తె రా స అంటేనే తెలంగాణా - తెలంగాణా అంటేనే తె రా స అని ప్రఘాడంగా విశ్వసించే వాళ్ళలో నేను ముందువుంటాను. అలాంటి తె రా స, పుట్టి బుద్ధి ఎరిగిన తరువాత ఒక్క సారి కూడా ఖమ్మం జిల్లాలో గెలిచిన దాఖలాలు లేవు. అక్కడ పార్లమెంటు స్థానానికి చరిత్రలో జరిగిన ఏ ఎన్నికలో కూడా తెలంగాణా పార్టీ గెలవలేదు. 1971లో జరిగిన ఎన్నికలలో చెన్నారెడ్డి గారి తెలంగాణా ప్రజా సమితి తెలంగాణా మొత్తం గెలిచినా ఖమ్మంలో మాత్రం ఓడి పోయింది. పోనీ గత దశాబ్ద కాలంలో జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు చూద్దాం --
సంవత్సరం సంస్థ మొత్తం సభ్యుల సంఖ్య తెరాస పోటీ చేసినది గెలిచినవి వోట్ల శాతం
2001 MPTC 365 37 సున్నా 0.28
2001 ZPTC 28 10 సున్నా 0.73
2006 MPTC 410 11 ఒకటి 0.16
2006 Z PTC 28 1 సున్నా 0.03
ఇప్పటి వరకూ ఖమ్మం ఎం పి సీటు నుండి గెలిచిన వారి వివరాలు పరిశీలిస్తే, నాదెండ్ల భాస్కర్ రావు గారి నుంచి నామా నాగేశ్వర రావు, రేణుకా చౌదరి గారు వరకు ఎవ్వరూ స్థానికులు కాదు. అంతో ఇంతో నదికి ఆ వైపున వియ్యంకులో, బావమరుదులో ఉన్నవాళ్ళే.
గత 2-3 సంవత్సరాలలో రాజీనామాలు-ఉపఎన్నికలు జరిగినా, అవి కేవలం కరీంనగర్, వరంగల్, మెహబూబ్ నగర్ మరియు నిజామాబాద్ కి మాత్రమె పరిమితమైనాయి. ఖమ్మం జిల్లాలో నక్సలైటు పార్టీ (సి పి ఎం ఎల్) తెలంగాణానే ఉఛ్వ్యానిశ్వాసాలుగా జీవిస్తున్న మన చిత్తూర్ జిల్లా సిపిఐ నారాయణ గారి పార్టీకి కలిపి ముగ్గురు శాసన సభ్యులు ఉన్నారు. వీరు ముగ్గురు రాజీనామా చేసి మళ్ళీ గెలవటం ద్వారా, ఖమ్మం జిల్లాలో కూడా తెలంగాణా తీవ్రతను ప్రపంచానికి తెలియచేసినట్లవుతుంది.
సి పి ఐ గెలిచినా నిఖార్సైన తెలంగాణా వాదం గెలిచినట్లే విస్వశించాలి.
ఆముదాలవలసలో వద్దూ?
రిప్లయితొలగించండిమీరు పొరపాటున నాకు సలహా ఇచ్చారు. ఈ సలహాను దయచెసి క చ రా గారికి ఇవ్వంది, ఎందుకంటె, తేనెతుట్టెను కదిల్చింది వారె కదా!
రిప్లయితొలగించండినేను తగినంత వివరాలతో ఖమ్మం గురించి ఇచ్చాను. ఇంకొకమాట, 3 దసాబ్దాల క్రితంవరకు, ఖమ్మం జిల్లాలొని అతి పెద్ద భద్రాచలం డివిజన్ గోదావరి జిల్లలో వుండేది.
అమ్మ ఏడ్చింది. తెలంగాణావాదం గెలిచింది, ఇగ ఇచ్చుడే.
రిప్లయితొలగించండిhttp://www.eenadu.net/news/newsitem.aspx?item=panel&no=2
Nama Nageswara Rao (born 15 March 1957 in Balapala, Khammam, Andhra Pradesh[1]) is an Indian politician, and a member of the 15th Lok Sabha of India.
రిప్లయితొలగించండిLOCAL SIR................