30, నవంబర్ 2013, శనివారం

పార్టీ మారిన ఎంపీలను సస్పెండ్ చెయ్యలేదే

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై వేటు వేస్తాం అంటూ బొత్స సత్యనారాయణ గారు చాలా గంభీరంగా ఉపన్యసించారు.   కాంగ్రెస్ బి ఫాం మీద గెలిచి తెరాసతో అంట కాగుతున్న మందా జగన్నాధమ్ మరియు వినోద్ గారిని ఇంతవరకు పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదు? ఇటీవలి వరకూ   జగన్ ఆంతరంగికుడిగా పేరుపడ్డ సబ్బం హరిని సస్పెండ్ చేశారా?   నెల క్రితమే మంత్రి పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్ధం పుచ్చుకున్న పినిపే విశ్వరూప్ గారిని సస్పెండ్ చేశారా?    రెండు నెలల క్రితం జగన్ పంచన చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డి గారిని పార్టీ నుండి తొలగించేనట్లు ఎక్కడా వార్త రాలేదే?  మీ పార్టీ మొహాన మొగాడిలా రాజీనామా పడేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మీ పార్టీ లిస్టు నుంచి ఇంకా తొలగించ లేదే.  తెల్లవారింది మొదలు టి వి ఛానల్ వాళ్ళు ఎప్పుడొస్తారు, ముఖ్యమంత్రిని ఎలా తిడదామా అని ఎదురు చూసే ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలలో గెలవని వృద్ధ జంబూకాల పై ఏమి చర్యలు తీసుకున్నారు?    సికిందరాబాద్ ఎం ఎల్ ఎ జయసుధ గారు జగన్ పక్కన కూర్చొని రైతు దీక్ష, ఫీజు దీక్ష చేసిన ఆవిడ పై చర్యలు తీసుకున్నారా ?   జగన్ జట్టులో ఉన్నప్పుడు కొండా సురేఖ గారు సోనియా గాంధీని బొంద పెట్టాలన్నారు, దుమ్మెత్తి పోశారు.   మళ్ళీ ఆ దంపతులను పార్టీలోకి ఎలా తీసుకున్నారు?   

ఇవన్నీ చూస్తుంటే, దయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదూ! 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి