ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రజా బాహుళ్యంలో చేర్చబడ్డ చాలా కొత్త పదాలలో " రెండు కళ్ళ సిద్ధాంతం" ప్రముఖమైనది. అతి సులభంగా వాడుకలోకి వచ్చిన నరుకుతా, బొంద పెడతా, రైలు పట్టాలు పీకుతా, నాలుకలు కోస్తా మొదలైన పదాలకి " రెండు కళ్ళ సిద్ధాంతం" అనే దానికి చాలా వ్యత్యాసం వుంది. ఈ సిద్ధాంతం డార్విన్ గాని న్యూటన్ గాని లేదా మనందరికీ గుర్తులేని మన తెలుగువారు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారు గాని కనిపెట్టింది కాదు. మన రాజకీయ గురువిందలు ఎదుటివాళ్ళని తిట్టేతందుకు ప్రతిపాదించినది మాత్రమె. ఈ గురువింద పార్టీల గురించి తెలుసుకుందాము --
01) తే దే పా : మీరు శాసనసభలో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నట్లు తీర్మానం పెట్టండి, మేము రేనాల్డ్స్ పెన్నుతో చెరిగిపోకుండా సంతకం పెడతాము, బస్తీమే సవాల్ అని మేక పోతూ గాంభీర్య ప్రదర్శించి అడ్డంగా దొరికిపోయారు. బూట్లు అరిగేలా పాదయాత్ర చేసి మాత్రము ఏమి లాభము చెప్పండి. రెండిటికి చెడ్డ రేవడి అయ్యింది వీరి పరిస్తితి. తీర్మానం చేసిందాకా ఆ ప్రాంతం వాళ్ళు నోరుమూసుకొని వుండి , తీర అమ్మగారు పుట్టిన రోజుకి ఆంధ్ర ప్రదేశ్ అనే కే కును కత్తిరిచ్చే సరికి రాజి నామాలు, రాజకీయాలు, పరుగేత్తడాలు, రంకెలు వెయ్యడాలు. బస్సులు తగలపెట్టండి, ధర్నా చేయండి, ఉద్యమించండి అని చెప్పేదేదో సంతకం పెట్టకముందు చెప్తే ఈ తిరుగుళ్ళు ఉండేవి కాదు. పాపం బాబు గారు ఏ పని చేసినా కనిపిచ్చి కనిపిచాకుండా, వినిపిచ్చి వినిపిచ్చాకుండా చేస్తారు. నేను వ్యతిరేకం కాదు అంటాడు కాని అనుకూలం అని మాత్రం చెప్పాడు. కర్ర విరక్కుండా పాముని చంపడమంటే ఇదే మరి.
02) కాంగ్రెస్ : తనది కాకపొతే తాటిమట్టికు ఎదురు దేకమన్న్దట వెనకటికి ఎవడో. పాపం చిదంబరం గారు లుంగీ గట్టిగా చుట్టుకొని, తమలపాకులుచ్చి (ఆయన రెండు నోట్లో వేసుకొని) మూడేళ్ళపాటు తన్నుకోండి తర్వాత చూద్దాము అన్నారు. ఈయనగారు వెలిగించిన చిచుబుడ్డి టాంకు బండ్ మీద నీళ్ళల్లో నిలబడ్డ బుద్ధుడి సాక్షిగా, మురికినీళ్లలో పడిన "గబ్బిలం" జాషువా గారి సాక్షిగా, అన్యం పుణ్యం తెలియని అన్నమ్మయ్య సాక్షిగా, ఇంకా వెలుగుతూనే వుంది. ఒక పార్లమెంటు సభ్యుడేమో తన పరిశ్రమలు కాలుష్యం అనే విషం చిమ్ముతూ విశాఖ లోనో, పక్క రాష్ట్రం మహారాష్ట్రలోనో పెట్టుకొని తన ప్రాంతం వాళ్లకి ఉద్యోగాలు రాలేదని నానా యాగీ చేస్తాడు. 3 పార్టీలు మారి 3 చెరువుల నీళ్ళు తాగి (తను మాత్రం ఫిల్టర్ నీళ్ళు తాగుతాడు) నా నియోజిక వర్గములో ఫ్లోరైడు సమస్య వుంది కేవలం కలిసి వుండడం వల్లే ఇది వుంది లేకపోతె చేత్తో తీసేసినట్లు పొయ్యేది అని సెలవిస్తారు. ఇంకొక జంట కవులేమో కోట్లల్లో కాంట్రాక్టులు చేసుకుంటూ, జాతీయ రహదారులపై అడ్డంగా గోడలు కట్టిస్తారు. మరి ముఖ్యంగా సగం ఆంగ్లం, సగం తెలుగులో మాట్లాడే ఎప్పుడు ప్రత్యక్ష ఎన్నికలలో పంచాయతి బోర్డు సభ్యునిగా కూడా ఎన్నుకోబడని వారి సంగతి సరే సరి. మొన్న మొన్నటిదాకా అమెరికాలోవుండి , అమాంతం వూడిపడ్డ మరొక నాయకుడు చేతికి మట్టి అంటకుండా పిల్లలని రెచ్చ గొట్టడంలో సిద్దహస్తుడు . వీరుగాక - కేరళ నుంచి NGO గా వచ్చిన ఒక పెద్ద మనిషి, కర్నాటక రాష్ట్రంనుంచి, మహారాష్ట్ర నుంచి ఇక్కడ స్థిరపడిన పెద్దమనుషులు అప్పుడప్పుడు విరుచుక పడతారు. మరి ఆ ప్రాంతంలో వున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లు... కేవలం ఈ ప్రాంతంలో ఉద్యమిస్తే మాత్రమె అక్కడ మొదలు పెడతారు. తమాషా ఏంటంటే - ఆ ప్రాంతంలో నువ్వు ఎన్ని వుద్యమాలైనా చెయి కాని పిల్లల చదువు చెడ కోట్ట కుండా చెయ్యాలి. కొంతలో కొంత మేలు. ఇదే చదువు చెప్పకుండా జీతం తీసుకొని విద్యార్దుల జీవితాలని నాశనం చేసే ప్రొఫెసర్ గారికి ఆ ప్రాంతంలో వుండే గుత్తేదార్ పార్లమెంటు సభ్యులకు వున్న తేడా.
03) తె రా స : రంగు నీళ్ళని కిరసనాయలుగా భావించి నెత్తిన పోసుకొని అగ్గిపెట్ట కోసం అరగంట వెదికి 600 మంది చనిపోవడానికి స్పూర్తిగా నిలిచిన మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు ఎదిగిన పార్టీ ఇది. తనకు తన పిల్లలకు కనీసం తలనొప్పి గాని జ్వరం గాని రాకుండా కేవలం పెద్ద పదవులు మాత్రమె దక్కేతట్లు ప్రణాళిక రూపొందిచిన మహనీయుడు, ఒక రోజు పూర్తిగా ఘన, ద్రవ పదార్ధాలని త్యాగం చేసి దీక్ష చేసిన మన త్యాగ మూర్తి స్తాపించిన పార్టీ ఇది. మనం మాత్రం పక్క ప్రాంతం వారితో కోట్లల్లో వ్యాపారాలు చేసి సంపద గడించాలి. తనని గుడ్డిగా నమ్మే ప్రజలు కష్ట పడాలి. ఎలేచ్షన్స్, కలెక్షన్స్ ఎలేచ్షన్స్ ఇదే పని. మనం బాగుంటే చాలు. పేద, మధ్య తరగతి ప్రజలులు మాత్రం పేడ బిర్యాని తింటూ కాలక్షేపం చెయ్యాలి. తన పిల్లలు మాత్రము గుట్టు చప్పుడు కాకుండా గుంటూరు రత్తయ్య గారి దగ్గర పెద్ద చదువులు చదువుకోవచ్చు గాని, ఒస్మానియా పిల్లలు ఊళ్లకు వెళ్ళే వాళ్ళని వెళ్ళనీయకుండా నీ చేతి మోచేతి నీళ్ళు తాగుతూ , రాబోయే ఉద్యమాలకు రాళ్ళు ఏరుకుంటూ చదువులు లేకుండా వుండాలి వాళ్ళ చదువు పూర్తి ఐన తరువాత ఇంటికివేల్లెపుడు వీరే ధృవీకరణ పత్రం ఇస్తారు. దాంట్లో ఫలానా వ్యక్తీ ఎన్ని కేసుల్లో వుంది, ఎన్ని ఏళ్ళు జైలులో వుండాలి అని. దీన్నే అంటారు అరచేతులో పోసి మోచేత్తో నాకడం అని. వీళ్ళకి తోడు బాగా బూతులు వ్రాసి అవే పాడి అందరిని గాయపరచే వాగ్గేయ కారులు .... వీరికి తోడూ బాగా చదువుకొని ( తన పిల్లల్ని అమెరికాలో చదివిస్తూ) పిల్లలకు పాఠాలు మాత్రమే చెప్పాల్సిన ప్రొఫెసర్ గారు - వీరు చదువు తప్ప అన్ని చెప్తారు.
04) భా జ పా : ఉత్తర ప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రం అయిన ఆ రాష్ట్రాన్ని విభజించ కూడదు. ఎందుకంటే, ఆ ప్రాంతాలలో వారికి పట్టులేదు. అర్ధమై పోలా నీచ రాజకీయం? ఒకసారి మస్జిద్ కూల్చి పదవికి వస్తారు, మరోసారి మనుషుల్ని కూల్చి వద్దామనుకుంటారు. నిజామాబాద్లో మాత్రం రాజీనామా చేఇంచిన పెద్దమనిషి హిమాయత్ నగర్లో మాత్రం ఉప ఎన్నిక వద్దంటాడు. తనకు తెలుసు గెలవడని ?? ఒక సారి MLA /MP గా గెలిచినా వాడెవ్వడు రెండో సారి గెల్చిన పాపానపోల. ఇంకొకయానకి మూతే కాదు మనసు కూడా వంకరే. హిందీ మాట్లాడే వాళ్లకు 20 రాష్ట్రాలు వున్నప్పుడు తెలుగు వాళ్లకు 2 రాష్ట్రాలు వుంటే తప్పేంటి అనే వంకర మాటని వంకర మూతితో మాట్లాడడం కాదు - తెలుగు, తమిళం, మలయాళం ఒరియా, మహారాష్ట్ర లని భాష ప్రయుక్త రాష్ట్రాలు వెంకన్న గారికి బాగా తెలుసు. కానీ అమాయకంగా మాట్లాడతారు. బోడిగుండుకు మోకాలికి ముడివేస్తే ఎట్లా? ఈయన గారికి అసలు మనసులో విడగొట్టాలని వుంటే కదా? పాపం మీ పార్టీ కర్ణాటకలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో వుంది కదా! ఆపక్క బళ్ళారి (తుంగభద్రా ఆనకట్టతో సహా) ఈపక్కకు మీరు కలిపేస్తే, హోసూరు కృష్ణగిరిలో నరకం అనుభవిస్తున్న తెలుగువాళ్ళు చిదoబరం గారి పుణ్యమా అని ఆంధ్ర ప్రదేశ్లో కలవచ్చు. అప్పుడు వుండే రెండు రాష్ట్రాలు ఎవరికీ మాత్రం అభ్యంతరం వుంటుంది చెప్పండి. బళ్లారి, రాయచూరు, హోసూరు, క్రిష్ణగిరి ఈ 4 ప్రాంతాలు స్వాతంత్ర్యానంతరం ఆంధ్రలో వున్నవే కదా. ఎంచక్కా మీ ఇద్దరు తెల్లటి లుంగీలు కట్టుకొని మంచి మనసుతో అంగీకరించారూ. అప్పుడంటే గాంధీ గారు రాజాజీ గారు వియ్యంకులు. ఇప్పుడు మీ ఇద్దరు చుట్టాలు కాదు కదా.
05) సి పి ఐ : నారాయణ నారాయణ - చాల మంచోడు. ఎప్పుడు ఎన్నికల్లో నిలబడడు. తనకి తెలుసు తన కెపాసిటీ ఏందో. ఏమ్చేసినా ఆ ప్రాంతంలో ఒక MLA కాదు కదా పంచాయతీ బోర్డు వార్డు మెంబెర్ పదవి కూడా దక్కదని. సరే, చచినోడి పెళ్ళికి వచ్చిoదే కట్నం అని మన యంగ్ అండ్ డైనమిక్ హీరో రానాయన మూర్తిని వేసుకొని తిరుగుతుంటాడు. ఎన్ని సార్లు చెప్పిన పపెర్కి పేరు మాత్రం మార్చాడు. ఎంతయినా విశాలాంధ్ర మీద ప్రేమే. ఎవరు చదవని పపెర్కి ఏ పేరు వుంటే ఏoదిలే అని.
06) సి పి ఎం : పాపం రాఘవులు. ఎంత సిన్సురేగా వున్నా జనం నమ్మరు. ఖర్మ ఖర్మ
07) లోక్ సత్తా : మొదట్లో బాగానే పట్టుగానే వుండే వాడు. ఈటెల రాజేందర్, కె టి ఆర్, హరీష్ కుమ్మిన తర్వాత బాగా మార్పు వచ్చింది. జిల్లాని ఒక రాష్ట్రం ఎందుకు చెయ్యకూడదు అంటాడు
వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా --
08) వై ఎస్ ఆర్ సి పి : ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ....రాయడానికి పెద్ద ఏమి లేదు. దోచుకున్నోడికి దోచుకున్నంత మహాదేవా అని కొత్త సామెత - నిజాం చెప్పాలంటే, సమర్ధుడైన నాయకుడు జగన్. మన దేశంలో నీతిమంతుడైన నాయకుడు సమర్ధుడు కాదు. సమర్ధుడైన వాడు నీతివంతుడు కాదు. వాళ్ళ నాన్న వున్నన్నాళ్ళు, ఆయన ఫోటో చూసి (నీడ కాదు) ద డుచుకున్నోల్లు ఇప్పుడు తెగ మాట్లాడుతున్నారు. ఈయనది 2 కళ్ళు కాదు 24 కళ్ళ సిద్ధాంతం. అయితేనేం -
చదువు కున్నవాళ్ళు కూడా ఈ కుర్రోన్ని ఎందుకు బలపరుస్తున్నారో తెలుసా? ప్రస్తుతం మన రాష్ట్రం వున్న పరిస్తితుల్లో, ఒక "మూర్ఖుడు" మాత్రమె (చాల పాజిటివ్ అర్ధంలో చెబుతున్న) దారిలో పెట్ట గలుగుతాడు. తప్పో ఒప్పో కనీసం ఒక 5 సంవత్సరాలపాటు ఇతన్ని భరించటం ఆంధ్ర ప్రదేశ్కి అత్యవసరం.
గమనిక : రాజకీయ పార్టీల, కాంట్రాక్టర్ల, చదువు చెప్పని ఉపాధ్యాయుల మాటలు నమ్మి మోసపోకండి. బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి.
చాలా బాగా వ్రాసావు చంద్రశెఖర్
రిప్లయితొలగించండి