19, జనవరి 2013, శనివారం

ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందిట

 
హిందూ మత పీఠాధిపతులందరూ చాతుర్మాస దీక్షలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రశాంత ప్రదేశానికి వెళ్లి మౌన వ్రతంతో పాటు కఠోర దీక్షలో వుంటారు. స్వామి వారు దీక్షలో వున్నప్పుడు రోజు వారీ వచ్చే భక్తులకు దర్శనం వుండదు. కానీ మన తెలంగాణా పీఠాధిపతికి ధనుర్మాసం లేదు, చాతుర్మాసం లేదు. అగ్గిపుల్ల గీసి, కొంచం రాజుకోగానే ఫాం హౌస్లో సేద తీరుతారు. కేవలం వి ఐ ఫై దర్శనాలు మాత్రమె వుంటాయి. ఈ మధ్యనే దూరవాణి ద్వారా క చార గారి గళం వినే అదృష్టం కలిగింది. జాగో భాగో మాటలకు కట్టుబడి ఉంటా అని నొక్కి వక్కాణించారు. దానితోపాటే, హైదరాబాదు మీద రెఫరెండం పెట్టండి హైదరాబాదులో తెలంగానం వుందో లేదో తేలుతుంది అని శలవిచ్చారు.

 
 
అంటే  హైదరాబాదుతో కూడిన  విభజనపై భిన్నాభిప్రాయం వుంది అని మీరు ఒప్పుకున్నట్లే కదా ! మీరు, మీ శిష్య బృందం ఎప్పుడు మైకుల ముందుకు వచ్చినా గతంలో జరిగిన 16 ఉప ఎన్నికలలో నూటికి నూరు  శాతం తె రా స గెలిచింది కాబట్టి తెలంగానం బలంగా ఉన్నట్లే అని అంటారు కదా! మరి బల్దియా ఎన్నికలలో ఎందుకు పోటీ య్యలేదు సారూ కొంచెం వివరిస్తారా?

 
 
రేఫరండం అనే పదం వాడి కాశ్మీర్లో నెహ్రు గారు చేసిన తప్పునుంచి ఇంకా బయటపడలేదు, దయచేసి ఆ పదాన్ని మన డిక్షనరీ నుంచి తొలగిద్దాము. హైదరాబాద్లో అభిప్రాయ సేకరణ జరిగి రెండు సంవత్సరాలే కదా అయింది. దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వున్న 150 కార్పోరటర్లు ఎన్నికలకు వచ్చిన ఫలితాలు చూడండి -- :

 
కాంగ్రెస్ : 53 కార్పోరటర్లు..... 50 : 50
తె దే పా : 45 కార్పోరటర్లు ... తె రా స ప్రకారం సమైక్య వాద ఆంద్రోల్ల పార్టీ
భాజపా : 5 గురు ......... హైదరాబాదుతో కూడిన విభజన
మజ్లిస్ : 43 గురు ......... ఇస్తే దేశం కూడా కావాలంటారు. రాయల తెలంగాణా
ఇతరులు : 4 గురు .......... తెలీదు.

 
ఈ ఎన్నికలు వై ఎస్ మరణం తరువాత జరిగినవి. అంటే ప్రత్యెక వాదం బాగా  రగులుకుని జాగో భాగో అన్నప్పుడు   జరిగినవి. తే రా స వారు నామినేషన్ వెయ్యడానికి కూడా భయపడినప్పుడు జరిగినవి.    ఏంటో మంది శాసన సభ్యలు కాంగ్రెస్, తె దె పా ను వదిలి తె రా స లో చేరారు.     కాంగ్రెస్ తె దే పా వారు ఎంతో  మంది కార్పోరటర్లు జగన్ గ్రూప్లో చేరారేకానీ తే రా సాలో ఎవ్వరూ చేరలేదు.

 
 
హైదరాబాద్తో కూడిన తెలంగాణా విభజన గురించి గొంతు చించుకొనే భాజపా వారికి వచ్చినవి 5 సీట్లు మాత్రమే? అందరు శాసన సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ తెలంగాణా వాదం గెలిచినా భాజపా అధ్యక్షుల వారు అంబర్ పేట్  నుంచి రాజీనామా చెయ్యలేదు, ఎందుకంటే వారికి తెలుసు, ఏమి జరుగుతుందో. ఇన్ని సాక్షాలుండగా ఇంకా రెఫరెండం ఎందుకు, దండగ.
   

6 కామెంట్‌లు :

  1. నా బ్లాగులో నేను ఏనాడో రాసిన, అదీ చాలా ఏళ్ళక్రితం ఆంధ్ర పత్రిక విలేకరి రాసిన వార్తను (తెలంగాణాకు అడ్డుపడ్డదెవరు?) పై మీరు రాసిన వ్యాఖ్య చదివాను. ధన్యవాదాలు. పోతే ముందు పేరాలో నేను చేసిన విన్నపాన్ని మరో మారు మీ దృష్టికి తీసుకువస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు -
    "రాష్ట్ర విభజన గురించి ఆందోళనలు, చర్చోపచర్చలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో ఆ నాటి స్తితిగతులను ఓమారు స్పురణకు తెచ్చుకోవాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న ఈ ప్రయత్నంలో మరో రకం ఆలోచనకు తావివ్వరాదని నా అభ్యర్ధన."

    రిప్లయితొలగించండి
  2. Referendum is the best solution. In that only Y/N answer will be there and a 2/3 majority decision will be selected.
    ex. Should Hyderabad should declared UT?: YES/NO. UT will be the preference as there would be lesser taxes, lower petrol & automobile prices.

    రిప్లయితొలగించండి
  3. అఙాత గారు, తక్కువ ధరకు పెట్రొలు వస్తుందనో, పన్నులు తక్కువ వుంటాయనో లేదా, వాయలార్ రవిగారి లాగా 16 సీట్లు (భ్రమ)రాష్ట్రాలని విభజించడం, కేంద్ర ప్రాంత్రంగా చెయ్యటం అనే భావనతో నేను ఏకీభవించను. రాష్ట్రాన్ని విభజన చెయ్యాల్సిందే. హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాలన్నీ కలిపి ప్రత్యెక హైదరాబద్ రాష్ట్రాని చెయ్యాలి. ప్రత్యెక తెలంగాణా ప్రకటించాలి. కరీం నగర్, వరంగల్, విజయవద, వైజాగ్, కర్నూల్, చిత్తూర్ అన్నీ పెద్ద పెద్ద నగరాలుగా అభివ్రుద్ధి చెందాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏంతో కొంత ప్రయోజనం/లాభం లేనిది (ప్రజలకు, వ్యవస్థకు, రాజకీయ నిరుద్యోగులకోసం కాదు) వున్న వ్యవస్థను మార్చడం అవివేకం, వృథా ప్రయాస. ఏదో చేయాలని చేసేయడం కాదు, అర్థవంతంగా చేయాలి. విభజిస్తే ఆటోమేటిక్‌గా అభివృద్ధి చెందేస్తాయనడం అశాస్త్రీయ వాదన, ఎలా అవుతుందో చెప్పాలి.

      తొలగించండి
  4. Kishanreddy is MLA of Amberpet now. From 2004-9, he was MLA of Himayat Nagar.

    రిప్లయితొలగించండి
  5. తప్పును సూచించినందుకు ధన్యవాదములు. సరిచేశాను.

    రిప్లయితొలగించండి