ్చిన ఒక పెద్ద మనిషి, కర్నాటక రాష్ట్రంనుంచి, మహారాష్ట్ర నుంచి  ఇక్కడ స్థిరపడిన పెద్దమనుషులు అప్పుడప్పుడు విరుచుక పడతారు.    మరి ఆ ప్రాంతంలో వున్న  కాంట్రాక్టర్లు, బిల్డర్లు...  కేవలం ఈ ప్రాంతంలో ఉద్యమిస్తే మాత్రమె అక్కడ మొదలు పెడతారు.        తమాషా ఏంటంటే - ఆ ప్రాంతంలో నువ్వు ఎన్ని వుద్యమాలైనా చెయి కాని పిల్లల చదువు చెడ కోట్ట కుండా చెయ్యాలి.  కొంతలో కొంత మేలు.  ఇదే చదువు చెప్పకుండా జీతం తీసుకొని విద్యార్దుల జీవితాలని నాశనం చేసే ప్రొఫెసర్ గారికి ఆ ప్రాంతంలో వుండే గుత్తేదార్ పార్లమెంటు సభ్యులకు వున్న తేడా.   

03) తె రా  స  : రంగు నీళ్ళని కిరసనాయలుగా భావించి నెత్తిన పోసుకొని అగ్గిపెట్ట కోసం అరగంట వెదికి  600 మంది చనిపోవడానికి స్పూర్తిగా నిలిచిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు ఎదిగిన పార్టీ ఇది.    తనకు తన పిల్లలకు కనీసం తలనొప్పి గాని జ్వరం గాని రాకుండా కేవలం పెద్ద పదవులు మాత్రమె దక్కేతట్లు  ప్రణాళిక రూపొందిచిన మహనీయుడు, ఒక రోజు పూర్తిగా ఘన, ద్రవ పదార్ధాలని త్యాగం చేసి దీక్ష చేసిన  మన త్యాగ మూర్తి స్తాపించిన పార్టీ ఇది.   మనం మాత్రం పక్క ప్రాంతం వారితో కోట్లల్లో వ్యాపారాలు చేసి సంపద గడించాలి.  తనని గుడ్డిగా నమ్మే ప్రజలు కష్ట పడాలి.    ఎలేచ్షన్స్, కలెక్షన్స్ ఎలేచ్షన్స్  ఇదే పని.   మనం బాగుంటే చాలు.   పేద, మధ్య తరగతి ప్రజలులు మాత్రం పేడ  బిర్యాని తింటూ కాలక్షేపం చెయ్యాలి.   తన పిల్లలు మాత్రము గుట్టు చప్పుడు కాకుండా గుంటూరు రత్తయ్య గారి దగ్గర పెద్ద చదువులు చదువుకోవచ్చు గాని, ఒస్మానియా పిల్లలు ఊళ్లకు వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా నీ చేతి మోచేతి నీళ్ళు తాగుతూ , రాబోయే ఉద్యమాలకు రాళ్ళు ఏరుకుంటూ  చదువులు లేకుండా వుండాలి    వాళ్ళ చదువు పూర్తి ఐన తరువాత  ఇంటికివేల్లెపుడు వీరే ధృవీకరణ పత్రం ఇస్తారు.   దాంట్లో ఫలానా వ్యక్తీ ఎన్ని కేసుల్లో వుంది, ఎన్ని ఏళ్ళు జైలులో వుండాలి అని.     దీన్నే అంటారు అరచేతులో పోసి మోచేత్తో నాకడం అని.    వీళ్ళకి తోడు  బాగా బూతులు వ్రాసి అవే పాడి అందరిని గాయపరచే వాగ్గేయ కారులు ....     వీరికి తోడూ బాగా చదువుకొని ( తన పిల్లల్ని అమెరికాలో చదివిస్తూ)  పిల్లలకు పాఠాలు మాత్రమే చెప్పాల్సిన ప్రొఫెసర్ గారు -  వీరు చదువు తప్ప అన్ని చెప్తారు.   

04) భా  జ పా : ఉత్తర ప్రదేశ్ అంత  పెద్ద రాష్ట్రం అయిన ఆ రాష్ట్రాన్ని విభజించ కూడదు.   ఎందుకంటే, ఆ ప్రాంతాలలో వారికి పట్టులేదు.    అర్ధమై పోలా నీచ రాజకీయం?     ఒకసారి మస్జిద్  కూల్చి పదవికి వస్తారు, మరోసారి మనుషుల్ని కూల్చి వద్దామనుకుంటారు.  నిజామాబాద్లో మాత్రం రాజీనామా చేఇంచిన పెద్దమనిషి హిమాయత్ నగర్లో మాత్రం ఉప ఎన్నిక వద్దంటాడు.    తనకు తెలుసు గెలవడని ??   ఒక సారి   MLA /MP గా గెలిచినా వాడెవ్వడు రెండో సారి గెల్చిన పాపానపోల.    ఇంకొకయానకి మూతే కాదు మనసు కూడా వంకరే.  హిందీ మాట్లాడే వాళ్లకు 20 రాష్ట్రాలు వున్నప్పుడు   తెలుగు వాళ్లకు 2 రాష్ట్రాలు వుంటే తప్పేంటి అనే వంకర మాటని వంకర మూతితో మాట్లాడడం కాదు - తెలుగు, తమిళం, మలయాళం ఒరియా, మహారాష్ట్ర లని భాష ప్రయుక్త రాష్ట్రాలు వెంకన్న గారికి బాగా తెలుసు.  కానీ  అమాయకంగా మాట్లాడతారు.     బోడిగుండుకు మోకాలికి ముడివేస్తే ఎట్లా?  ఈయన గారికి అసలు మనసులో విడగొట్టాలని వుంటే కదా?     పాపం మీ పార్టీ కర్ణాటకలో,   కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో వుంది కదా!   ఆపక్క బళ్ళారి (తుంగభద్రా ఆనకట్టతో సహా) ఈపక్కకు మీరు కలిపేస్తే,  హోసూరు కృష్ణగిరిలో నరకం అనుభవిస్తున్న తెలుగువాళ్ళు చిదoబరం   గారి  పుణ్యమా అని ఆంధ్ర ప్రదేశ్లో కలవచ్చు.   అప్పుడు వుండే రెండు రాష్ట్రాలు ఎవరికీ మాత్రం అభ్యంతరం వుంటుంది చెప్పండి.   బళ్లారి, రాయచూరు, హోసూరు, క్రిష్ణగిరి   ఈ 4 ప్రాంతాలు స్వాతంత్ర్యానంతరం ఆంధ్రలో వున్నవే కదా.     ఎంచక్కా మీ ఇద్దరు తెల్లటి లుంగీలు  కట్టుకొని మంచి మనసుతో అంగీకరించారూ.  అప్పుడంటే గాంధీ గారు రాజాజీ గారు వియ్యంకులు.    ఇప్పుడు మీ ఇద్దరు చుట్టాలు కాదు కదా.   

05) సి పి ఐ :  నారాయణ నారాయణ - చాల మంచోడు.   ఎప్పుడు ఎన్నికల్లో నిలబడడు.  తనకి తెలుసు తన కెపాసిటీ ఏందో.     ఏమ్చేసినా ఆ ప్రాంతంలో ఒక MLA కాదు కదా పంచాయతీ బోర్డు వార్డు మెంబెర్ పదవి కూడా దక్కదని.     సరే, చచినోడి  పెళ్ళికి వచ్చిoదే కట్నం అని మన యంగ్ అండ్ డైనమిక్ హీరో రానాయన మూర్తిని వేసుకొని తిరుగుతుంటాడు.   ఎన్ని సార్లు చెప్పిన పపెర్కి పేరు మాత్రం మార్చాడు.  ఎంతయినా విశాలాంధ్ర మీద ప్రేమే.      ఎవరు చదవని పపెర్కి ఏ  పేరు వుంటే  ఏoదిలే అని.   

06) సి పి ఎం : పాపం రాఘవులు.     ఎంత సిన్సురేగా వున్నా జనం నమ్మరు.  ఖర్మ ఖర్మ 

07) లోక్ సత్తా :   మొదట్లో బాగానే పట్టుగానే వుండే వాడు.   ఈటెల రాజేందర్, కె  టి  ఆర్, హరీష్ కుమ్మిన తర్వాత బాగా మార్పు వచ్చింది.     జిల్లాని ఒక రాష్ట్రం ఎందుకు చెయ్యకూడదు అంటాడు  

వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా -- 

08)  వై ఎస్ ఆర్ సి పి :  ఏ  చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ....రాయడానికి పెద్ద ఏమి లేదు.     దోచుకున్నోడికి దోచుకున్నంత మహాదేవా అని కొత్త సామెత -  నిజాం చెప్పాలంటే, సమర్ధుడైన నాయకుడు జగన్.    మన దేశంలో నీతిమంతుడైన నాయకుడు సమర్ధుడు కాదు.    సమర్ధుడైన వాడు నీతివంతుడు కాదు.    వాళ్ళ నాన్న వున్నన్నాళ్ళు, ఆయన ఫోటో చూసి (నీడ కాదు) ద డుచుకున్నోల్లు ఇప్పుడు తెగ మాట్లాడుతున్నారు.    ఈయనది 2 కళ్ళు కాదు 24 కళ్ళ సిద్ధాంతం.    అయితేనేం -

చదువు కున్నవాళ్ళు కూడా ఈ కుర్రోన్ని ఎందుకు బలపరుస్తున్నారో తెలుసా?    ప్రస్తుతం మన రాష్ట్రం వున్న  పరిస్తితుల్లో,  ఒక "మూర్ఖుడు" మాత్రమె (చాల పాజిటివ్ అర్ధంలో చెబుతున్న) దారిలో పెట్ట గలుగుతాడు.      తప్పో ఒప్పో కనీసం ఒక 5 సంవత్సరాలపాటు ఇతన్ని భరించటం ఆంధ్ర ప్రదేశ్కి అత్యవసరం.   


గమనిక :   రాజకీయ పార్టీల, కాంట్రాక్టర్ల, చదువు చెప్పని ఉపాధ్యాయుల మాటలు నమ్మి మోసపోకండి.    బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి.    


                                     

సి పి బ్రౌన్ జయంతి వేడుకలు

బెంగలూరులోని ప్రవాస ఆంధ్రులు సి పి బ్రౌన్ దొర గారి జయంతి సందర్భంగా చేపట్టిన వితరణ కార్యక్రమాల వార్తల లంకె ఈ దిగువన ఇస్తున్నాం: 


http://www.andhrajyothy.com/pdffiles/2012/nov/11/Ktk/kranataka12.pdf

http://epaper.sakshi.com/apnews/Bangalore/11112012/Details.aspx?id=1547335&boxid=26332224




10, నవంబర్ 2012, శనివారం

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798 - 1884)

"TO REVIVE THE LITERATURE OF A LANGUAGE WAS AN ARDUOUS TASK FOR ONE MAN AND HE A FOREIGNER"       -- C.P.BROWN

  తెలుగు భాషాభిమానులకు, సాహితీవేత్తలకు బ్రౌన్ దొర గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాని, నేటి తరానికి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.   నా  ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన గురించిన వివరాలను, భాషకు వారు చేసిన సేవ గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. 

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు కలకత్తాలో  1798 నవంబర్ 10వ తారీఖున రెవ. డేవిడ్ బ్రౌన్, కాలే దంపతులకు జన్మించారు.  తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన స్వర్గీయ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి పి బ్రౌన్) జయంతి ఈరోజు (10-11-1798).    19వ శతాబ్దం తోలి పాదంలో  మృతప్రాయమౌతున్న  తెలుగు భాషని అమృత ప్రాయముగా మలిచిన మహా వ్యక్తి  బ్రౌన్ దొరగారు.

1817 ఆగష్టు 4న రైటర్ ర్యాంకులో  సి ప బ్రౌన్ మద్రాసులో కాలు పెట్టాడు    అప్పటికి పాశ్చాత్య ప్రపంచంలో తెలుగు భాషను గూర్చి అంతగా పరిచయం లేదు.   తన తోలి ఉద్యోగం 1820 లో అప్పట్లో కడప  జిల్లా కల్లెక్టర్ గా వున్న  హుంబరి కి సహాయకుడుగా చేరారు    అప్పట్లో కడప జిల్లా కేంద్రం సిద్ధవటం లో వుండేది     పాలనా వ్యవహారాలూ తెలుగుతో పాటు హిందుస్తానీ కన్నడం మరాఠీ భాషల్లో జరుగుతుండేవి   కల్లెక్టర్ హన్బురి తెలుగులో స్వచ్చంగా, అనర్గళంగా మాట్లాడేవాడు.    హన్బరి కంటే తానూ మిన్నాగ తెలుగు  నేర్చుకోవాలన్న పట్టుదలతో బ్రౌన్ దొర  రెండేళ్లలో తెలుగు స్వచ్చంగా మాట్లాడగలిగే స్థితికి చేరుకున్నాడు.   తెలుగులో చదవదగ్గ సాహిత్యమే లేదన్నట్లు ఏ వగించుకొన్న కొందరు తెల్లదొరల అభిప్రాయం బ్రౌన్ కి  మానసికంగా కొంత బాధ కల్గించింది  

1823 జూన్ నెలలో ఆరు వారాల పాటు సెలవు పెట్టి మద్రాస్ వెళ్ళాడు బ్రౌన్ దొర .  పుస్తకాల పురుగైన బ్రౌన్ దొర  అబే దుబాయ్  అనే ఫ్రెంచ్ మత  గురువు రాసిని హిందూ మానర్స్ , కస్టమ్స్ అండ్ సేరిమనీస్ అనే పుస్తకం చదవడం జరిగింది    ఆ గ్రంధంలో వేమన కవి గురించి ప్రస్తావన కనిపించింది.    తాను  పనిచేస్తున్న కడప జిల్లాల్లోనే ఒక గొప్ప కవి, తాత్వికుడు వున్నాడని  గ్రహించి వేమన వ్రాసిన పద్యాల సేకరణకు నడుం బిగించాడు.  తను సేకరించిన తాటా కులకు గ్రంధ దర్పం  ఇప్పించే ప్రక్రియలో భాగంగా వేమన పద్యాలను మతం, నీతి,  అధిక్షేప, మర్మ విషయాలుగా విభజించి వీటిలోకి రాని పద్యాలని కలగూర గంప విభాలుగా నిర్దేశించాడు.   ఈ పద్యాలను ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేసి ప్రచురించాడు బ్రౌన్ దొర .    ఆజన్మ బ్రహ్మచారి ఐన  బ్రౌన్ దొర  వడ్డీలకు అప్పు తెచ్చి మరీ తెలుగు ప్రజలకు మేలు చేసాడు.   స్వర్గీయ తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి , స్వర్గీయ వఠెo  అద్వైత బ్రహ్మ శాస్త్రి(కారుమూరు గ్రామం రేపల్ల దగ్గర) వేమన పద్యాలకు అర్ధ తాత్పర్యాలు చెప్పి బ్రౌన్ దొరకు సహకరించారు.

బ్రౌన్ పండిత గరిమకు, తెలుగు భాషపై వున్న పట్టుకి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన వ్రాసిన తెలుగు నిఘంటువు.   1966 సంవత్సరంలో యధాతధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ముద్రిచడంతో ఆ నిఘంటువుల వైశిస్ట్యం  ద్యోతకమవుతుంది .

దాదాపు 24 భాషలలో పాండిత్యాని గడించిన బ్రౌన్ దొర 03-11-1884లో   తన వీలునామా వ్రాస్తూ తను ముద్రించిన, పరిష్కరించిన మరియు అముద్రిత రచనలను అన్నింటిని ఇండియా ఆఫీస్ లైబ్రరీకి చెందేటట్లు కోరాడు.   ఖర్చుల క్రింది కేవలం 10 పౌన్లు మాత్రం ఇవ్వాలన్నాడు.

తెలుగు భాషకు ఇంత  సేవ చేసిన బ్రౌన్ దొర  గారి చిత్రం ఎవరివద్ద లేదు.  కేవలం ఊహ చిత్రం మాత్రం తయారుచేసుకోగాలిగం.  

భగవంతుని దయవల్ల మన రాజకీయ నాయకులకు ఆయన కీర్తి గురించి పెద్దగా తెలీదు.   అందువల్లనే   ఆయన స్మారక విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టి  పడగొట్టించలేదు.    ఒక విదేశీయుడైనప్పట్టికి తెలుగు భాషలోని తియ్యదనాన్ని గుర్తించి అనిర్వచనీయమైన సేవ చేసిన   సి ప బ్రౌన్,  ప్రాతఃస్మరణీయుడు .    ఆయని జన్మ దినాన్ని తెలుగు వారు గుర్తుంచుకోవడం ఎంతైనా ముదావహం.

7, నవంబర్ 2012, బుధవారం

పాపం భా జ పా

ఏదో  గుట్టుగా సంసారం చేసుకుంటున్న గడకరి గారి అసలు రంగు బయటపడింది.    సూటుకేసులు  తీసుకుంటే సాక్ష్యాలు వుండవు గాని సూటుకేసులు కంపెనీలు స్థాపిస్తే జైలు పాలు కాక తప్పదు.     విజయమ్మ గారి చేతులలో  నిరంతరమూ వుండే మత  గ్రంధం మీద ఒట్టు, కావాలంటే జగన్ గారిని  అడగమనండి.   డ్రైవరు కండక్టరు  పేరుతొ వాటాలు, గుడిసెల చిరునామాలతో కంపెనీలు స్థాపించడమే  కాకుండా పైనుంచి బుకాయింపు.    దళితుడైన బంగారు లక్ష్మన్ లక్ష రూపాయలు పార్టీ ఫండ్ తీసుకుంటే జైలు శిక్ష మరియు తక్షణం పదవీత్యుచుతి.   


ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్న గడకరి గారి అసలు రంగు బయటపడింది.    సూటుకేసులు  తీసుకుంటే సాక్ష్యాలు వుండవు గాని సూటుకేసులు కంపెనీలు స్థాపిస్తే జైలు పాలు కాక తప్పదు.     విజయమ్మ గారి చేతులలో  నిరంతరమూ వుండే మత  గ్రంధం మీద ఒట్టు, కావాలంటే జగన్ గారిని  అడగమనండి.   డ్రైవరు కండక్టరు  పేరుతొ వాటాలు, గుడిసెల చిరునామాలతో కంపెనీలు స్థాపించడమే  కాకుండా పైనుంచి బుకాయింపు.    దళితుడైన బంగారు లక్ష్మన్ లక్ష రూపాయలు పార్టీ ఫండ్ తీసుకుంటే జైలు శిక్ష మరియు తక్షణం పదవీత్యుచుతి.   

ఇంకో విచిత్రం ఏంటంటే, జగన్ గారి  సూటుకేసులు కంపెనీలు మంచివే అని  సి బి ఐ కోర్టులో వాదించే రాం "జెట్" మలాని గారు, అలాంటి కంపెనీలు గడ్కారి గారికి వుండడడం తప్పు అంటే ఎట్లా??? "తప్పులెన్ను వారు తమ తప్పు లేరుగారాయ, విశ్వదాభి రామ..... అన్నట్లు కాంగ్రెస్సు పార్టీ మీద ఒంటికాలుపై లేచే భ జ పా వారు దొంగకు తెలు కుట్టినట్లు ఊరుకోవాల్సిన్దేగా మరి! 

తమ మీద పడ్డ సూటుకేసు మచ్చ తుడుచుకోవాలంటే, రీబోక్ షూస్ కొనుక్కోవాలి - ఎందుకా .....ఒడార్పో, పాదయాత్రో లేకపోతె భా జ పా స్టైల్లో రధ యాత్రో చెయ్యడానికి.

5, నవంబర్ 2012, సోమవారం

రాజకీయ తుఫాను


"నీలం" తుఫాను తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.   పంటలు తీవ్రంగా నష్టపోయాయి.    రోడ్లు, రైల్వీ ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.     

నీచ రాజకీయాలు మొదలయ్యాయి.....   కోస్తా ప్రాంతంలో తుఫాను వలన రాష్ట్రంలో పరిస్తితి అగ్గిలం మీద గుగ్గిలం లాగా వుంటే, మంత్రులు, ముఖ్యమంత్రి కట్టుకట్టుకొని ఢిల్లీ కాంగ్రెస్ రాల్ల్య్లోకి వెళ్తారా??     అసలే కర్రెంట్ లేక చస్తుంటే బొత్స కుటుంబానికి పెళ్లి సందర్భంగా కర్రెంట్ కోట ఎత్తేస్తార??

ముఖ్యమంత్రి గారు ఆయన సహచర మంత్రులంతా ఇక్కడే వున్నా తుఫానును ఆపగలిగే వుండేవాళ్ళు కాదుకదా ముద్దుక్రిశ్నమ నాయుడు గారు!      తొందర పడితే ఎలా?    సహాయ కార్యక్రమాలు మొదలోవతాయ్.   శవాలమీద వాలటానికి, వాళ్ళ కుటమ్బాలకిచ్చే రాయతీలు నొక్కడానికి రాబందులు కూడా రెక్కలు విదుల్చు కోవాలి కదా.    కొంచం సమయం ఇవ్వండి సారూ.