కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నిర్వహించిన విలేకరుల సమావేశం ఆద్యంతం ఆకట్టుకుంది. ఆయన స్ప్రుజించన అంశాలలో సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ ఉత్పత్తి-వాడకం, రాజధాని మొదలైన అంశాలు ముఖ్యమైనవి. ఎనిమిది రోజుల మౌనం తరువాత ఆయన ప్రజల ముందుకు వచ్చినప్పటికీ, ఎంతో నిబ్బరంగా కనిపించారు.
హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి గారి మరణం తరువాత రోశయ్య గారికి బదులు కిరణ్ కుమార్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసినట్లయితే రాష్ట్రంలో ఇవాల్టి పరిస్తితి దాపురించి వుండేది కాదు. ఏదేమైనా, ఇవ్వాల్టి ఆయన విలేకరుల సమావేశం నన్నాకట్టుకుంది. ఈ సంవత్సరం మే ఒకటి నాడు ఆయన బెంగళూరుకు వచ్చిన సందర్భంలో బెంగళూరులోని తెలుగు సంఘాలకు చెందిన కొంతమందిమి ఆయనను కలిసి ఒక హోటల్లో ఆయన్ని సన్మానించుకున్నాము. ఆ నాటి ఛాయా చిత్రాన్ని మీతోటి పంచుకుంటున్నాను. దమ్మున్న మగాడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, శతమానం భవతి
సరిగ్గా చెప్పారు. ఇప్పటిదాకా ఈ రాష్ట్రం లో YSR గానీ, చంద్ర బాబు గానీ చెప్పలేని నిజాలను నిర్భయం గా చెప్పాడు కిరణ్. కాంగ్రెస్ కి బధ్ధ వ్యతిరేకినైన నేను ఈ ఒక్క మీటింగ్ తో కిరణ్ అభిమానినైనాను. తొక్క లో CM పదవి పోతే ఆయన వచ్చి సీమాంధ్ర హక్కుల ఉద్యమానికి సారధ్యం వహించాలి.
రిప్లయితొలగించండిఈ మాయదారి రోజులలో సమైక్యత కోసం నిజాలతో, స్పష్టాతి స్పష్టం గా వినిపించిన మొదటి రాజకీయ వాణి నీదే కిరణ్. సెల్యూట్.
I fully agree with you
రిప్లయితొలగించండిI fully agree with you.
రిప్లయితొలగించండికిరణ్ కుమార్ అంత స్వచ్చంద నిర్మల హృదయ హీరో సి ఎం ఇంత దాకా మన రాజ్యం లో ఎవ్వరూ లేరు.
కిరణ్ జిందాబాద్ !
కిరణ్ కిరాయి సి ఎం కాదు అని నిరూపించారు హేట్స్ ఆఫ్
జిలేబి
1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?
రిప్లయితొలగించండి2. తెలంగనా వాదులకి తెలుసో లేదో గాని విభజన నిర్ణయం జరిగాక సమైక్యాంధ్ర ఆందోళనల వెనక రాష్త్ర స్థాయి కాంగ్రెసు పెద్దలే ఉన్నారనేది యెమి చెబుతున్నది? ఇస్తారేమో అన్నప్పుదు హడావుడి చెసి ఇవ్వరని ధీమాగా ఉన్నప్పుదు ఆగిపోవటంలా నత్త నదక నడిచే ఉద్యమానికి చురుకు తెప్పించటం కొసమే వాళ్ళు ఈ ప్రకటన చేసారు. దాన్ని వేడెక్కించి ఆ బూచిని చూపించి విభజనని యెన్నికల తర్వాతకి వాయిదా వెయ్యటం కోసం అక్కడి పెద్దన్నలూ ఇక్కడి చిన్నన్నలూ కలిసి ఆడుథున్న దొంగాట ఇది.
3. అవును అది మాకూ తెలుసనే తెలంగణా వాదులకి నేనొక సూటి ప్రశ్న వేస్తాను. ఇట్లాంటి కాంగెసుతో కచరా గారు యెందుకంత మమేకమయ్యారో, రాష్ట్రం రావటమంటూ జరిగితే అది కాంగ్రెసు వల్లనే అని నొక్కి చెప్పారో నిన్న గాక మొన్న రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో కలిసి పోవడానికి గూడా సిద్దపడ్దారో మీరు తేల్చుకొవల్సి వొస్తుంది.
4. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యెమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?
5. తెలంగానా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఈవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూదు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?
6. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుంతుంది? విదిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్తంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్త్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్త్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.
రిప్లయితొలగించండి7. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వదం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.
8. తెలంగణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబాల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెందు రాష్త్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.
9. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్ల పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.
10. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపదే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విదిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విదిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)
ఇక ఆఖరుగా రెండు మాటలు చెప్పి నా వాదనని ముగిస్తాను.ఒకనాడు దేశం కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్న రోజున భాషాప్రయుక్త రాష్త్రాల పేరుతో మనం ఒక ఒరవడి దిద్దాం. అదే దారిలో మిగతా వాళ్ళూ నడిచారు. ఇవ్వాల మళ్ళీ అధికార వికేంద్రీకరణ సాధిస్తే మళ్ళీ మనం అందరికీ కొత్తదారి చూపించిన వాళ్ళ మవుతాం.నాకు చాలా బాధగా అనిపించే విషయం ఒకటి ఉంది. తెలంగణా వాదులు మా భాష వేరు అంటున్నారు. అది చాలా తప్పు.మనం ఆ రొజున వేరే వాళ్ళకి వొదిలేసిన రాష్త్రాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరం తెలుగు వాళ్ళమే. నేను క్రిష్ణా జిల్లా వాడినే అయినా రాగద్వేషాలు లేని నిందు మనస్సుతో ఒక మాట చెబుతున్నా. క్రిష్నా జిల్లా నించి అధికార కేంద్రాన్ని అంటకాగి బాగా బలిసిన వాళ్ళు ఇతర జిల్లల వాళ్ళని చాలా హీనంగా చూసారు, చూస్తున్నారు,ఇకముందు కూదా వాళ్ళు సంస్కారం గలిగి ప్రవర్తిస్తారని నేననుకోవదం లేదు. వాళ్ళీ రోజున మా భాష నీటైనది అనుకోవడం సంస్కృతం తో అవసరమైన దానికన్న యెక్కువగా సంకరం అవ్వడం వల్ల వొచ్చిందే. తెలంగాణా లో మాట్లదేదీ, రాయల సీమలో మట్లాడేదీ, అంధ్రా జిల్లాల్లో మట్లాడేదీ అంతా తెలుగే. అన్నీ మాండలికాలు మాత్రమే.అవి వాదుక ఈజీ గా ఉండడం కోసం యేర్పడిన యాసలు మాత్రమే. ఉపనిషత్తులలో శ్రేయము ప్రేయము అని ఒక భావన ఉంది. దాని అర్ధమేమిటంటే శ్రేయం కలిగించేది ఇష్టమైనది కూదా అయితే వెంటనే తీసేసుకో - నిన్నెవరూ అపలేరు కూడ. ప్రియమైనది శ్రేయము కాదని తెలిసినప్పుదు తొందర పడగూడదు. అలా తీసుకుంటే తర్వాత నష్టం నీకే. అలాగే ఒకటి మనకు శ్రేయస్సు నిచ్చేది అయితే అప్పటికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇష్టం కలిగించుకోవలసిందే, యెందుకంటే అది నీకు మంచి చేస్తుంది గనక.ఈ ఉపనిషత్తుల సుత్తిని నా స్వంత అవసరానికి వేస్తున్నానండీ యేమనుకోకండేం:-) ఇంకోటి, పైన నేను చెప్పినవన్నీ నా వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నా మాటల వల్ల అసలే వేడిగా ఉన్న వాతావరణం ఇంకా వేడెక్కని విధంగానే చెప్పినా తమకిష్టం లేని సంగతి కనబడ్దగానే నన్ను మాత్రం ద్వేషించకుండా ఉంటారని:-)
రిప్లయితొలగించండినా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.
విభజనా? వికేంద్రీకరణా? యేది ఉత్తమం?
Sorry for writing in English. I am having trouble with my transliteration site.
రిప్లయితొలగించండిI guess you live in Bangalore. Have you heard the following remarks/questions anytime?
1. Narayana Murthy started Infosys in Bangalore only because it is the capital. If he started in Karwar, it would have become the IT & ITES capital of the world instead of Bangalore
2. Mysoreans sacrificed the capital and built Bangalore by breaking rocks
3. Mandya leaders SM Krishna built the great infrastructure. Without SMK, Bangalore would have been a small petty town
4. Why "namma metro" is not constructed in Bijapur?
5. All our money is given to Bangalore. We don't have a single international airport anywhere else in Karnataka
6. Bangalore belongs to all Kannadigas
I am sure you will find some more "interesting" questions :)
జై గారు, బెంగలూరు కన్నడిగులదైనట్లే, హైదరాబాద్ తెలుగు వాళ్ళది. తెనుగు తేట - కన్నడ కస్తూరి. భాషకు మాత్రమే ఐడెంటిటీగా కన్నడ మాత లేదా తెలుగు తల్లి అని వుంటుందిగాని రాష్ట్రానికొక తల్లి వుండదు. భవిష్యత్లో తెలంగాణా ఏర్పడినా మీరు కూడా తెలుగు తల్లిని పూజించవచ్చు ఎందుకంటే మనమందరం తెలుగువాళ్ళం కాబట్టి. భాషా మతల్లి, కళా మతల్లి ఒక్కటే.
తొలగించండికర్నాటకలో 2008-2013 శాసనసభలో 32 మంది తెలుగు వాళ్ళు వున్నారు. ప్రస్తుతం వున్న మంత్రివర్గంలో కూడా అసంఖ్యాకంగా తెలుగు వాళ్ళు వున్నారు. ప్రస్తుత బెంగలూరు మేయర్ వెంకటేష్ గారి తండ్రి హోసూరులో తెలుగు ఉపాధ్యాయులు. మేయర్ గారు 10 వరకు తెలుగు మాధ్యమంలో చదువుకున్నారు. మేము ఇక్కడ పరాయి రాష్ట్రంగా అస్సలు భావించం. ఇక్కద వాళ్ళు మమ్మల్ని పరాయి వాళ్ళుగా భావించరు.
నారాయణ మూర్తి గారి కంపనీలో కన్నడ వాళ్ళు తక్కువగా వున్నారని క ర వే (కర్నాటక రక్షణా వేదికె) వాళ్ళు గొడవ చేస్తే, తాను మేధస్సుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని, భాషకు కాదని ధైర్యంగా చెప్పారు.
మేము సంవత్సరం క్రితం ఒక చిన్న సమావేసం ఏర్పాటు చేసి డా||చంద్రశేఖర కంభార, జ్ఞాన పీఠ పురస్కార గ్రహీతను మన సహస్రావధాని గరికిపాటి గారితో సన్మానించాము. ఆసువుగా అవధాని గారు చెప్పిన పద్యం చివరి రెండు పంక్తులు మాత్రము గుర్తున్నాయి --- ఏనో వొందు రుణానుబంధ మిరుబోదు, ఎల్లిందదో ఏనదో అని తెలుగు కన్నడ భాషల మధ్య వున్న సారూప్యాన్ని వివరించారు.
ఎన్ని ఉద్యమాలన్నా జరగనీయండి, భాషకు అపకారం కలిగించే తెలుగు తల్లి కాదు దెయ్యం లాంటి తాగుబోతు మాటలను ఖండించండి.
ತುಂಬ ಥಾನ್ಕ್ಸು ರೀ.
తొలగించండిబెంగుళూరు కన్నదిగులది కాదు. భాషతో నిమిత్తం లేకుండా (మీతో సహా) అక్కడ ఉన్న అందరిది. బొంబాయి, షోలాపూర్, హిందూపురం వగైరా నగరాలలో ఉండే కన్నడ వారికి ఎ హక్కులు ఉండవు. ఉల్సూరు తమిళులు, మైసూర్ రోడ్డు మరాఠీ వారికి, చిక్కపేట్ ఉర్దూ వారికి & కోరమంగల తెలుగు వారికన్నా రాష్ట్రేతరులకు హక్కు ఉన్నాయంటే వీళ్ళు ఊరుకుంటారా?
తెలుగు భాషను దయ్యంతో ఎవరూ పోల్చినట్టు నాకు గుర్తు లేదు. "మా తెలుగు తల్లి" అనే (ముందుగా సినిమాకి రాసిన) పాటను రాష్ట్రగీటంగా ఒప్పుకోకపోవడం భాషను అగౌరవించినట్టు కాదు.
Infosys: did NRN setup the company because it is Karnataka capital? Obviously No. Would Anjireddy & co. do this? Your guess ..
I note you did not answer my other points. No sweat, just repeating what I hear in my city.
భాషకు తల్లి ఉంటుందని, ఉండే తీరాలని, ఇతర ప్రాతిపదకలపై (ఉ. గంగ మయ్య, కావేరి తాయి) ఉండకూడదనీ ఎక్కడా రాయలేదండీ. ఎవరి ఇష్టం వారిది, ఒకరి తల్లి కాన్సేప్తును ఇతరులపై రుద్దనేల?
తొలగించండిhttp://www.youtube.com/watch?v=C_0-1Rlgo88
తొలగించండి@Jai Gottimukkala
రిప్లయితొలగించండిdo you know what is local criteria for karnataka? if you pass 10th or 12th in Karnataka you are local. you are eligible to get jobs here.
Karnataka doesnt have zone level local fundas. Everybody from karnataka are equal to get jobs in Bangalore.
For hyderabad and andhra, the entire concept of giving 42% all jobs is itself is a flaw, state should have one local unit.
the concept of 85% seats for local zones also a big flaw. state should be treated as single unit.
And if you talk about mulki rules and other fundas. As per mulki rules, all people belong to Hyd karnataka, Hyd maharastra are equally eligible for Hyderabad local jobs. So you would have got the same number of jobs as now.
And i feel the people who work in other states and other countries dont feel they are taking the jobs of locals. Instead they feel andrites taking telangana jobs only injustice. They feel that they are super-talented to get jobs in karnataka or in US/h1b. And all those who got jobs in hyderabad belonging to andhra are fools.
మరో ప్రశ్న: ఆల్మాట్టీ దాము కట్టి మన నీళ్ళను కన్నడ వారు దొంగాలించారనే అభియోగం పై మీ సమాధానం ఏమిటి? సాటి భారతీయులపై ఇలా నిందలు వేయవచ్చునా?
రిప్లయితొలగించండిPlease don't reply whether the allegation is true is not. This has been settled already in the supreme court & reiterated in KWDT-II.