23, నవంబర్ 2013, శనివారం

అతి వినయం ధూర్త లక్షణం

అతిగా ఆశ పడే ఆడది, అతిగా ఆవేశ పడే మొగాడు బాగు పడ్డట్లు చరిత్రలో లేదు.   ఈ మాట  నేను చెప్పింది కాదు, మహారాష్ట్రీయుడు, కర్ణాటకలో పుట్టి పెరిగి, తమిళనాడులో 'తలైవర్' గా కీర్తింపబడే రజనీకాంత్ అనబడే శివాజీరావ్ గైక్వాడ్ సినిమా సందేశం. 

సరిగ్గా రేణుకా చౌదరి విషయంలో అదే జరిగింది. గతంలో పొంగులేటి వారికి ఇప్పుడు ఈవిడ గారికి శాస్తి జరిగింది.   పాపం పొంగులేటి వారు ప్రత్యక్ష ఎన్నికల జోలికి పోరు.  ప్రజలతో కన్నా పత్రికా విలేకరులతోనే కాంటాక్ట్స్ ఎక్కువ. రాబోయే రోజులలో పొన్నం వారికి, శంకరన్న గారికి  కూడా టిక్కెట్టు చింపేసే అవకాశం చాలా ఎక్కువ.   కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.   పాపం హనుమంతన్నను చూడండి, ధనియాల్లాగా వాడేశారు.   పార్టీ పెద్దలకు తెలుసు ఎవర్ని ఏ పనికి ఎప్పుడు ఎలా వాడుకోవాలో.    మైకు దొరికితే చాలు పొన్నం గారు నోటికొచ్చినట్లు మాట్లాడుతారు.   గబ్బర్ సింగ్ సినిమాలో కానిస్టేబుల్ అలీ, తన బాస్ చెప్పే వివరాలు నమోదు చేసుకున్నట్లు ఇక్కడా ఒక నమ్మిన బంటు ఆ పని చేస్తుంటాడు.    ఎవరు అతిగా మాట్లాడుతున్నారు, ఎవరు అతి వినయం నటిస్తున్నారు, ఏ ఎంపీ గారు ఎ సి బి కేసులో వుండి రాజకీయాలలోకి వచ్చి కచరా పంచన చేరుదాం అని చూసి అది వీలు పడక  మళ్ళీ అమ్మ ఎవరికైనా అమ్మే అన్నాడు, గుడులు గోపురాలు కట్టిస్తున్నాని వీరంగం ఆడే వాళ్ళు, పగలు విభజన రాత్రి సమైక్యం అనే వాళ్ళెవరు, సందిట్లో సడేమియా లాగా తమకు వాటా ఇవ్వకుండా కాంట్రాక్టులు కొట్టేస్తున్నదేవరు మొదలైన వివరాలు ఎప్పటి కప్పుడు నమోదు చేసుకొని పార్టీ అధినాయకత్వానికి పంపిస్తారు.     మధు యాష్కీ గారు చూడండి, పార్లమెంటు మెట్ల మీద మూడు నిద్దర్లు చేసిన వాళ్ళలో లేడు,కాబట్టే పదవి ఇచ్చారు.    గతంలో కిరణ్ సారు కూడా చాలా నెమ్మదిగా వుండేవారు, అందుకే పదవి వరించింది.   తీర ప్రాంత కేంద్ర మంత్రులు ఏమ్పీలలో  దాదాపు సగం మంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలే.   ఏవో లొసుగులు లేకుండా వుంటయ్యా చెప్పండి. వాళ్ళే మాకు కావాలి ఎందుకంటే కుక్కిన పేనుల్లా పడివుంటారు.  తోక ఝాడిస్తున్న లగడపాటికి కూడా తిప్పలు తప్పవు. 

కాబట్టి, కొంచం ఆవేశాన్ని, ఆశల్ని తగ్గించుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్స్పైరీ డేట్ ఉండని మందులు డా॥ సోనియా రాసిస్తారు.   లేదంటే మీ ఇష్టం.      


2 కామెంట్‌లు :

  1. అవన్నీ కాంగ్రెసోళ్ళకి ఆడా మగా అనే తేడా లేకుండా అనునిత్యం జరిగే పరాభవాలే! వాళ్ళు కూడా బొత్తిగా సిగ్గూ శరం లేని వాళ్ళే కాబట్టి యేమీ అనుకోరు కూడా. కాంగ్రెసు పార్టీ రాజకీయాల్ని 1947 నుంచీ నిశితంగా పరిశీలించి చూడగా ఒక పరమ సత్యం బోధ పడింది. పుట్టగానే పురిటి స్నానం చేయించేటప్పుడు కొందరికి సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లాంటివి జారిపోతాయి. అటువంటి పుణ్యాత్ములు పెరిగి పెద్దయ్యాక కాంగ్రెసు పార్టీ లో చేరడం గానీ కాంగ్రెసు పార్టీకి వోటు వెయ్యడం గానీ చేస్తుంటారు. అందుకె ఇవ్వాళ దాదాపు అన్ని పార్టీల్లోను యేదో ఒక లొసుగు ఉన్నప్పటికీ- మిగతా వాళ్ళు ఒకప్పుడు గాకపోతే మరొకప్పుడు లేదా జనం నిలదీసినప్పుడయినా సిగ్గు పడతారు గానీ - కాంగ్రెసు వాళ్ళు మాత్రం సిగ్గు పడకుండా ఉండగలగటం.
    మరొక విశేష మేమిటంటే మన ఆ.ప్ర.కాం. వాళ్ళని ఇదివరకటి నుంచే మిగతా రాష్ట్రాల కాంగ్రెసోళ్ళు జోకు లేసుకునే వాళ్ళంట. యెందుకంటే ఇవ్వాళ సొంత రాష్ట్రం లో దిక్కూ దివాణం లేని దిగంబరం, డిగ్గీ, జాదూ లాంటి వాళ్ళు కోటరీ లో చేరి మన రాష్ట్రాన్ని విడగొట్టటం దగ్గిర్నుంచీ అన్ని విషయాల్లోనూ యెలా హల్చల్ చేస్తున్నారో చూసారా?42 స్థానాలకి 41 స్థానాలు పువ్వుల్లో పెట్టి అందించిన కాలంలో కూడా మనవాళ్ళు డిల్లీలో కుక్క బతుకు బతికారు. పయిగా ఇక్కడ ముఖ్యమంత్రిని యెన్నుకోవడానికి కవర్లో నాలుగు పేర్లు రాసి పైకి పంపించటం, వాళ్ళు యెవరికి టిక్ పెడీతే వాళ్ళని ఒప్పుకోవటం. తాడుల్లాగా యాబయ్ దాటిన వాళ్ళంతా మొనగాళ్ళమంటూ మనదగ్గిర వోట్లు వేయించుకుని వాళ్ళు చూపించిన సినిమా అది. విధేయంగా ఉండటంలో కూడా పరాకాష్ట - చూసారా మేం మీకు యెంత విధేయంగా ఉన్నామో అని డప్పు కొట్టుకోవటానికి కాకపోతే ఇక్కడే ఒక డబ్బాలో ఆ నాలుగు పేర్లూ తగలేసి గిలకరించి లాటరీ తీసేపాటి యేర్పాటు కూడా చేసుకోలేకపోయారా?
    ఇప్పటికీ అదే తంతు. కేంద్రంలో ఉన్న తమ అధిష్టానం అన్ని పార్టీల వాళ్ళూ మేము తెలంగాణా యేర్పాటుకు సుముఖమే అని ఒప్పుకున్నాకనే ప్రకటన చేసింది గదా. మరి యెందుకు వీళ్ళు రెండు ముఠాలుగా చీలిపోయారో యెవరికయినా అర్ధ మవుతుందా అసలు? అన్ని పార్టీల వాళ్ళూ యేదో ఒక సందర్భంలో గులాబీ కండువా భుజాన వేసుకుని తిరిగారు, మాకు అభ్యంతరం లేదని లేఖలు కూడా ఇచ్చారు ఇవ్వాళ సమైక్యం గురుంచి మాట్లాడటమేమిటి అర్ధం లేకుండా?మిగతా పార్టీ లేవీ అధికారంలో లేవు గాబట్టి యెలా మాట్లాడినా పెద్దగా నష్టముండదు. కానీ వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళుగా విభజన వల్ల యే ప్రాంతమూ నష్టపోకుండా చూడాల్సిన బాద్యత ఉన్నది వీళ్ళ మీద. పయిగా ఇవాళ విభజన జరుగుతున్న తీరు సాంకేతికంగా యెన్నో లోపాలతో కూడిన దుష్ట భూయిష్ట నికృష్టమయిన రాజ్యాంగ విరుధ్ధమయిన పధ్ధతిలో నడుస్తున్నది. ఈ గాడిదలు ఒకడేమో విభజన ఆపాలని చూడ్డం, మరొకడు మేడం, మేడం నన్ను ము.మం. ని చెయ్యండి - నేను మీకెలా కావాలంటే అలాగ చక్కగా చేసి పెడతానని పైరవీలు చెయ్యటం. యేమిటిదంతా - Damn Shit of INDIA. ఇంత కాలం ఉద్యమం జరిగి అందరూ ఒప్పుకుని తీరా ప్రకటన జరిగాక విభజన ఆపటం అంటే నిజంగా కిరాతకమయిన పని. సాంకేతిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండి ఇరు ప్రాంతాల వాళ్ళనీ సమాధాన పర్చటం బదులు ఈ వెధవ్వేషాలు దేనికి వేస్తున్నారో తెలుసా? అలవాటు లేకపోవటం వల్ల! కుంపట్లు రగిలించటమే తెలిసిన వాళ్ళు తొలి సారి ఆర్పటానికి తగులుకుంటే - పిల్ల కాలవ ఈదలేని వాడు సముద్రాన్ని ఈదుతానని పట్టుబడితే - ఇలాగే తగలడుతుంది మరి?!
    అది అంతే. యే మాత్రం మారకుండా అది అనంతంగా సాగి పోతూనే ఉంటుంది. యెంతగా అవినీతితో పుచ్చిపోయినా, ప్రజలతో సంబంధం లేకుండా తమ స్పాన్సరర్లకి మాత్రమే మేలు చేసే రాజకీయాలు నడిపినా, అధికారంలో ఉన్న ప్రతి సంవత్సరానికి లెక్కకొక్కటి చుప్పున రావణకాష్టాల్ని రగిలించినా యేమీ పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళకే వోట్లు వేసే వాళ్ళలాంటి సిగ్గులేని మంద వోటర్లుగా ఉన్నంత కాలం పరిస్తితిలో యేమీ మార్పు రాదు.ఇది ఇంతే.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. Renuka is not new to this. Her entire political "career" revolved around a few individuals with whom she claimed proximity. Inititially she was an ardent NTR chamcha, tried to cozy up to Babu later before jumping onto Sonia bandwagon. Who knows she may try NaMo next?

    రిప్లయితొలగించండి