2, జూన్ 2014, సోమవారం

మరో తెలుగు రాష్ట్రం ఏర్పడక తప్పదా ?


గత రెండు వారాలుగా జరుగుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  పరిస్థితులను గమనిస్తే ప్రత్యేక రాయలసీమ కూడా ఏదో ఒక రోజు ఆవిర్భవించక తప్పదేమో అనిపిస్తుంది.     అన్ని కార్యాలయాలు ఒకే చోట పోగు చేసే కుట్ర జరుగుతున్నది.   

రాజధాని గుంటూరు-బెజవాడ మధ్య 
వ్యవసాయ విశ్వ విద్యాలయం - గుంటూరు జిల్లా లాం అనుకూలమైనది 
రైల్వే డివిజన్ - బెజవాడ  బాగా అనుకూలమైనది 
శాసన సభ - రాజధాని ఎక్కడుంటే అది కూడా అక్కడే వుండాలి కదా 
ఆర్టీసీ కేంద్ర కార్యాలయం - విజయవాడైతే బాగుంటుంది 
మెట్రో రైలు - విజయవాడ - గుంటూరు - తెనాలి బాగా అనుకూలం 
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం - విజయవాడ నుంచే జనాలు ఎక్కువ                                                          విమానం ఎక్కువ ఎక్కుతారు 
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం - ఇంకెక్కడ విజయవాడ 
ఉన్నత న్యాయ స్థానం - గతంలో ఒప్పుకున్న గుంటూరు 
డి ఐ జి కార్యాలయం - మంగళగిరిలో పానకాలు స్వామి సాక్షిగా 


ఇక మిగిలినవి -- 
పెద్ద కేంద్ర కారాగారం - కడప బాగా అనువైనది 
ఐ ఐ టి - ఇచ్చినప్పుడు చూద్దాం 
ఐ ఐ ఎం - వచ్చినప్పుడు చూద్దాం 

మరి రాయలసీమకో - ముఖ్యమంత్రే రాయలసీమ నుంచి వచ్చాడు.   అదో పెద్ద వరం.  

ఇప్పటికే హైదరాబాదు కేంద్రంగా జరిగిన అభివృద్ధితో తల బొప్పి కట్టింది.   ఇప్పుడు విజయవాడ కేంద్రంగా అదే తంతు జరగబోతోంది.    రాష్ట్రాలు ఏర్పడింది, ఏర్పడేది రియల్ ఎస్టేట్ యజమానులకొసమా లేక సామాన్యుల కోసమా తెలియని పరిస్తితి.   సామాన్యుడు గుంటూరు విజయవాడ పరిసరాల్లో సెంటు స్థలం కొనుగోలు చేసే పరిస్థితులలో లేదంటే నమ్మండి.    

వచ్చే ఎన్నికలలో కూడా జగన్ పార్టీ,  కాంగ్రెస్ పార్టీ చతికిల పడితే, తీరిక సమయం ఎక్కువ వుంటుంది కాబట్టి విజన్ 2025 లో భాగంగా ప్రత్యెక రాయలసీమ ఉద్యమం బలపడే అవకాశం వుంది.    ఏం తెలుగు వారికి మూడు రాష్ట్రాలు ముగ్గురు ముఖ్యమంత్రులు వుంటే తప్పా?   శ్రీ బాగ్ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు.   మేము మద్రాస్ తోనే కలిసివుంటాం అంటే, మమ్మల్ని మభ్య పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో కలుపుకున్నారు.   సినిమాలలో మమ్మల్ని ఫాక్షనిష్టులుగా చూపిస్తూ అవమాన పరుస్తున్నారు.  మా భాష వేరు మా యాస వేరు, మా తిండి వేరు, మా వేష భాషలు, సంస్కృతి వేరు. అమాయక రాయలసీమ ప్రజలను ఆంధ్రులు ఎంతకాలం దోపిడీ చేస్తారు అని వరస డవిలాగులు మళ్ళీ ఒక దశాబ్దం తరువాత వినాల్సి రావచ్చు. హంపీ కోట బాక్ డ్రాపుతో తిమ్మమ్మ మర్రిమాను సాక్షిగా మరో లోగో గీయవచ్చు. 

ఆర్ధికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ (ముఖ్యంగా అనంతపూర్) ప్రాంతాలకు మంచి జరిగినప్పుడు మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలోని అసమానతలు తొలగి మరో విభజనకు బీజం పడకుండా వుంటుంది. 

14 కామెంట్‌లు :

  1. Very good.

    Either all Telugu speaking districts need to be merged with surrounding states or each of these districts be declared a separate state lest we Telugu people should never stop fighting amongst ourselves.

    I'm quite thoroughly fed up with the divisive politics!

    రిప్లయితొలగించండి
  2. "ముఖ్యమంత్రే రాయలసీమ నుంచి వచ్చాడు. అదో పెద్ద వరం"

    ముఖ్యమంత్రి పేరుకే రాయలసీమ వాడు. ఆయన కళ్ళన్నీ(రెండో ఇంకా ఎక్కువో) కోస్తా ఆంద్ర వైపే.

    రిప్లయితొలగించండి
  3. భాషాభిమానం, జాతిగౌరవం చచ్చాక రెండుముక్కలైతేనేం, ఇరవై ముక్కలైతేనేం ? అంతా ఒకటే. మనం తెలుగువాళ్ళుగా ఎప్పుడో చచ్చిపోయాం. ప్రస్తుతం ప్రాంతాలుగా మిగిలాం. ఇంకెందుకులే, ఎవరి ముక్క వాళ్ళు పీక్కుపొండి, అది ఎంత చిన్నదైనా గానీ ! కావాల్సింది ప్రాంతీయ అహంకార తృప్తే కదా ?

    రిప్లయితొలగించండి
  4. వ్రుత్తాంతి గారు,

    మీరు అంటున్నది కొంతవరకే నిజం. పైకి అలా కనిపిస్తున్నా, hyderabad విషయంలో, తెలబానుల విషయంలో జరిగిన పొరబాట్లు మళ్లీ మళ్లీ జరగకుండా చాలా కసరత్తే చేస్తున్నారు. ఓ మిత్రుడు administration లో ఉండటం వలన నాకు తెలిసిన విషయాలు,

    1. ముఖ్యం గా అధిక జీతాలు వచ్చే software ఉధ్యోగాలు, వాటికి సంబంధిన పార్క్లు vishaakha లో కేంద్రీకరించటానికి
    2. hardware park (ఇప్పటివర్కు మన రాష్ట్రం లో ఒక్కటంటే ఒక్కటి సరైన ది ఇంకా రాలేదు) తిరుపతి ప్రాంతం లో కేంద్రీకరించటానికి
    3. ఇప్పటికే నెల్లోరు ప్రాంతం లో బలపడిన apparrel industry ని సప్పోర్ట్ చేయటానికి
    4. వానపిక్ పేరుతో తీసుకొన్న తీరప్రాంతం క్రొథపట్టణం నుండి, నిజాం పట్టణం వరకు ఉన్న మెజారిటీ తీర ప్రాంతాన్నంతా indurstrial carridar గా declare చేసి, manufacturing industries కు allot చేయటానికి
    5. బందరు పోర్ట్ డెవెలొప్ చేయటానికి
    6. విధ్యుత్ మరియు క్రిష్న వాటర్ సంబంధించిన వన్నీ కర్నూల్ లో పెట్టటానికి

    గట్రా ప్లాన్ లు జరుగుతున్నాయి.

    మీరన్న సెక్రటరేటియట్, హికోర్ట్ లాంటి పెద్దగా చోటు అవసరం లేనివి మాత్రమే క్రిష్ణ, గుంటూర్ లలో అనుకొంటున్నారు.

    ఎందుకంటే మీరన్నట్లు అక్కడ భూమి లేదు పెద్దగా, ఉన్నా అది సామాన్యుడే కాదు, ప్రభుత్వం కూడా మార్కేట్ ధర ఇచ్చి acquire చేసే పరిస్థితి లేదు.

    ఇక international airport ఒంగోలు అంటున్నారు, దానికి విజయవాడ, గుంటూర్ లలో చోటు లేదన్నంది కూడా ఒక కారణం.

    ఇది కోస్తా, సీమ వాసుల సమస్య, తెలబానుల లాగా మనం పరాన్నభుక్కలం కాదు, కష్ట జీవులం, మన మీద మనకు నమ్మకం ఉన్న వాళ్లం, ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి ఏడ్చే తత్వం ఉన్నవాళ్లం కాదు కాబట్టి, ఓ సారి చేసిన తప్పు మరో సారి జరగకుండా జాగ్రత్తపడదాము అందరం తప్పకుండా!!

    ఇక అతి తెలివి ఏడుపుగొట్టు తెలబానులు కూడా మీ బ్లాగులో కామెంట్ వ్రాయటం మాత్రం పెద్ద జోకు, వాళ్లకు మన విధ్యుత్తు, మనం పెంచిన రాజధాని లాంటివి అప్పనం గా దోచుకొన్నా కళ్ళు, కడుపు చల్లబడినట్లు లేదు, ఎమి చేస్తాం కొందరి బ్రతుకులు అంతే :)

    రిప్లయితొలగించండి
  5. i request you to kindly restrain from using any objectionable language. Telugu people whereever they are should do well and live in peace. Lets take oath that we should not be the first to abuse other region people.

    రిప్లయితొలగించండి
  6. మరీ ఇంత అతి మంచితనం చూపించకండి నిమ్మగడ్డగారూ ! మనం అలా చూపించీ చూపించే ఇప్పుడు నెత్తిమీదికి చేతులొచ్చాయి. మీ పోస్టు కింద వచ్చిన వ్యాఖ్యల్లో నాకు ఏ అభ్యంతరకరాలూ కనిపించలేదు. తెలబాన్ల బ్లాగుల్లో మనల్ని ఏకిపారేసే విధానం చూస్తే మనవాళ్ళు ఎంత పద్ధతైన మనుషులో మీకర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  7. అఙాత గారు,

    క్షమించండి. మీరు రాసిన పలు వ్యాఖ్యల్ని నేను తొలగించాను. గతంలో ఎక్కువమంది తెలంగాణా రాజకీయ నాయకులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన మాట వాస్తవం (ఆంధ్రా నుండి చెయ్యలేదని కాదు). దానిని మనం ఆయా ప్రాంత ప్రజలకు ఆపాదించవద్దు. మనం ప్రస్తుతానికి వద్దాం. ఇరు ప్రాంతాలలో ప్రజలలో నెలకొన్న అపోహలను తొలగించడానికి కొన్ని రకాల చర్యలు చేపట్టాలి. తి తి దే చైర్మన్ గిరి కె వి రమనా చారి లాంటి వారికి ఇచ్చి భద్రాచలం గుడి బాధ్యత ఆంధ్రా నాయకులకు కొంత కాలం ఇవ్వవచ్చు. విభజన వలన తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా భవిష్యత్తులో ఆంధ్రులు ముందుండే అవకాశాలు మెండుగా వున్నాయి. ఆంధ్ర రాష్త్రంలో వున్న రాజకీయ అనుభవం, కేంద్రంతో వున్న సంబంధాలు ఆంధ్రాకు వుపయోగపడే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. మన సోదర నెటిజన్లు కూదా వాళ్ళ భాషను మార్చుకుంటారని ఆశిద్దాం. మంచి చెడు అన్ని దగ్గర్లా వుంటుంది.


    రిప్లయితొలగించండి
  8. విభజన వలన తాత్కాలికంగా కొంత నష్టం జరిగినా భవిష్యత్తులో ఆంధ్రులు ముందుండే అవకాశాలు మెండుగా వున్నాయి
    భలే చెప్పారు. ఆంధ్రుల కులగజ్జి వలన అయిన అభివృద్ది ఫలాలు అందకుండా సర్వం తెలంగాణా వారికిచ్చి దండం పెట్టాము. ఇంకేమి మిగిలింది అభివృద్ది చెందటానికి. మీరు కలలో జీవించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కులగజ్జి ఇప్పుడు తొలిగి పోతుందా? పోకపోతే అభివృద్ధి చెందేనా?

      తొలగించండి
    2. @జై
      కులగజ్జి ఎన్నో రూపాలు గా మారి ఇప్పుడు దాదాపు అందరికి పాకింది. అది తొలగడానికి కనీసం పది సంవత్సరాలు పడుతుంది. దానివలన నష్టపోయినోళ్ల ను చూసిన తరువాత, ప్రజలలో మార్పు వస్తుంది. చూడగలిగే కన్నులుంటే ఇప్పటేకే ఆ నష్ట్టాన్ని చూడవచ్చు. ఇన్నాళ్లు అధికార మత్తులో, కన్నుమిన్ను కానక విర్రవీగిన రెడ్లు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అధికారం కోల్పోయి, నెత్తిన తడిగుడ్డ వేసుకొన్నారు. వాళ్లు, వేరే కులం వాడు కాంగ్రెస్ లో అధికారంలోకి వస్తే ఎలా పీక్కు తింటారో రోశయ్య ను ఎలా ఎగతాళి చేసి,విసిగించి, పదవి నుంచి దింపారో ప్రజలు బాగా గమనించారు. ఇక కమ్మవారికి డబ్బు పిచ్చి తెలిసిందే. వారి పెట్టుబడులు ఈ విభజన గందరగోళం బాగా దెబ్బతినిఉంటాయి. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టిన ఎగువ మధ్యతరగతి వారు అప్పులలో మునిగారు. అమ్ముకుందామంటే ఏ విలువలేదు ఆస్థులకు. ఇక ఎన్నికల ఖర్చుకి పైకి చెప్పుకోకపోయినా చాలా మంది డబ్బులు పోగొట్టుకొని ఉంటారు. కేంద్రంలో మోడి ప్రభుత్వం రానున్న రోజులలో అవినితి పైన ఎటువంటి చట్టాలు తీసుకు వస్తుందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా లేదు. దాని దగ్గర డబ్బులు లేవు. మునుప్టిలా భారీ స్కాములు చేసి ఆర్ధిక లోటును పూడ్చుకోవటానికి, ఈ ఎన్నికలలో గెలిచిన అధికారిక పార్టి ప్రజాప్రతినిధులకు సాధ్యాపడపోవచ్చు . రెండు కులాలకి కులగజ్జి వలన ఎక్కడ దెబ్బ తగలాలో అక్కడ తగిలిపైకి చెప్పుకోలేక ఏడుస్తున్నారు. దశాబ్దాలుగా అధికారం,సంపదను రోటేట్ చేసే బలమైన రెండు వర్గాలు అకస్మికంగా డౌన్ అయితే మార్కేట్లో ఒడిదుడుకులు ఏర్పడి మధ్యతరగతి వారికూడా నష్టం వాటిల్లింది.

      5*****

      తొలగించండి
    3. రెడ్లను తొక్కేశారు. కాంగ్రెస్‌ను ముంచేశారు..
      http://www.andhrajyothy.com/node/97275

      తొలగించండి
  9. అయ్యా, ఆంధ్రులు రాజధానిని వదిలేసి వెళ్ళిఫోవలసిన పరిస్ధితిలో final blow ఏమిటో తెలుసునాండి? ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ నలుగుతోందని తెలిసి కూడా హైదరాబాద్ లో మెట్రో రైల్ నిర్మాణం ప్రారంభించి ఇప్పుడు దాంతో సహా హైదరాబాద్ ని వీళ్ళకి ధారపోసి వెళ్ళిపోవటం.

    రిప్లయితొలగించండి
  10. విజయవాడ, గుంటూరు లలో స్వార్ధ రాజకీయాలు, కుల రాజకీయాలు ఎక్కువ తమకు తమ కులానికి ఉపయోగం ఉంటేనే ఏదైనా మంచి పని జరగుతుంది అక్కడ...... అందువలనే కదా తెలంగాణాలో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక ఉధ్యమం జరుగుతున్న కూడా పెట్టుబడులు, పెద్ద పెద్ద సంస్ధలన్ని హైద్రాబాద్ లోనే పోగేసారు....

    రిప్లయితొలగించండి