23, ఆగస్టు 2013, శుక్రవారం

చిరంజీవికి దిమ్మతిరిగి మైండు బ్లాంక్ అయ్యింది!


జంధ్యాల దర్శకత్వంలో  25 సంవత్సరాల క్రితం వచ్చిన విజయవంతమైన చిత్రం అహ నా పెళ్ళంట.    ఇందులో కోట శ్రీనివాస రావు చేసే పిసినారి చేష్టలకు ఆయన బామ్మర్ది సుత్తి వీరభద్ర రావు పిచ్చివాడై బట్టలు చింపుకుంటాడు.    భవిష్యత్తులో కలెక్టర్ కావాల్సినవాడు కాస్తా పిచ్చోడవుతాడు.  


విభజన ప్రకటన తరువాత 24 ప్రేముల సినిమా కాస్తా రెండే రెండు ఫ్రేములకు పరిమితమైంది.   విభజనా లేక సమైక్యమా?    ప్రస్తుతం మన చిరుజీవి పరిస్తితి కూడా సుత్తి వీరభద్ర రావులా  తగలడింది.    రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటాడు. అదే సమయంలో   హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా చేయ్యాలంటాడు.   విభజన ప్రక్రియ ముందుకు పోవడం లేదు అయితే వెనుకకు పోయినట్లు నేననుకోవడం లేదు అని 3:8 నిష్పత్తిలో ఆంగ్లం మరియు తెలుగులో పంచుల మీద పంచులు ఇస్తున్నాడు.   ఒక మాటకు ఇంకొక మాటకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు. 

ఒకపక్క కొడుకు, తమ్ముడు, మేనల్లుడు సినిమాలు విడుదల కాక, హైదరాబాదు దాటి ఆంధ్రా ప్రాంతం వెళ్ళడానికి మొహం చెల్లక మింగ లేక కక్కలేక అన్నట్లు వుంది ఆయన పరిస్తితి.     18 మంది ఎం ఎల్ ఎ లతో కళ కళలాడాల్సిన చిరు,  ప్రజా రాజ్యాన్ని పళ్ళెంలో పెట్టి కాంగ్రెస్కు ఇచ్చాడు. పార్టీని విలీనం చెయ్యనట్లయితే ఆయనకు వున్న గ్లామర్తో ఈ పాటికి తీరాంధ్ర అనే వెండి తెరపై నిజమైన నాయకుడుగా ప్రజల మనసులు గెలుచుకొని ఉండేవాడు.   ఇప్పుడు  హీరో కాస్తా కమెడియన్ కి ఎక్కువ కారెక్టర్ ఆర్టిస్టుకు తక్కువగా అయిపోయాడు. ఇదేనేమో విధి వైపరీత్యమంటే.    

4 కామెంట్‌లు :