27, జనవరి 2013, ఆదివారం

ఉండవల్లి అంటే అంత ఉలుకెందుకు


పాపం ఉండవల్లిని తిట్టని తెలంగాణా నాయకుడు లేడు. ఒక పార్లమెంట్ సభ్యుడైతే ఆయనను వేశ్యతో పోల్చాడు. మన పిల్ల కాకి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. మన ఆడ పడచు అఫ్జల్ గురు కన్నా ప్రమాద కారి అని సెలవిచ్చింది. ఎవరిని పడితే వారిని తిట్టి, కొట్టే మన మేనల్లుడు ఊసరవెల్లి అని వక్కాణించారు. అతను మాట్లాడిన మాటలను ఇష్టం వచ్చినట్లు వక్రీకరించారు. ఉండవల్లి గారు చెప్పిందేమిటి దానికి మన వాగ్గేయ"కారులు" పాడినదేమిటో చూద్దాము--
 
 
01) పోలవరం కడితే 10 లక్షల ఆయకట్టు స్థిరీకరణ చేస్తూ, కృష్ణా నదిలోకి నీరును మళ్ళించి సముద్రంలో వృధాగా పోతున్న 3000 టి ఎం సి నీటిలో కనీసం 80 టి ఎం సి ల నీటిని రిజర్వాయర్ ద్వారా నిలవవుంచవచ్చు.
ముంపుకు గురౌవుతున్న గిరిజనాలను ఇతోధికంగా ఆదుకోవచ్చు. చైనాలో త్రీ గార్జెస్ ఆనకట్ట కట్టడానికి కొన్ని లక్షల మందిని ఖాళీ చేయించారు, అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, అందుకే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని చెప్పారు.
 
దీనికి చిలువలు పలువలు పుట్టించి - గిరిజనులను చంపేయమన్నాడు ఉండవల్లి అని వక్రీకరించారు మన కుటుంబ సభ్యులు. గిరిజనులు అడవుల్లోనే ఉండాలి. వాళ్ళు మన లాగా గుంటూర్ విజ్ఞాన్లో చదువుకో కూడదు.  మంచి బట్టలు వేసుకోకూడదు, నక్సల్స్ చెప్పేది ఇదే!
 
02) క చ రా గారు రోజువారీ మామూలుగా దుర్భాషలాడే ఒక క్లిప్పింగును చూపించి (తలలు తెగుతవి)  ఖాసిం రజ్వీ లాగా మాట్లాడుతున్నాడు, మంచిది కాదు అన్నాడు ఉండవల్లి.


దీన్ని మొత్తాన్ని తెలంగాణా సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేసి, తెలంగాణా ప్రజలను ఖాసిం రిజ్వీతో పోల్చాడు ఉండవల్లి, ఆయన మీద దాడులు జరిగితే మేము కాపాడలేము అని పొన్నం గారు వక్కాణించారు.
 
03) "మా" పిల్లలు చచ్చిపోతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు మనందరి పిల్లలు, వాళ్ళని   ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా నాయకులు
ఉపన్యసిస్తున్నారు. ఇంతవరకు నాయకుల పిల్లలకు జ్వరం కూడా రాలేదు, కానీ వందలమంది అమాయకులు భావోద్వేగాలకు గురి అయ్యి నిరాశ  చెందుతున్నారు ఇలా రేచ్చకోట్టడం మంచిది కాదు అని చెప్పారు.


దీనికి సమాధానంగా మన గుంటూరు రత్తయ్య గారి కాలేజీలో పేడ బిర్యానీ తింటూ చదువుకున్న పిల్లకాకి - మీ కుటుంబ సభ్యులు వెంకయ్య నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎందుకు చచ్చిపోలేదు జై ఆంద్ర ఉద్యమంలో అని ప్రశ్నించాడు. పిల్ల కాకి గారూ - అప్పుడు చనిపోయింది పోలీసు ఫైరింగులో, ఇప్పుడు చనిపోతున్నది మీ నోటివెంట వస్తున్న నిరాశ నిస్పృహ కలగలిసిన మాటల తూటాలతో. రంగునీల్లు చల్లుకొని అగ్గిపెట్ట కోసం వెదుకుతున్నట్లు చేసిన నటనతో ప్రారంభం అయింది చివరికి అది మిమ్మల్నే అంటించే రోజు త్వరలో వుంది. జై ఆంద్ర ఉద్యమం చేసిన ఉండవల్లి, భాజపా వెంకయ్య ఇద్దరూ ఆంతరంగిక భద్రతా చట్టం కింద జైలు శిక్ష అనుభవించారు. నువ్వు, నీ తండ్రి, నీ సోదరి, నీ మేనమామ ఎన్ని సార్లు జైలుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి మీద కాకతీయ విశ్వవిద్యాలం పిల్లలచేత రాళ్ళు, గుడ్లు వేయించిన నాయకులు బాగానే వున్నారు, ఉద్రేకంతో చేసిన పనికి ఆ పిల్లలు జీవితం బలి అయిపొయింది.
 
04) హరీష్ రావ్, క తా రా రా గారు విధి నిర్వహణలో వున్న ఉద్యోగస్తులను ఎలా కొట్టింది, పోలీస్ ఆఫీసర్లను ఎలా దుర్భాషలాడింది చూపించారు. ఇలా భయబ్రాన్తులనిచేస్తే ఉద్యమానికి, రాష్ట్రం విడిపోవడానికి మిగతాప్రాంతాలవారు
ఎలా సహాయం చేస్తారు అని ప్రశ్నించారు.

ఉండవల్లీ - నువ్వు ఓసరవెల్లివి, ఖబడ్దార్, నీ మీద దాడి జరిగితే మాది బాధ్యత కాదు. యిదీ సమాధానం.


05) చిదంబరం గారి ప్రకటనలో - తెలంగాణా ప్రక్రియ ప్రారంభం అయ్యింది, శాసన సభలో బిల్లు పెట్టి పంపండి అని ప్రకటన చేశారు, ఇలా తీర సీమంధ్ర ప్రాంత వాసులని దొంగలు, దోపిడీదార్లు అంటుంటే 175 మంది
శాసన సభ్యులు ఎలా మద్దతిస్తారు అని ప్రశ్నించాడు.


దీనికి బదులుగా, ఏయ్ ఉండవల్లీ నువ్వు వెశ్యవి, సోనియా గాంధి మీటింగు తర్జుమా చేసిన నువ్వు తెలంగాణా ఇస్తానని ఎందుకు చెప్పావు, నువ్వొక మూర్ఖుడివి అని తిట్టి పోశారు.
 
06) భా జ పా అధినేత అద్వానీ గారు పార్లమెంటులో విదర్భ రాష్ట్రం ఎందుకు ఇవ్వట్లేదు, నరేంద్ర గారి ఉత్తరంపై వారి పార్టీ స్టాండ్ ఏమి చెప్పారు, వారు ఇప్పుడు వోట్ల కోసం ఎలా మాట మార్చారో వివరించారు.


ఆయన వివరించిన గణాంకాల జోలికి ఎవరూ పోలేదు. వాటిని తప్పు అని చెప్పట్లేదు. ఉండవల్లి ఎక్కడ కూడా తెలంగాణాకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. క చ రా కుటుంబం ప్రజలను ఎలా మభ్యపెడుతున్నారో చెప్పి తెలంగాణా ప్రజలను చైతన్య పరచడానికి ప్రయత్నం చేశా సారు. ఇంత తీవ్రమైన భావోద్రేకాలను రేచ్చాకోడుతుంటే, రాష్ట్ర విభజన ఎలా సాధ్యమౌతుందో ఆలోచించుకోవాలి.
 
భర్త్రుహరి సుభాషితాలు ఈ నాటి నాయకులకు బలవంతంగా నేర్పడం అత్యవసరం, వాటిల్లీ మరీ ముఖ్యంగా ఈ రెండు పద్యాలు ----- కందుకమువోలె సుజనుడు, గ్రింది బడి మగుడ్ మీదికిన్నేగాయు జుమీ ..... ఇంకొకటి
తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు.....


26 కామెంట్‌లు :

  1. "01) పోలవరం కడితే 10 లక్షల ఆయకట్టు స్థిరీకరణ చేస్తూ, కృష్ణా నదిలోకి నీరును మళ్ళించి సముద్రంలో వృధాగా పోతున్న 3000 టి ఎం సి నీటిలో కనీసం 80 టి ఎం సి ల నీటిని రిజర్వాయర్ ద్వారా నిలవవుంచవచ్చు."

    ముందు ఈ కింది వాక్యం చూడండి:

    "4.1.03 The dependable yield from Godavari, as allotted by Godavari Water Dispute Tribunal (GWDT) to Andhra Pradesh, has been estimated by the Andhra Pradesh Government to be 1480 Thousand million cubic feet (TMC). From Krishna, the Krishna Water Dispute Tribunal(KWDT) has allotted 811 TMC, from Pennar as per Andhra Pradesh Government 99 TMC, is available. After including some additional yield from the other small rivers, the total comes to 2769 TMC."

    SKC pages 218-219

    మొత్తం రాష్ట్రానికి 2,769 TMC అందుబాటులో ఉంటె, దానిలో గోదావరి నదిలో 1,480 TMC ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు శ్రీకృష్ణ కమిటీకి చెప్పారు. మూడు వేల నీళ్ళు గోదావరిలో వృధాగా పోతున్నాయని ఉండవల్లి ఎలా కల కన్నారో?

    గీతం యూనివర్సిటీకి చెందిన ప్రొఫెస్సర్ శివాజీరావు గారు పోలవరం పగిలితే రాజమండ్రితో సహా అనేక ఊళ్లు మునుగుతాయంటే, ఆయన నిర్లక్ష్యంగా "మా ఇల్లే ముందు మునుగుతుంది" అని సమాధానం ఇచ్చారు. మీరు రిస్కు తీసుకున్నారు కాబట్టి మిగిలిన వారందరూ తీసుకోవాలా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారు,

      విమర్శ అంతె, ఇలా అర్ధవంతంగా ఉండాలి, మీరు చెప్పినదానినిబట్టి అంకెలు వివరించెప్పుదు తప్పు దొర్లి వుండవచ్చు. కానీ నీరు సముద్రంలొకి వెల్తున్న విషయంలొ అబద్ధం లేదు కదా!

      కూడంకులం అణు విద్యుత్వల్ల ప్రమాదం వుందని ఆపెస్తామ? స్సంకేతికంగా ఈ దేశం ప్రపంచంలొనె అగ్రగామి. గోదావరి ఆను పానులు తెలియనివాళ్ళు, ఆదివాసీ పెరుతొ ప్రాజెక్త్స్ నిలిపే ప్రయత్నం చెస్తున్నారు. నర్మదా నది మీద కూదా ఇలానే చేసారు. ఒకపక్క నది పగిలిపోతుంది అని చెప్తారు ఇంకొకపక్క ఆదీవాసులు అమ్మొ మునిగిపోతారు అంటారు.

      ఆత్మహత్యల విషయమ్ళొ - రెందు తప్పులు ఒక రైటు కాదు. ఈ పక్క రెద్ది గారు అన్నా ఆ పక్క చౌదరి గారు అన్నా - చనిపోతుంది పేద విద్యార్ధులే. ఇలా రెచ్చకొడితే బాగుంటుంది అంతే అలానే కానివ్వండి.

      సర్వం త్యాగం చేసి జీవితాన్ని ప్రజలకు అర్పించిన టంగుటూరి గారితో క చ రా కు పోతీ పెత్తి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొవద్దు.

      తొలగించండి
    2. @పోలవరం పగిలితే
      100% Right answer to the hypothetical and pessimistic question raised. Why should it break? What if it won't break? What if Paithan, Sriram sagara cracks?

      AP Share(agreement), availability(varies), total water that must be released in to the sea(ecological requirement) are different.

      తొలగించండి
    3. "గోదావరి ఆను పానులు తెలియనివాళ్ళు, ఆదివాసీ పెరుతొ ప్రాజెక్త్స్ నిలిపే ప్రయత్నం చెస్తున్నారు. నర్మదా నది మీద కూదా ఇలానే చేసారు"

      The rules have changed after the passing of Panchayats (Extension to the Scheduled Areas) Act, 1996.

      Koodankulam is a different category as it is not in a forest (though I oppose it on other grounds).

      "Why should it break? What if it won't break? What if Paithan, Sriram sagara cracks?"

      For your very kind info, dam breakdown analysis is a mandatory requirement.

      శివాజీరావు గారు అల్లాటప్పా తరహా మనిషి కాదు, తెలంగాణా వారు అంతకన్నా కారు. ఊరికే ఆడిపోసుకోకండి.

      తొలగించండి
    4. As it is a mandatory requirement, it will be analyzed by the engineers. What is the use in asking a politician? What answer he expected from him? I think the engineers know their job often far better than Professors.
      @అల్లాటప్పా తరహా :) of course not all Telangana people are అల్లాటప్పా తరహా, though we find many here.

      తొలగించండి
    5. ఆయన ఇంజనీరు కాదనే విషయం నాకు తెలుసు. తనకు తెలియనప్పుడు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడకూడదనే నేనన్నాను.

      పోలవరం గురించి ప్రజలనుండి దాచిన విషయాలు ఎన్నో ఉన్నాయి. స్వలాభం కోసం ఉన్నవీ లేనవీ చిత్రీకరించి, నిజాలను కప్పిపుచ్చి ప్రజలను రెచ్చగొట్టి ప్రయత్నం చేసేవారిని ఊసరవెల్లి అనే అనాలి.

      తొలగించండి
    6. తెలిసి, తెలిసి ఇంజనీరు కాని వాడిని అలాంటి అసంబద్ధమైన వూహాజనితమైన ప్రశ్న వేస్తే మొదట తన ఇల్లు కొట్టుకుపోతుందేమో అని తనూ వూహించే చెప్పాడు, దాన్ని నిర్లక్ష్యం అని ఎందుకు అనుకోవాలి? మనకు నచ్చకపోతే ఎటైనా తిరగేసి, మరగేసి మాట్లాడగలం.

      పోలవరంలో దాచిన అన్ని రగస్యాలు మీకు తెలిస్తే చెప్పండి, ఎండగట్టండి. వుండవల్లిని చంచల్‌గూడకు పంపించండి, ఎవరు కాదన్నారు?

      తొలగించండి
    7. @Jai Gottimukkala27 జనవరి 2013 2:10 PM
      Read this one and tell me how much is flowing into the sea during a year and during the rainy season:

      "WATER AVAILABILITY IN GODAVARI:
      There are different opinions about the quantity of water available at different places in Godavari basin. According to Krishna-Godavari commission (Gulhati) the annual flow in Godavari is 4167 TMC(See Table-8). Khosla Committee report places the dependable flow in Godavari at 3433 TMC . Dr.K.L.Rao estimated that the annual dependable flow at Dowlaiswaram is 3500 TMC (See Fig.) A study for 66 years (1881 to 1946) estimated the dependable flow at 2500 TMC at 89 percent confidence in the year 1951. The Bachawat Tribunal determined the 75% dependable yield of the river as 2750 TMC out of which 1495 TMC was allotted towards the share of Andhra Pradesh. After utilising the river water for the existing projects the state is dumping into the sea about 1000 TMC in addition to another 1000 TMC from the upper states. During floods about 100 to 150 TMC of water is flowing per day through the river into the sea. During the rainy season (from June to October) every day about 10 TMC flows for 2 months and 25 to 30 TMC flows during the other months, resulting in the wasting of about 2000 to 2500 TMC into the sea per year."

      తొలగించండి
  2. "03) "మా" పిల్లలు చచ్చిపోతున్నారు అని గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు మనందరి పిల్లలు, వాళ్ళని ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా నాయకులు ఉపన్యసిస్తున్నారు. ఇంతవరకు నాయకుల పిల్లలకు జ్వరం కూడా రాలేదు, కానీ వందలమంది అమాయకులు భావోద్వేగాలకు గురి అయ్యి నిరాశ చెందుతున్నారు ఇలా రేచ్చకోట్టడం మంచిది కాదు అని చెప్పారు."

    ఈ పిల్లలను మీ అనంతపురం ఎంపీ ఖాలిస్తానీయులతో పోల్చినప్పుడు వారు మీ పిల్లలని గుర్తు రాలేదా? సిరిపురం యాదయ్య విద్యార్థి కాదు హోటల్ పనివాడని దివాకర్ రెడ్డి గేలి చేసినప్పుడు, ఆ అబ్బాయి మీ పిల్లాడు కాదా? డిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఆదిరెడ్డి శవాన్ని బంధువులకు ఇవ్వకుండా అనాధసంస్కారం చేయమన్నప్పుడు మీ పిల్లవాడని అనిపించలేదా?

    చనిపోయిన పిల్లలు మీ వారనుకుంటే కనీసం సంతాపం తెలిపారా? బతికి తెలంగాణా కోసం కొట్లాడమని హితువు చెప్పారా?

    1953 ఆంధ్రోద్యమంలో టంగుటూరి కొడుకులు కాల్పులకు బలి అయ్యారా? విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ఉక్కు పాదంతో నలపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే, ఎందరు రాజకీయ నాయకులకు జ్వరం వచ్చింది? అంతెందుకు డిసెంబర్ 10 సమైక్యవాద డ్రామాలలో లగడపాటి, ఉండవల్లి వంటి వారి పిల్లలు ఉన్నారా?

    ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయా అరుణ్ గారూ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆయన రెచ్చగొట్టి చచ్చిపోవటానికి కారణమయిన వాళ్ళనే ప్రశ్నిస్తుంటే సంతాపం గురించి మాట్లాడుతావేంటి సామీ. ఆయన కోడిగుడ్డు నే ప్రశ్నిస్తుంటే నువ్వు ఈకలు కోసం వెతుకుతవెంది సామి. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నాం అనుకునే వాళ్ళంతా ఇంతేనా. తెరాస నాయకుల్లాగా రెచ్చగొట్టి, వీలయితే కెరోసిన్ పోసి తగలెట్టి గుండెలు బాదుకుని సీమంద్రులని తిట్టిపోస్తే సంతోషమా?

      తొలగించండి
    2. YSR పార్టీ ప్లీనరీలో తెలంగాణా కోసం చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. చంద్రబాబు ఎన్నో సార్లు "ఆత్మహత్యలు చేసుకోవద్దు" అని కోరారు. వారు కూడా రెచ్చగొత్తారా మిత్రమా?

      If you can't even bother to pay homage to the departed, you have no right to play politics.

      తొలగించండి
  3. మీ విశ్లేషనాత్మక వివరణ బాగా వుంది. ఉండవల్లి సభ్యతగా, సౌమ్యంగా వివరించడంలో ఉండవల్లి దిట్ట. పొన్నం, కెటిఆర్, హరీష్ రావుల చవుకబారు దాడి వాళ్ళ భయాందోళనలను చూపుతోంది. ఉండవల్లి ఇదే ప్రెజెంటేషన్ రాష్ట్రం నలుమూలలా చూపించాలి. ఎవరేమిటో ప్రజలకు తెలియచెప్పాలి.
    ఇదే ఉండవల్లి అవినీతిపరుడైన రాజశేఖరరెడ్డిని వెనకేసుకొచ్చాడన్నది మరువలేము.

    రిప్లయితొలగించండి
  4. తెరాస వారి ఆందోళనకు, అసహనానికి కారణం, ఎవరు వూసరవల్లో కింది లింకులో 9:30 దగ్గర కచరా అసెంబ్లీ స్పీచ్ వింటే తెలిసిపోతుంది.
    http://www.youtube.com/watch?v=KQ4n8tdq7Cs&list=SPr8zOjJ8LheP-4q0l-hja0phwuEKH5-9h

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. Maoists abivruddi vaddu ani analede... Madhyalo vallani enduku lagutaru... Moists evvarini chaduvukovaddu ani analedu... Jarugutunnadata abivruddi kadu... Polavaram kadite bio diversity ki vacchhe muppu kooda vuntundi. Gamaninchandi. Aina Polavaram kadite e prantham ekkuavu mumpu ku guri avutundi? E prantham vari vela ekaralu sagu loki vastai koddiga cheptra sir,

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పొలవరం కడితే, ఎగువ ప్రాంతాలకు కావలసిన విద్యుత్ను, కాలువల ద్వారా నీతిని కోస్తా ప్రాంతాల రైతులకి ఇవ్వ వచ్చు. రాయపాటికి, క చ్ రాకు వారి బినామీ పత్రికల వాళ్ళకి కాంత్రాక్తులు కూడా దక్కవచ్చు. నక్సలైట్లు చేస్తున్న అభివ్రుద్ది చత్తీస్ గడ్ లో చూస్తున్నాము కదా! ఓ యులో, వుద్యమ పార్టీలో వాళ్ళు వున్నంతకాలం తెళంగాణా రాదు, అది తెలంగాణకు నష్టం.

      తొలగించండి
    2. @నక్సలైట్లు చేస్తున్న అభివ్రుద్ది
      :))

      తొలగించండి
    3. Polavaram is not a hydro electric project. It is only a reservoir for your kind information.

      తొలగించండి
    4. Hydro electric generation up to 80MW is on paper.

      తొలగించండి
    5. @ అజ్ఞాత28 జనవరి 2013 4:25 AM:

      Well, search on google first before talking:

      Polavaram is a multi purpose project with electricity generation of more than 800MW

      తొలగించండి
  7. గోదావరి మీద వుండే ప్రాజెక్ట్లలో అన్నీ తెలంగాణలోనే వున్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి డెల్టాలో వరద నీటిని రెగులేట్ చేయడానికి అవకాశముంటుంది. ముంపు కాకుండా ఏ ప్రాజెక్టు కట్టలేము, పట్టణాలు, వ్యవసాయభూములు, కొండప్రాంతం ఇలా ఎక్కడా ముంపుకు గురికాకూడదంటే ఇక ఎక్కడ కడతారు? సముద్రంలోనా?

    రిప్లయితొలగించండి
  8. మీరెన్ని మాట్లాడినా ప్రతీ దానికీ వక్ర భాష్యం చెప్పడం మినహా అర్ధం చెసుకునే ప్రయత్నం చేయరు..అమ్మా ..అన్నా...కూడా...నీయమ్మా అన్నవ్ ...మా తెగులుకి బలయిపోతావని రంకెలేస్తారు...శ్రీ క్రిష్న కమిటీకే అడ్డమైన చెత్తనీ అంటిచిన నీచ రాజకీయమిది...వీళ్లతొ భగవంతుడు కూడా కూర్చుని మాట్లాడ లేడు...వినాసకాలే విపరీత బుద్ది ...ఈ రాష్ట్రానికి దరిద్రం రాసి పెట్టి ఉంది...అంతే...

    రిప్లయితొలగించండి
  9. చనిపోతుంది పేద విద్యార్ధులే. ఇలా రెచ్చకొడితే బాగుంటుంది అంతే అలానే కానివ్వండి. నెంబరు పెరిగే కొద్దీ మాంచి ఊపు కనబడుతుంటుంది ఈ లంగానా నాయకుల మొహోల్లో.....జనాల్ని రెచ్చ గొట్టి రాష్ట్రం తెచ్చుకుని...అధికారం సంపాదించుకుని....దేముడి ఫామిలీలా మనమూ సంపాదించుకోవలన్న యావ... అంతే...పేద వాడు ఎక్కడున్నా...ఈ వెధవల రాజకీయానికి...వాళ్లకి గంజి నీళ్ళే గతి....

    రిప్లయితొలగించండి
  10. అవును మరి ప్రజల్ని ఎలా మనిపులేట్ చేయాలో రహస్య నివేదిక లో చెప్పిన శ్రీక్రిష్ణ కమిటీ న్యాయంగా వ్యవహరించిందా ? శ్రీక్రిష్ణ అంటే నిజమైన శ్రీక్రిష్ణుడు అన్న లెవల్ లో మాట్లాడుతున్నావే..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీవు చెప్పిన వర్షన్ తీసుకోవడానికి నీవే రమేషుడవైనట్టు(విష్ణువు) మాట్లాడుతున్నావే? ఇలాంటి బేకారు మాటలు తెరాస వాళ్ళకి మామూలే.

      తొలగించండి