10, సెప్టెంబర్ 2013, మంగళవారం

పిడమర్తి వారి బూతుల పంచాంగం


ప్రతి ఉగాదికి తెలుగు వాళ్ళు పంచాంగం కొనుక్కొనే అలవాటు చాలా ఇళ్ళల్లో ఇప్పటికీ ఉన్న సంప్రదాయం.     అందులోను పిడమర్తి వారి  పంచాంగం ప్రముఖమైనది.  పిడమర్తి వారు తెలఘాణ్యు బ్రాహ్మలు. కానీ అభినవ ఉస్మానియా పిడమర్తి వారు  పంచాంగం విప్పితే మాత్రం  తంతాం, చంపుతాం అని చెప్పే భవిష్యత్ బూతు పురాణం మాత్రమే దర్శనమౌతుంది.   ఎన్ జీ వో లు హైదరాబాద్ గడ్డపై అడుగుపెడితే  జరగబోయే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు వివరించగా దానిని లైవులో అన్ని తెలుగు చానళ్ళ వారు యధాశక్తి గంట గంటకు తుఫాను హెచ్చరికల తరహాలో  ప్రసారం చేశారు.    


కొన్ని పదుల కేసులను ఎదుర్కొంటూ, ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న అప్రధాన వ్యక్తులకు తెలుగు మీడియా  అనవసరమైన ప్రాధాన్యం  ఇస్తోంది.   నాలుగు సార్లు త్రిపుర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన నిరుపేద మాణిక్ సర్కార్ గురించి ఒక్క కార్యక్రమం కూడా వుండదు.   దేశంలోని ముఖ్య మంత్రులన్దరిలోనూ పేదవాడు ఆయన.   ఆయన సతీమణి ఇవ్వాల్టికి రిక్షాలో ప్రయాణం చేస్తుందే తప్ప ప్రభుత్వ కారు వుపయోగించుకోదు.    ఆయన కొచ్చిన జీతాన్ని సి పి ఎం పార్టీకి దానం చేస్తూ, పార్టీ వారు ఇచ్చే 5,000 బత్యంతో కాలం వెళ్ళ దీస్తున్న నిజాయితీ పరుడు.   ఆయనకు సొంత ఇల్లు కూడా లేదు.     


ఇలాంటి వారి గురించి గంటకు ఒకసారి కధనం ప్రసారం చేస్తే, కనీసం జిల్లాకు ఒకరన్నా మారతారు.   పిడమర్తి వారి హెచ్చరికలో లేక కడప వారి కుత్తుకలు కత్తిరింపుల సౌజ్యలతో యువతరం నాశనమౌతుంది    



2 కామెంట్‌లు :

  1. antha bagane undi. Kadapa peru nu brashtu pattinchondani manavi

    రిప్లయితొలగించండి
  2. నేను కడప అనగానే అది అందరు కడప వాళ్ళకు వర్తించదు. ఒక వ్యక్తి గొంతుకు అగుష్టం చూపిస్తూ హావ భావాలు ప్రదర్శించాడు. పాపం తెలంగాణా పెట్టుబడిదారులు నిర్వహించే టి వి చానళ్ళు దానిని పదే పదే చూపించాయి. అందులోనూ ఉస్మానియా ఆర్ట్స్ విభాగం విద్యార్ధులు కోదండం గారు చెప్తున్న పాఠాలు వినీ వినీ రెచ్చిపోయి వున్నారు. బురదలో రాయి వేశాడు.

    రిప్లయితొలగించండి