10, నవంబర్ 2012, శనివారం

ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (1798 - 1884)

"TO REVIVE THE LITERATURE OF A LANGUAGE WAS AN ARDUOUS TASK FOR ONE MAN AND HE A FOREIGNER"       -- C.P.BROWN

  తెలుగు భాషాభిమానులకు, సాహితీవేత్తలకు బ్రౌన్ దొర గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాని, నేటి తరానికి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.   నా  ఈ ప్రయత్నంలో భాగంగానే ఆయన గురించిన వివరాలను, భాషకు వారు చేసిన సేవ గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. 

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు కలకత్తాలో  1798 నవంబర్ 10వ తారీఖున రెవ. డేవిడ్ బ్రౌన్, కాలే దంపతులకు జన్మించారు.  తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన స్వర్గీయ ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి పి బ్రౌన్) జయంతి ఈరోజు (10-11-1798).    19వ శతాబ్దం తోలి పాదంలో  మృతప్రాయమౌతున్న  తెలుగు భాషని అమృత ప్రాయముగా మలిచిన మహా వ్యక్తి  బ్రౌన్ దొరగారు.

1817 ఆగష్టు 4న రైటర్ ర్యాంకులో  సి ప బ్రౌన్ మద్రాసులో కాలు పెట్టాడు    అప్పటికి పాశ్చాత్య ప్రపంచంలో తెలుగు భాషను గూర్చి అంతగా పరిచయం లేదు.   తన తోలి ఉద్యోగం 1820 లో అప్పట్లో కడప  జిల్లా కల్లెక్టర్ గా వున్న  హుంబరి కి సహాయకుడుగా చేరారు    అప్పట్లో కడప జిల్లా కేంద్రం సిద్ధవటం లో వుండేది     పాలనా వ్యవహారాలూ తెలుగుతో పాటు హిందుస్తానీ కన్నడం మరాఠీ భాషల్లో జరుగుతుండేవి   కల్లెక్టర్ హన్బురి తెలుగులో స్వచ్చంగా, అనర్గళంగా మాట్లాడేవాడు.    హన్బరి కంటే తానూ మిన్నాగ తెలుగు  నేర్చుకోవాలన్న పట్టుదలతో బ్రౌన్ దొర  రెండేళ్లలో తెలుగు స్వచ్చంగా మాట్లాడగలిగే స్థితికి చేరుకున్నాడు.   తెలుగులో చదవదగ్గ సాహిత్యమే లేదన్నట్లు ఏ వగించుకొన్న కొందరు తెల్లదొరల అభిప్రాయం బ్రౌన్ కి  మానసికంగా కొంత బాధ కల్గించింది  

1823 జూన్ నెలలో ఆరు వారాల పాటు సెలవు పెట్టి మద్రాస్ వెళ్ళాడు బ్రౌన్ దొర .  పుస్తకాల పురుగైన బ్రౌన్ దొర  అబే దుబాయ్  అనే ఫ్రెంచ్ మత  గురువు రాసిని హిందూ మానర్స్ , కస్టమ్స్ అండ్ సేరిమనీస్ అనే పుస్తకం చదవడం జరిగింది    ఆ గ్రంధంలో వేమన కవి గురించి ప్రస్తావన కనిపించింది.    తాను  పనిచేస్తున్న కడప జిల్లాల్లోనే ఒక గొప్ప కవి, తాత్వికుడు వున్నాడని  గ్రహించి వేమన వ్రాసిన పద్యాల సేకరణకు నడుం బిగించాడు.  తను సేకరించిన తాటా కులకు గ్రంధ దర్పం  ఇప్పించే ప్రక్రియలో భాగంగా వేమన పద్యాలను మతం, నీతి,  అధిక్షేప, మర్మ విషయాలుగా విభజించి వీటిలోకి రాని పద్యాలని కలగూర గంప విభాలుగా నిర్దేశించాడు.   ఈ పద్యాలను ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేసి ప్రచురించాడు బ్రౌన్ దొర .    ఆజన్మ బ్రహ్మచారి ఐన  బ్రౌన్ దొర  వడ్డీలకు అప్పు తెచ్చి మరీ తెలుగు ప్రజలకు మేలు చేసాడు.   స్వర్గీయ తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి , స్వర్గీయ వఠెo  అద్వైత బ్రహ్మ శాస్త్రి(కారుమూరు గ్రామం రేపల్ల దగ్గర) వేమన పద్యాలకు అర్ధ తాత్పర్యాలు చెప్పి బ్రౌన్ దొరకు సహకరించారు.

బ్రౌన్ పండిత గరిమకు, తెలుగు భాషపై వున్న పట్టుకి ప్రత్యక్ష సాక్ష్యం ఆయన వ్రాసిన తెలుగు నిఘంటువు.   1966 సంవత్సరంలో యధాతధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ముద్రిచడంతో ఆ నిఘంటువుల వైశిస్ట్యం  ద్యోతకమవుతుంది .

దాదాపు 24 భాషలలో పాండిత్యాని గడించిన బ్రౌన్ దొర 03-11-1884లో   తన వీలునామా వ్రాస్తూ తను ముద్రించిన, పరిష్కరించిన మరియు అముద్రిత రచనలను అన్నింటిని ఇండియా ఆఫీస్ లైబ్రరీకి చెందేటట్లు కోరాడు.   ఖర్చుల క్రింది కేవలం 10 పౌన్లు మాత్రం ఇవ్వాలన్నాడు.

తెలుగు భాషకు ఇంత  సేవ చేసిన బ్రౌన్ దొర  గారి చిత్రం ఎవరివద్ద లేదు.  కేవలం ఊహ చిత్రం మాత్రం తయారుచేసుకోగాలిగం.  

భగవంతుని దయవల్ల మన రాజకీయ నాయకులకు ఆయన కీర్తి గురించి పెద్దగా తెలీదు.   అందువల్లనే   ఆయన స్మారక విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెట్టి  పడగొట్టించలేదు.    ఒక విదేశీయుడైనప్పట్టికి తెలుగు భాషలోని తియ్యదనాన్ని గుర్తించి అనిర్వచనీయమైన సేవ చేసిన   సి ప బ్రౌన్,  ప్రాతఃస్మరణీయుడు .    ఆయని జన్మ దినాన్ని తెలుగు వారు గుర్తుంచుకోవడం ఎంతైనా ముదావహం.

5 కామెంట్‌లు :