నిన్నటి ఆంధ్రజ్యోతి దిన పత్రికలో శ్రీ కదిరే కృష్ణ గారి వ్యాసం "పుర వైభవాలు పాలకుల కుట్రే" అన్న వ్యాసం చదివి నా వ్యాఖ్యానాన్ని వ్రాయకుండా ఉండలేక పోతున్నాను. ఆయన గారి వ్యాసం దిగువ లింకులో ఇవ్వబడింది:
వారి ప్రకారం కేవలం బ్రాహ్మణుల కోసమే ప్రపంచ మహాసభలు జరిపినట్లుగా భావించే ప్రమాదం వుంది. రాష్ట్రంలో కనీసం 6 శాతం కూడా లేని బ్రాహ్మణులు ఈ మధ్య కాలంలో బాగా ప్రాముఖ్యం చెందారు. చివరకు గేలి చేసిన సినీ ప్రముఖులే వెంటబడి తన్నారు.
వీరు మహా భారతంలో కర్ణుడి కులం గురించి వ్రాశారు కాబట్టి తప్పకుండా వారికి భారతం మీద నమ్మకం ఉందనే విశ్వాసంతో అదే మహాభారతంలో శాంతి పర్వంలో నేను చదివిన ఒక శ్లోకాన్ని దిగువ ఇస్తున్నాను. దీని
ద్వారా అసలు బ్రాహ్మణులంటే ఎవరు అనే విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం--
న జాతిః న కులం తాత , న స్వాధ్యాయః శ్రుతం న చ ,
కారణాని ద్విజత్వస్య , వృత్త మేవాస్య కారణమ్.
బ్రాహ్మణత్వమునకు కారణము జాతి కాదు, కులమూ కాదు, వేదాధ్యయనమున్నూ కాదు, పాండిత్య మంతకంటెనూ కాదు; ప్రవర్తన మొక్కటియే దానికి కారణము.మంచి ప్రవర్తన కలిగియుండటమే కాని మిగిలిన ఏదిన్నీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావని మహాభారతంలో చాలా విష్పష్టంగా చెప్పబడింది .
కారణాని ద్విజత్వస్య , వృత్త మేవాస్య కారణమ్.
బ్రాహ్మణత్వమునకు కారణము జాతి కాదు, కులమూ కాదు, వేదాధ్యయనమున్నూ కాదు, పాండిత్య మంతకంటెనూ కాదు; ప్రవర్తన మొక్కటియే దానికి కారణము.మంచి ప్రవర్తన కలిగియుండటమే కాని మిగిలిన ఏదిన్నీ బ్రాహ్మణత్వానికి కారణాలు కావని మహాభారతంలో చాలా విష్పష్టంగా చెప్పబడింది .
ప్రపంచ మహాసభలకు కారణమైన ప్రభుత్వాధిపతి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మండలి గారు, అవధానంలో ప్రారంభోపన్యాసం చేసిన సుబ్బన్న అవధాని కానీ, సన్మాన గ్రహీతలలో ముందు వరుసలో వున్న శ్రీ మేడసాని మోహన్ గారు గానీ, నరాల రామా రెడ్డి గారు కానీ, శ్రీ నాయుడు గారు కానీ మీ నిర్వచనం ప్రకారం "బ్రాహ్మణులు" కారు. ఇంతే కాదు, గత 3 దశాబ్దాలలో జరిగిన ఎలాంటి చెడు కార్యక్రమాలలో (కారంచేడు, చుండూరు, కుప్పం మొదలుకొని భూ కబ్జాలు, హత్యల వరకు) బ్రాహ్మణుల పాత్ర ఇసుమంతైనా లేదు.
ఈ నాడు, పద్య కవులలో సగానికి పైచిలుకు బ్రాహ్మణేతరులున్నారు. వీరిలో ఎంతో మంది తెలంగాణా ప్రాంతంనుంచి వున్నారు. బ్రాహ్మణులలో చాలా మంది తిండికి గతి లేని పేదలు ఉన్నారు. ఎప్పుడో రాయల కాలంలో జరిగిన దాని గురించో, శతాబ్దం క్రితం జరిగిన దాని గురించో మాట్లాడి సమయం వృధా చేసుకోవద్దని మనవి. ప్రస్తుతం, కొన్ని వర్గాల అణచివేతలోగాని, ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడంలో కానీ, తద్వారా తెలంగాణాని అడ్డుకోవడంలో కానీ బ్రాహ్మణుల పాత్ర ఈషన్మాత్రమైనా లేదని మనవి చేస్తున్నాను.
రిప్లయితొలగించండిఒకప్పటి సంగతి ఏమైనా,ఆధునిక కాలంలో బ్రాహ్మణులు అభ్యుదయపథంలోనే పయనించారు.సంఘసంస్కరణలోను,జాతీయౌద్యమాల్లోను,విప్లవోద్యమాలలోను,గణనీయమైన పాత్ర వహించారు.ఇప్పుడు I.T.,SCIENCE రంగాల్లో ముందంజ వేసారు. బడుగువర్గాల్లపైన దౌర్జన్యం,స్త్రీలపై హింస వంటి దుర్మార్గాలలో వారి పాత్రలేదు.అసలు నెరాలు,హింసకి వారు దూరంగా ఉంటున్నారు.కులాంతర,జాత్యంతరవివాహాలు కూడా చేసుకుంటున్నారు.ఐతే,వారిలో సంప్రదాయాలు,ఆధ్యాత్మికత ,కళల మీద ఆసక్తి ఎక్కువ.అందువలన వారిని ఆడిపోసుకోనవసరం లేదు.ప్రపంచ తెలుగు మహాసభల వలన వారికి సంతృప్తి తప్ప ధనలాభంగాని,పెద్దగా material గా కలిసి వచ్చేది లేదు.
మీ వ్యాఖ్య బాగుంది. కుల వృత్తులతో పాటే కులాల అంతరాలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గుతున్నాయి, ఇది శుభ పరిణామమే.
తొలగించండి"ఎప్పుడో రాయల కాలంలో జరిగిన దాని గురించో, శతాబ్దం క్రితం జరిగిన దాని గురించో మాట్లాడి సమయం వృధా చేసుకోవద్దని మనవి"
రిప్లయితొలగించండిఅలా గతం తలచుకొని ప్రతి మంచి కార్యక్రమం జరుగుతున్నపుడల్లా ఇతరులపైన పడి ఏడిస్తే వాడికికొక అస్తిత్వం,గుర్తింపు వస్తుందని ఆశ. ఎప్పుడు అదే గోల. సమయం సందర్భంలేకుండా, ఈ వ్యాసం ప్రచూరించిన ఆంధ్రజ్యోతి పేపర్ వాడిని తప్పుపట్టాలి. ఆ పేపర్ కి ఒక పాలసి లేదు. రేపు డిల్లి లో నిర్భయను రేప్ చేసినవాళ్ళు, మాకు జరిగిన అన్యాయం అంట్టు వ్యాసం రాసిన ఆంధ్రజ్యొతి పేపర్ ప్రచూరిస్తుంది.
ప్రవర్తనే మూలం అయితే మీరు బ్రాహ్మణుడు కాదన్నమాట.
రిప్లయితొలగించండిమీరు ఎంత పరుషంగా వ్యాఖ్యానించినా నేను మీ వ్యాఖ్యానాన్ని తొలగించ కుండా ప్రచురించాను. అనవసరపు విషయాలపై ఆరోపణలకు ప్రత్యారోపణలకు తావివ్వకుండా వ్యాఖ్యలు వుంటె హుందాగా వుంటుంది. మీ వ్యాఖ్య ఎంతవరకు సమంజసమొ మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను.
రిప్లయితొలగించండిభయంకర్ గారూ,
రిప్లయితొలగించండి' ప్రవర్తనే మూలం అయితే ' అన్నారు , వారి ప్రవర్తన్లో అంత విషయం ఏమి కనపడిందో చెప్పకుండానే బ్రాహ్మణులు కారన్న మాట అని తీర్పునివ్వటం సమంజసమేనా ?
మీ మాటలవెంక వున్నదానిగురించి మీరు వివరణం ఇవ్వటం సమంజసం .
శ్రీ కదిరే కృష్ణ గారి వ్యాసం కి సమాధనం అన్న పెరు తొ బ్రాహ్మల మీద మీ అక్కసు కక్కారుగా ! .సంధర్భం లెని ప్రస్తావన కూద చొప్పించారు.
రిప్లయితొలగించండినేను బ్రాహ్మణులకు వ్యతిరెకంగా ఏమీ వ్రాయలేదు. దయచేసి మొత్తం వ్యాసం చదవండి. నేను వ్రాసిన దాంట్లొ "అక్కసు" ఎక్కడ వుందో చెబితే తప్పు దిద్దుకోవడానికి సిద్ధం.
తొలగించండి"కనీసం 6 శాతం కూడా లేని బ్రాహ్మణులు ఈ మధ్య కాలంలో బాగా ప్రాముఖ్యం చెందారు. చివరకు గేలి చేసిన సినీ ప్రముఖులే వెంటబడి తన్నారు."
రిప్లయితొలగించండి" సినీ ప్రముఖులే తన్నారు" అన్న పదములొ సంస్కరం ఎంత?
సత్య గారు, నా వ్యాఖ్య వెనుక వున్న వ్యంగాన్ని మీరు గమనించనందుకు నేను చింతిస్తున్నాను. బ్రాహ్మణులపై ఒంటికాలు మీద లేస్తున్న ఒక వర్గం సినిమా వాళ్ళ గురించి వ్రాసినది అది. బ్రాహ్మణులు ఆంధ్ర ప్రదేష్లొ 6 శాతం అయితే, ఇవ్వాల అధికారం/పెత్తనం చెలాయిస్తున్న వాళ్ళు కెవలం 12% కూదా లేరు. నేను వ్రాసిన వ్యాఖ్య వెనుక వున్న వ్యంగం ఇప్పుడు అర్ధమైనదని అనుకుంటాను.
రిప్లయితొలగించండిJust nonsense
తొలగించండినాకొక డౌట్ అండి.. బ్రాహ్మణత్వం కులం కాదు అనేది మహాభారతం లో రాసారు అన్నారు కదా,కాని ఏ గుడిలో నైన వేదాలు నేర్చుకొని పూజలు నేర్చుకునే వేరే కులం వారికీ పూజారి పదవి ఎందుకు ఇవ్వరండి?(ఇస్తున్నరేమో తెలియదు, నాకున్న సమాచారం మేరకు ఇవ్వడం లేదు అనుకుంటున్నాను)
రిప్లయితొలగించండిమీరు కొంచం ఓపిక చేసుకొని ఆది శంకారాచార్య ప్రతిపాదించిన ద్వైత సిద్ధాంతం చదవండి. మీ అనుమానాలు చాలా వరకు నివ్రుత్తి అవుతాయి. ద్వైత సిద్ధంతం ప్రకారం దేవుడు - జీవుడు వేరుకాదు, జీవుదులోనె దేవుడున్నాడని మొట్టమొదట ప్రతిపాదించింది ఆయనే. ప్రస్తుత కాలంలో వేదాలు చదివే బ్రాహ్మణులు చాలా తక్కువ మంది వున్నారు. వేదం చదువుకున్న వాడికి పిల్లనిచ్చే వాళ్ళు కరవయ్యారు. ఒకప్పటి సమాజంలో కులాలు వ్రుత్తులవారీ ఏర్పద్దాయి. ప్రస్తుతం వ్రుత్తులు పోయాయి, కులాలు మాత్రమే మిగిలాయి.
రిప్లయితొలగించండి>..... ఆది శంకరాచార్య ప్రతిపాదించిన ద్వైత సిధ్ధాంతం చదవండి......
తొలగించండిఅదేమిటండోయ్. శ్రీశంకరులు ప్రతిపాదించినది ద్వైతమా! అద్వైతం కాదా? అందరమూ పొరబడుతున్నారా ఇన్ని శతాబ్దులుగానూ......
తప్పును గమనించాను. మన్నించాలి. అద్వైతం అని రాయవలసింది ద్వైతం అని రాసి పెద్ద తప్పు చేశాను.
రిప్లయితొలగించండి