29, నవంబర్ 2013, శుక్రవారం

"ఆంద్రోళ్ళ అక్రమ ఆస్తులు స్వాధీన పరచుకుంటాం"


గల్లీ నుంచి ధిల్లీ నాయకుడి వరకు రోజుకో ప్రకటన చేసి వార్తల్లో వ్యక్తులుగా వుండాలని భాజపాతో సహా అన్ని పార్టీల నాయకులు తాపత్రయ పడుతున్నారు.   ఆంధ్రా వాళ్ళు అక్రమంగా తెలంగాణలో కాజేసిన భూములను రాబోయే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని ఒక కేంద్ర మంత్రి గారు శెలవిచ్చారు.   ఇది శుభ పరిణామం.    ఇక్కడ ఒక చిన్న సవరణ చేస్తే బాగుంటుంది.   ఆంద్రోళ్ళ అనకుండా, పార్టీలతో, ప్రాంతాలతో  సంబంధం లేకుండా తెలంగాణలో అక్రమాలకు పాల్పడ్డ భూ కబ్జాదారులను ఏరి పారేస్తాం అని చెప్పండి అందరూ హర్షిస్తారు.   దొంగలకు, కబ్జాదారులకు, దోపిడీదారులకు మనలాగా ప్రాంతీయ వైషమ్యాలు వుండవు.   ఆంధ్ర ప్రాంత అక్రమార్కులని అస్సలు వదలకండి.   మీ దగ్గర జైళ్లలో పెట్టుకొని తిండి పెడుతూ మంచి రక్షణ వున్న జైళ్లలో పెట్టండి.   కొత్తగా రాబోయే తెలంగాణా పాలకులు కొంచం పుణ్యం కట్టుకొని, అక్రమాలకు పాల్పడ్డ నాయకులను (ఇరు ప్రాంతాల వారిని) ప్రాసిక్యూట్ చెయ్యండి.  అవశేష తీర సీమంధ్ర ప్రాంతంలో వీళ్ళ పీడ తాత్కాలితంగా విరగడవుతుంది.     కాకపొతే సందట్లో సడేమియా గాళ్ళు ఇలాంటి నాయకుల ప్రకటనలు నమ్మి, గతంలో కొంతమంది చేసిన భాగో జాగో ప్రకటనలతో స్ఫూర్తి పొందిన గల్లీ స్థాయి నాయకులు  ఇతర ప్రాంత ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడకుండా  అదుపు చెయ్యాల్సిన అవసరం వుంది.    మధ్య తరగతి ప్రజలు రెక్కల కష్టంతో కొనుకున్న స్థలాలను, ఇళ్ళను, వారి హక్కులను  రౌడీల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత కొత్తగా రాబోయే ప్రభుత్వానిదే.   విభజనకు పూనుకున్న  కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే ఇతర ప్రాంత ప్రజలకు తెలంగాణలో రక్షణ లేదు కాబట్టి కొన్ని ప్రత్యేక భద్రతలు కల్పించాలి అని చెప్తున్నారు.   ఇది ఒక రకంగా తెలంగాణా నాయకత్వాన్ని అవమాన పరచినట్లే.   దీనికి కారణం గతంలో తెరాస చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు, ఉపన్యాసాలు కారణం.  పనిలో పనిగా, ఉద్యమ సమయంలో సినిమా వాళ్ళను, విద్యా, వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు గుంజుకున్న వాళ్ళ ఆస్థులు కూడా ప్రత్యేక చట్టం ద్వారా జప్తు చెయ్యాలి, లేదంటే నూతనంగా ఏర్పడే స్వచ్చమైన తెలంగాణాకు అర్ధం లేదు.        

4 కామెంట్‌లు :

  1. Baaga chepparu.

    Dondrullaraa..... ika jagrathhaa.. dopidi chese mundhu chusukondi

    రిప్లయితొలగించండి
  2. సొంతంగా బతకలేని గజ్జికుక్కా... ఎపుడూ దోపిడీ అనో, దోపిడీ గాళ్లనో ఏడవకుండా బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని బతకొచ్చు కదా...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలంగాణా వచ్చాక అందరికీ మంచి మంచి ఉద్యోగాలు అవే వస్తాయి కదా.
      ఇంకా చదువుకోవటం దేనికీ?

      తొలగించండి
  3. మంచి మాట చెప్పారు వృత్తాంతి గారు.

    రిప్లయితొలగించండి