ఇటీవల ఒక సభలో మహా సహస్రావధాని డా॥ గరికిపాటి వారు తన చిన్న తనంలో పాఠశాలలో ఇచ్చే ఇంటిపనిని (హోం వర్క్) గుర్తుచేశారు. అదేంటో చూద్దాం --
వంగతోట నుండు, వరిమళ్ళలో నుండు
జొన్నచేలనుండు, చోద్యముగను
తలుపుమూల నుండు, తలమీద నుండు
దీని భావమేమి తిరుమలేశా!
వంగతోటలో వుండేది, వరిమళ్ళలో వుండేది ఏమిటో కనుక్కోమన్నారా?
ఈ పద్యంలో ఒక చిన్న కిటుకు దాగి వుంది, చాలా మందికి తెలిసే వున్దచ్చు. బాగా ప్రయత్నం చేసిన తరువాత కూడా అంతు చిక్కకపోతే, .......... అనుసరించండి
.....
........
...........
................
పద్యాన్ని ఇలా చదివి చూడండి
..........................
వంగ తోట నుండు, వరి మళ్ళలో నుండు (వంకాయ కోసినదాక తోటలోనే కదండీ వుండేది; వరికూడా)
జొన్న చేలనుండు చోద్యముగను (జొన్న చేలోనే వుంటుంది)
తలుపు మూల నుండు, తల మీద నుండు (ఎవరింటికైనా తలుపు ఒక మూలలోనే వుంటుంది; అలాగే తల మీదే వుంటుంది)
దీని భావమిదియె తిరుమలేశా!
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి