మరాతీలను ఏకతాటిపై తెచ్చి వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి బాల్ థాకరే అనడంలో సందేహం లేదు. ఆయన మృతికి సంతాపం. ఒక వ్యక్తి మరణిస్తే అతని గతం తాలూకు చెడును గురించి చర్చించుకోవడానికి ఎవరూ సాహసించరు. ఎందుకు??
థాకరే స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నట్లు దాఖలాలు లేవు కాని ప్రాంతాల మధ్య, జాతుల మధ్య విద్వేషాగ్ని రగిల్చి ఎందరో అభాగ్యుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడన్నది అక్షర సత్యం. మతాన్ని, భాషని అడ్డం పెట్టుకుని రాజ్యం ఏలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసాడు. బహుశా ఎన్నికల కమిషున్ ఓటు హక్కును రద్దు చేసిన వాళ్ళలో థాకరే మొట్టమొదటి వాడు.
కర్నాటక నుండి వలసవెళ్లి హోటల్ రంగంలో స్థిరపడిన కన్నడిగులను చిత్రహింసల పాలుచేసిన థాకరే పూజ్యనీయుడా?? ఎక్కడైతే స్థానికంగా వున్నవాళ్ళు ఎక్కువ పని చెయ్యడానికి ఇష్టపడరో అక్కడికి వలసలు పెరగటం సర్వ సాధారణం. అమెరికా గాని, ముంబై కాని ఆఖరికి హైదరాబాద్ కాని....
బీహార్ నుంచి వచ్చిన ఆటో / టాక్సీ ద్రైవెర్లను, పానీ పూరీ అమ్ముకొని పోట్టపోసుకునే ఉత్తర ప్రదేశ్ బడుగు జీవులను నడి రోడ్ల మీద అమానుషంగా గొడ్లను బాదినట్లు బాది హిమ్సించినది నిజం కాదా??
శివసేనకి తెరాస కి కొన్ని విషయాల్లో చాలా దగ్గరి పోలిక వుంది. పోలిక లేనిదల్లా -- ఆయన గారు పక్క రాష్ట్రాలనుంచి పొట్టకూటికోసం వలస వచ్చిన వాళ్ళ మీద దాడులు చేస్తే, మన క చ రా గారు మాత్రం సాటి తెలుగు వాళ్ళ మీద దాడులను ప్రోత్సహించాడు. ఈ రెండూ దుర్మార్గాలే, కాదంటారా???
I support your view here.
రిప్లయితొలగించండిలడ్డు గారు,
తొలగించండిధన్యవాదములు
kaadani assalu ananuu. mi post baagundi.
రిప్లయితొలగించండిశర్మ గారు,
తొలగించండిధన్యవాదములు
Cameraman Gangatho Rambabu
రిప్లయితొలగించండి