తెలుగు జాతి దౌర్భాగ్యం
రగులుతున్న రావణ కాష్టం
వోట్లు, సీట్లు మాకే కావాలని
అన్ని పార్టీల పోరాటం
తెలుగు వాడి గుండె చీల్చే ఆరాటం
అరవోడు పొమ్మన్నాడు
హైదరాబాదీ రమ్మన్నాడు
కర్నూలు వదులు కోమ్మన్నాడు
ఇప్పుడేమో తన్ని తరిమేస్తామంటున్నాడు
తెలుగు తల్లి విడివడుతోంది
ఇటలీ తల్లి వడివడిగా అడుగులేస్తోంది
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు
ఆ ఇటాలియన్ చేతిలో బలైపోతున్నారు
అమాయకులను రెచ్చగొట్టి, అమరులని పేరు పెట్టి
పరులకు పుత్రశోకం మిగిల్చావు
నీ సంతానాన్ని నాయకులను చేశావు
జాగో భాగో అంటూ హా హా కారాలు చేశావు
ఉద్యమం ముసుగున
అరాచకం సృష్టించావు
ఎలక్షన్లు కలెక్షన్లకు తెరలేపావు
బేర సారాలకు బరితెగించావు
అమాయక ప్రాణాలు బలిగొన్నావు
దొంగలన్నావు , దోపిడీ చేసారన్నావు
దోపిడీ దారుకు ప్రాంత విభేదాలు ఉండవని
అందుకు నువ్వే సాక్షమని రుజువు చేశావు
ఫాం హౌస్కు పరిమితమయ్యావు
గురివింద నలుపు సామెత గుర్తు చేశావు
చిన్న రాష్ట్రాలకి సై అంటారు
మూడు రాష్ట్రాలు మేమే చీల్చామంటారు
యు పి లో మాత్రం నై అంటారు
ఎ పి లో మాత్రం సై అంటారు
ఇదే మా నైజం అని చెప్పకనే చెప్తారు
రాయల సీమ బాబు గారు నింపాదిగా చూస్తున్నారు
బలి పీఠం ఎక్కుతున్న తెలుగుతల్లి వధను
తెలుగువాడు పడుతున్న వ్యధను
గుడ్లప్పగించి చూస్తున్నాడు, నాకు రెండు కళ్ళని
తన గుడ్లని తానే తినే పాముని గుర్తు చేస్తున్నాడు
సిక్కోలు సిన్నోడు
సారా పాటల రారాజు
అంతా అధిష్టానం అంటాడు
సొంత లాభం కొంత చూసుకొని
వి'భజన'కు తోడ్పడతాడు
గోడ మీద పిల్లి, జైలులో పులి
ధనమే సమస్తమని, అంతా నా ఇష్టమని
చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు
తండ్రి పేరు చెప్పి కాన్గిరేసును చీల్చావు
నిన్ను చీల్చి చెండాడుతారని మర్చిపోయావు
పిల్ల జగనుకేమి తెలుసు కాంగిరేసు దెబ్బ
ఆంధ్రోడా భయపడద్దు మేమున్నామంటారు
భయపడాలనే సంగతి మరి మరీ గుర్తు చేస్తుంటారు
గాంధి గారి సాక్షిగా ఎమ్మెల్యేని కొట్టారు
టాంకు బ్యాండ్ మురికిలో వైతాళికులను ముంచారు
ప్రజల ఆకాంక్ష ఇదే అన్నారు
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని
నారాయణ వెంకయ్య సాంబశివ రావు
రావిపాటి, గరికిపాటి, లగడపాటి
పేర్లేమో భగవంతుడివి
దార్లేమో విభజనవి
వోట్ల కోసమొస్తే ఉప్పు పాతరేయ్
నోరులేస్తే, టంగుటూరి ప్రకాశాన్ని గుర్తుచెయ్
తెలుగువాడా కళ్ళు తెరు
మోసపోవడం నీకు కొత్త కాదు
కష్ట పడటం తెలుసు నీకు
ధైర్యంగా అడుగేయ్
ఊరు వాడ పునర్నిర్మాణం చెయ్
రాజకీయ భేతాళులని పాతాళంలోకి తొక్కెయ్
తెలుగు తల్లి మరోసారి తలెత్తుకోనేలా చెయ్
రగులుతున్న రావణ కాష్టం
వోట్లు, సీట్లు మాకే కావాలని
అన్ని పార్టీల పోరాటం
తెలుగు వాడి గుండె చీల్చే ఆరాటం
అరవోడు పొమ్మన్నాడు
హైదరాబాదీ రమ్మన్నాడు
కర్నూలు వదులు కోమ్మన్నాడు
ఇప్పుడేమో తన్ని తరిమేస్తామంటున్నాడు
తెలుగు తల్లి విడివడుతోంది
ఇటలీ తల్లి వడివడిగా అడుగులేస్తోంది
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు
ఆ ఇటాలియన్ చేతిలో బలైపోతున్నారు
అమాయకులను రెచ్చగొట్టి, అమరులని పేరు పెట్టి
పరులకు పుత్రశోకం మిగిల్చావు
నీ సంతానాన్ని నాయకులను చేశావు
జాగో భాగో అంటూ హా హా కారాలు చేశావు
ఉద్యమం ముసుగున
అరాచకం సృష్టించావు
ఎలక్షన్లు కలెక్షన్లకు తెరలేపావు
బేర సారాలకు బరితెగించావు
అమాయక ప్రాణాలు బలిగొన్నావు
దొంగలన్నావు , దోపిడీ చేసారన్నావు
దోపిడీ దారుకు ప్రాంత విభేదాలు ఉండవని
అందుకు నువ్వే సాక్షమని రుజువు చేశావు
ఫాం హౌస్కు పరిమితమయ్యావు
గురివింద నలుపు సామెత గుర్తు చేశావు
చిన్న రాష్ట్రాలకి సై అంటారు
మూడు రాష్ట్రాలు మేమే చీల్చామంటారు
యు పి లో మాత్రం నై అంటారు
ఎ పి లో మాత్రం సై అంటారు
ఇదే మా నైజం అని చెప్పకనే చెప్తారు
రాయల సీమ బాబు గారు నింపాదిగా చూస్తున్నారు
బలి పీఠం ఎక్కుతున్న తెలుగుతల్లి వధను
తెలుగువాడు పడుతున్న వ్యధను
గుడ్లప్పగించి చూస్తున్నాడు, నాకు రెండు కళ్ళని
తన గుడ్లని తానే తినే పాముని గుర్తు చేస్తున్నాడు
సిక్కోలు సిన్నోడు
సారా పాటల రారాజు
అంతా అధిష్టానం అంటాడు
సొంత లాభం కొంత చూసుకొని
వి'భజన'కు తోడ్పడతాడు
గోడ మీద పిల్లి, జైలులో పులి
ధనమే సమస్తమని, అంతా నా ఇష్టమని
చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు
తండ్రి పేరు చెప్పి కాన్గిరేసును చీల్చావు
నిన్ను చీల్చి చెండాడుతారని మర్చిపోయావు
పిల్ల జగనుకేమి తెలుసు కాంగిరేసు దెబ్బ
ఆంధ్రోడా భయపడద్దు మేమున్నామంటారు
భయపడాలనే సంగతి మరి మరీ గుర్తు చేస్తుంటారు
గాంధి గారి సాక్షిగా ఎమ్మెల్యేని కొట్టారు
టాంకు బ్యాండ్ మురికిలో వైతాళికులను ముంచారు
ప్రజల ఆకాంక్ష ఇదే అన్నారు
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గని
నారాయణ వెంకయ్య సాంబశివ రావు
రావిపాటి, గరికిపాటి, లగడపాటి
పేర్లేమో భగవంతుడివి
దార్లేమో విభజనవి
వోట్ల కోసమొస్తే ఉప్పు పాతరేయ్
నోరులేస్తే, టంగుటూరి ప్రకాశాన్ని గుర్తుచెయ్
తెలుగువాడా కళ్ళు తెరు
మోసపోవడం నీకు కొత్త కాదు
కష్ట పడటం తెలుసు నీకు
ధైర్యంగా అడుగేయ్
ఊరు వాడ పునర్నిర్మాణం చెయ్
రాజకీయ భేతాళులని పాతాళంలోకి తొక్కెయ్
తెలుగు తల్లి మరోసారి తలెత్తుకోనేలా చెయ్
Nice. Kartvyam adE!!
రిప్లయితొలగించండికం. తెలుగోడికి కళ్ళుంటే
రిప్లయితొలగించండివెలుగెక్కడ ఉన్నదన్న విషయం కాస్తా
తెలిసేదే మనవాళ్ళకు
తెలిసిందా ఢిల్లి చుట్టు తిరగడ మొకటే
చంద్రశేఖర్ గారూ & ఇతర మిత్రులు: దాదాపు ఏడాది పాటుగా "తెలంగాణా నదీజలాలు, నీటి పారుదల & వ్యవసాయం" అనే అంశాలపై చేసిన పరిశోధన ఆధారంగా నేను కొన్ని బ్లాగు టపాలను ప్రచురిస్తున్నాను. వారానికి రెండు టపాలతో వచ్చే నెలలలో నా పరిశోధన సారాంశం ధారావాహికంగా వెలువడుతుంది.
రిప్లయితొలగించండిఈ విషయాలపై ఆసక్తి కలిగిన వారు నా టపాలను చదివి తమ అమూల్యమయిన వ్యాఖ్యలు తెలుపగలరు.
మీ బ్లాగులో ప్రకటన చెస్తున్నందుకు క్షమించండి. గతంలో ఇవే అంశాలపై మనం చర్చించుకున్నాం కాబట్టి మీకు & మీ చదువరలకు ఆసక్తికరం అని అనుకునే ఈ సాహసం చేసాను. ఇలా నా సొంత బ్లాగును మీమీద రుద్దడం తప్పయితే, ఈ వ్యాఖ్యను తొలగించండి.
జై గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీరు పరిశొధన చేసిన విషయాలను నిర్భయంగా నిజాన్ని వెల్లదించండి. తప్పకుండా చదువుతాను.
ఒక నిశ్చితమైన దృక్పధంతో పరిశొధనపేరుతో వెలువరించే గ్రంధాలు పాక్షికసత్యాలనే ఆవిష్కరిస్తాయి కాని ఎన్నడూ సంపూర్నదృశ్యాన్ని ప్రదర్శించవని అందరూ గ్రహించాలి.
తొలగించండిఅయితే జైగారు కాని మరొకరు కాని అందమైన పరిశోధనా గ్రంధాలు రచించకుండా ఎవరూ అడ్డుకోరు.
అమాయకులో మరొకరో వాటిని చదువుకుని ఆనందించకుండా కూడా ఎవరూ అడ్డుకోరు.
రాజకీయ జయాపజయాలతో ప్రజలను ప్రభావితం చేయవచ్చునేమో కాని కాలాన్ని కాదు.
ఒకనాడో మరొకనాడో మంచో చెడో కాలమే అన్నీ నిర్ణయిస్తుంది.
వృత్తాంతి గారూ, థాంక్సండీ.
తొలగించండిశ్యామలరావు మాస్టారు, మీరు నా టపా చదవలేదని భావిస్తాను. నాకు ఈ విషయాల మీద ఎలాంటి నిశ్చిత దృక్పథమూ లేదని స్పష్టంగా రాసాను. ఈ పరిశోధనలో నేను వాడిన ఆధారలు ఏవీ తెలంగాణావాదులు రాసిన పుస్తాలు/వ్యాసాలు నుండి రాలేదని కూడా సవినయంగా మనవి చేసుకున్నాను.
నాకు అందం కంటే అర్ధం ముఖ్యం. ఈ విషయాన్ని మనమిద్దరం చర్చించామని గుర్తు.
పరిశోధన ఫలితాన్ని ముందుగానే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ఆధారాలు వెతకడానికి నాకయితే ఏడాది అవసరం లేదు. ఎ తెరాస పుస్తకం నుంచో కాపీ పేస్టు చేయదలిస్తే, వారం కూడా పట్టదు.
తమరు కూడా చదివి, నేను ఎకపక్షంగానో/నిర్దిష్ట ద్రుక్పతంతోనో వ్యవహరించానిపిస్తే తప్పక ఎండ గట్టండి. అంతే తప్ప ముందుగానే ఆక్షేపించడం మీకు నామీద ఉన్న నిర్దిష్ట దృక్పథాని సూచిస్తుందేమో?
అయ్యో, అదేలేదండి. సరేనండీ చదవటానికి నాకేమీ అభ్యంతరం. తప్పకుండా చదువుతాను.
తొలగించండిమీ అమూల్యమయిన వ్యాఖ్యలకు & సలహాలకు ఎదురు చూస్తాను. నేను నిజంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చి దానికి నా అధ్యాయానికి రెట్రోఫిట్ చేయలేదని మీరు చదివాకయినా నమ్ముతారని నా నమ్మకం.
తొలగించండిమీలాంటి పెద్దలు తిట్టినా, చీవాట్లు పెట్టినా అవే దీవెనలుగా భావించే మనతత్వం నాది. మన మంచి కోరే అలా అంటున్నారానని అర్ధం చేసుకుంటాను తప్ప పెద్దలను తూలనాడే ధైర్యం చేయను.
unnadi unnatlu cheppaaru
రిప్లయితొలగించండిమన ప్రస్తుత తక్షణ కర్తవ్యాన్ని మీరు గుర్తుచేసారు. ఇది ప్రతిరోజూ చదువుకోవలసిన పద్యం:
రిప్లయితొలగించండితెలుగువాడా కళ్ళు తెరు
మోసపోవడం నీకు కొత్త కాదు
కష్ట పడటం తెలుసు నీకు
ధైర్యంగా అడుగేయ్
ఊరు వాడ పునర్నిర్మాణం చెయ్
రాజకీయ భేతాళులని పాతాళంలోకి తొక్కెయ్
తెలుగు తల్లి మరోసారి తలెత్తుకోనేలా చెయ్
:'(
రిప్లయితొలగించండిమోసపోవడం కొత్త కాదు నీకు.నిజం
రిప్లయితొలగించండితెలుగు జాతిని విడదీసి మరో సారి తమ చులకన చూపారు.
దొంగలమని తేల్చేసారు.
ఇది ఏకపక్ష విభజన.
రానున్న నోటిఫికేషన్ లు ఆగిపొతాయి.
నిరుద్యోగులారా జీవితం చాలా విలువైంది.
దయ చేసి మీ మీద ఆధారపడ వాల్లని మీ పేరెంట్స్ ని గుర్తుంచుకొండి.
కష్ట పడటం తెలుసు నీకు
క్రమసిక్షణ తెలుసు నీకు.
నీ అవసరం ఎంతో మందికి ఉంది.
తమిలనాడు వద్దు. మరాథి కి వద్దు, గుజరాతి కి వద్దు, సాటి తెలుగునాడు అసలే వద్దు.(బయటి నుంచి ఆంధ్రా గో బేక్ వినిపిస్తుంది,మిగిలిన వాల్లని అంటే కొడతారు.)
రేపు మన్యసీమ అంటారేమొ అటు వెళ్ళొద్దు. ఢిల్లీ లొ తెలుగు వారంటే మహా చులకన. అటసలే వెల్లొద్దు.
ప్రపంచ వ్యాప్తంగా నీకు పేరుంది
. ఏ దేసమైనా పొ. ఆసలే ఇండియన్ టాలెంట్ ,పెట్టుబడులూ కోసం అగ్రరాజ్యాలు ఎదురుచూస్తున్నాయి. ఎక్కడికెళ్ళీనా నావాడు నాది అనుకోవద్దు. కష్టపడింది తెచ్చి నీ ఇంటి కి రంగులు వెయుంచుకొ. లేకపోతే అది నువ్వు దోచింది ఆవుతుంది. ఎక్కడికెళ్ళీనా నాకు అన్యాయం జరుగుతోందని ముందే కిరికిరి పెట్టు.
లేకపొతే ఏదొ ఒకనాడు నువ్వు దొంగ దోపిడీదారువైపొతావు.
నీతో నువ్వే పొరాడే సమయం. ఇన్నాళ్ళూ అభివ్రుధ్ధి ఫలాలు చూసావు. ఇక నుంచి నీ కష్ట ఫలాలె పొందు.ముందు కొన్నాళ్ళు సమ్యమనంతో ఉండు. దయ చేసి ఎవరూ తీవ్ర నిర్నయాలు తీసుకోవద్దు ప్లీజ్.
తెలంగాణా ప్రజల ఆక్రోశం అర్ధం చేసుకోండి!తెలుగు జాతికి రెండుమూడు రాష్ట్రాలుంటే తప్పేమిటి?చిన్న రాష్ట్రాలతో ముప్పేమిటి?కొంపలు మునిగిపోతాయా?ఆకాశం అమాంతం కూలి తలమీద పడుతుందా!?చిన్న రాష్ట్రాలతోనే పాలనా సౌలభ్యం ఏర్పడుతుందని అంబేద్కర్ గారు చెప్పలేదా?ఇష్టపడి కష్టపడి తెలంగాణాను ఆంద్ర ప్రదేశ్ ను వేరు వేరు రాష్ట్రాలుగా అభివృద్ధి చేసుకుందాం!
రిప్లయితొలగించండి1. ఆంధ్రప్రదేశ్ అన్న పేరు మాత్రం ఎందుకూ? అది అవసరం లేదు, కాలదోషం పట్టింది ఆ పేరుకు.
తొలగించండి2. సరే, సీమాంధ్రతో పోలిస్తే తగినంతగా అభివృధ్దిచెందిన తెలంగాణా ఆక్రోశం అర్థం చేసుకుందాం. మరి సీమాంధ్రకు ఆక్రోశించే హక్కూ లేదంటారా?
3. ఎంత చిన్న రాష్ట్రాలైతే మరీ చిన్నవై పోతాయండీ? కొన్నాళ్ళకి అంబేద్కర్‌గారిదో మరొకరిదో కల అనేసి ఐదారువందల రాష్ట్రాలు దాకా ముక్కలు చేసుకుందామా పరిపాలనా సౌలభ్యం పేర దేశాన్ని? అప్పుడు పార్లమెంటే అక్కరలేదు. ముఖ్యమంత్రుల సభే సరిపోవచ్చును.
అయిదారు వందల డిమాండ్లు ఉన్నాయండీ? పోనీ భవిష్యత్తులో వస్తాయా?
తొలగించండిఅంబేద్కర్ లాంటి మహానుభావుల జోలికి ఎందుకు లెండి వదిలేద్దాం. మీ ఉద్దేశ్యంలో ఏది రాష్ట్రానికి సరయిన సైజో చెప్పండి, అలాగే కానిద్దాం. (అవసరమయితే ఆంధ్రను తమిళనాడుతో కలిపి).
Madras was a "big state", why did Andhras break it up?
You should learn to read history. All history pages need not just speak about only Telangana. There is more to the history of formation of states in Indian Union than your beloved Nizam state alias Telangana.
తొలగించండిSir, I start from the premise of self determination, not history, size or similar parameters. I believe in Gurajada's prescription that a "country" (read any administrative unit) is nothing but the sum total of its people. BTW my approach is also supported by SRC, JVP & SKC.
తొలగించండిI am sure you are more knowledgeable than me on history. Did the 500 + states evolve based on people's aspirations? If the answer (as I suspect) is no, this will not recur.
"అరవోన్ని సతాయించాడు.
రిప్లయితొలగించండివాడు తరిమికొట్టాడు.
హైదరాబాద్ మీద కన్నేశాడు.
మబ్బు చూసి ముంత ఒలకబోశాడు.
కర్నూలు వదులుకొన్నాడు.
హైదరాబాద్ అంతా నాదే అన్నాడు.
ప్రతిదానికి నాదే గొప్ప అంటాడు.
ఎక్కడికెళ్ళినా ఇదే కిరికిరి ....
అందుకే తెలంగాణవాడూ తరిమికొడుతున్నాడు."
ఇదీ అసలు సత్యం!!!
అవునవును మీరు నమ్మేదే సత్యం. కాదనే వాళ్ళని మీరు నానామాటలూ అని పైగా మీ అత్మాభిమానం దెబ్బతిందీఅని రాగాలు తీస్తారు.
తొలగించండి" తెలంగాణవాడూ తరిమికొడుతున్నాడు"
తొలగించండిమూర్ఖుడు ఇలాగే అనుకుంటాడు!
శ్యామలీయం గారు, ఆ ఉన్మాది వ్యాఖ్యలను కావాలనే ప్రచురించాను. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన.... శతక కర్తలు చెప్పారు కదా! అతగాడు తెలుసుకోవాల్సిన సత్యాలు కొన్ని వున్నాయి. ముఖ్యంగా - కచరా గారి పార్టీ బ్రమలు చూపించినట్లు కోటి ఉద్యోగాలు, డబల్ బెడ్ రూం ఫ్లాట్ విత్ ఏ సి, సాయంత్రానికి సారా బుడ్డి పధకం మొ|| ఆచరణ సాధ్యం కాదు. అలాగే, సినిమా షూటింగులు ఆపి, భవన నిర్మాణాలు ఆపి దందుకొవడం కుదరదు.
రిప్లయితొలగించండి3.4 కోట్ల రాబొయే తెలంగాణా రాష్త్రంలో కనీసం కోటి మంది తీర సీమంధ్రులున్నారు. ఇతరుల సొమ్ము కొట్టేద్దామనుకునే వాడికి కష్తం కానీ, కష్ట పడే మనస్తత్వం ఉన్నవాడికి ఏం ఢోకా లేదు.
కష్ట పడే మనస్తత్వం ఉన్నవాడికి ఏం ఢోకా లేదు.
రిప్లయితొలగించండినేనెవరినీ ప్రత్యేకంగా వ్యతిరేకించను కానీ...అవతలి వాళ్లు నాలుగు రాళ్ళేసి నప్పుడు మాత్రం ...వాళ్ళ కోర్కెలు సాధించుకోడానికే గా ఈ మాటలన్నీ..అని పిస్తూ ఉంటుంది...
మేం శాంతి యుతంగా..ఏ నష్టం కలగనీయకుండా...ఉద్యమాలు చేశామంటారు..ఇరు పక్షాలూ...కానీ ఈ రాష్ట్రం అధోగతి పాలయిందని చాలా మంది గుర్తించడం... లేదు...
కష్ట పడే మనస్తత్వం ఉన్నవాడికి ఏం ఢోకా లేదు...
కష్ట పడే మనస్తత్వం ఉన్నవాడికి ఏం ఢోకా లేదు....
ఇప్పుడే కాదు..ఉద్యమాలు మొదలయిందగ్గర నుండీ..ఇక్కడ ప్రతీ వాళ్ళూ చెప్పేదే ఈ మాట.....కాక పోతే...ఇంత వరకూ కష్ట పడినదంతా..దొర చేతిలోనే పోసారు..ఎందు కంటే..సామాన్యులకు వాళ్ళు ఏమీ మిగల్చరు కాబట్టి...
శ్యామలీయం గారు, ఆ ఉన్మాది వ్యాఖ్యలను కావాలనే ప్రచురించాను. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన.... శతక కర్తలు చెప్పారు కదా! అతగాడు తెలుసుకోవాల్సిన సత్యాలు కొన్ని వున్నాయి. ముఖ్యంగా - కచరా గారి పార్టీ బ్రమలు చూపించినట్లు కోటి ఉద్యోగాలు, డబల్ బెడ్ రూం ఫ్లాట్ విత్ ఏ సి, సాయంత్రానికి సారా బుడ్డి పధకం మొ|| ఆచరణ సాధ్యం కాదు. అలాగే, సినిమా షూటింగులు ఆపి, భవన నిర్మాణాలు ఆపి దందుకొవడం కుదరదు.
రిప్లయితొలగించండి3.4 కోట్ల రాబొయే తెలంగాణా రాష్త్రంలో కనీసం కోటి మంది తీర సీమంధ్రులున్నారు. ఇతరుల సొమ్ము కొట్టేద్దామనుకునే వాడికి కష్తం కానీ, కష్ట పడే మనస్తత్వం ఉన్నవాడికి ఏం ఢోకా లేదు.
@ kvsv మీ ఆవేదనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పెట్టుబడులు, విద్యాసంస్థలు, క్రీడా మైదానాలు మొ|| కేంద్రీక్రుతం చెయ్యడానికి కారణం ఎవరు. మనం గెలిపించిన పాలకులు. ఏనాడైనా, ఒక్క వార్తా పత్రికైనా ఇది తప్పు అని వ్యాసం రాసిందా? రాయరు - ఎందుకంటే, వాళ్ళ పెట్టుబడులు కూడా అక్కడే వున్నయ్ కాబట్టి. సత్తిబాబు గారి కుటుంబం మొత్తం పదవులలో వున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఎంత వెనుకబడి వున్నాయో చూడండి. అసలు ఈ జిల్లాలు మన రాష్త్రంలో వున్నాయని తెలియని వాళ్ళు కూడా వున్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి అందరికీ తెలుసు, కానీ ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతంలో - ఆకాశంలో పోయే విమానాన్ని చూద్దామనుకునే వాళ్ళు ముందు మంచం కోసం వెతుకుతారు. ఎందుకంటే, పడుకొని తప్ప ఆకాశంలోకి చూడ లేరు కాబట్టి.
రిప్లయితొలగించండిరాయలసీమ సమస్య కూడా ఇదే అదునులో తేల్చడం మంచింది. ఎందుకంటే, ఇంకో 50 సంవత్సరాల తరువాత సమస్య వస్తుంది.
చాలా బాగున్నాయండి మీ నిజాలు.. ఏ ఒక్కటీ కాదన్నట్లున్నాయి.. పేరు మాత్రం ప్రజలదీ.. దోచుకుని తినేది మాత్రం నాయకులు.. అసలు దోచుకునేవాళ్లను వదిలిపెట్టి కడుపు చేత పట్టుకుని వచ్చే వాళ్లపై పడుతున్నారు..
రిప్లయితొలగించండి