5, జనవరి 2013, శనివారం

రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రేసుకి దక్కేది ఏమిటి

 
1960వ దశకంలో కాంగ్రెస్ వృద్ధ నాయకుడు శ్రీ మెట్ల సత్యనారాయణ రావు గారు ఒక సినిమా తీశారు, దాని పేరు "చివరకు మిగిలేది". ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్తితి అదే! నిర్మాతగా ఆయనకూ ఏమీ మిగలలేదు, ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా తమ రాజకీయ విన్యాసాల వాళ్ళ ఏమీ మిగిలేట్లు లేదు.
 
 
లాభ నష్టాలు బేరీజు వేసుకోకుండా ఏ రాజకీయ పార్టీ క్లిష్ట సమస్యలపై నిర్ణయం తీసుకోదు. దశాబ్దం పై చిలుకు చరిత్ర కలిగిన కాంగ్రేసు పార్టీ గురించి, వారి ధోరణి గురించి చెప్పనవసరం లేదు. సంకీర్ణాల యుగంలో ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా తమ నిర్ణయాలను ఇతర భాగస్వామ్య పార్టీల మీద రుద్ద లేదు. ఎన్నికలప్పుడు మాత్రమె అయోధ్యలోని రాములోరిని బయటకు తీసుకువచ్చే భా జ పా వారికి కూడా ఈ విషయం గురించి బాగా తెలుసు. కానీ సగటు వోటరు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఆ సంగతి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు.
 
 
రాష్ట్రాన్ని విభజించినప్పటికి, తెలంగాణలో వున్నా 110 సీట్లలో కనీసం 20 సీట్లు కూడా కాంగ్రెస్కు దక్కవు కారణం అక్కడ ఉద్యమ పార్టీ తె రా స, బిల్లుకు మద్దతు ఇస్తామనే భాజపా ఏ సంగతీ తేల్చని వై క పా, తేల్చి తెల్చనట్లున్న తె దే పా ఆ క్రెడిట్ అంతా కొట్టేస్తారు సరికదా, పదో పరకో సీట్లు వచ్చే అవకాశమున్న తీర సీమాన్ధ్రలో కూడా కాంగ్రెస్ పని హుళక్కే అవుతుంది. ఏతా వాతా తేలింది ఏమిటంటే-- విభాజనైనా, సమైక్యమైనా కాంగ్రెస్, తే దే పాలకు మిగిలేది శూన్యం. కనీసం వై కా పా అధికారంలోకి వస్తే, నయానో, భయానో వాళ్ళని మంచి చేసుకొవచ్చు. అన్ని నదులు వచ్చీ సముద్రంలో కలిసినట్లు, జగన్ పార్టీని కూడా తమలో కలిపపేసుకోవచ్చు. తే దే పాని దెబ్బకొట్టి జగన్ పార్టీ బల పడేలా చెయ్యాలంటే, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే సరి.
 
 
లేదా కాంగ్రెస్ నిజంగా బతికి బట్ట కట్టాలంటే, హైదరాబాదుని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం ఒక్కటే మార్గం.

1 కామెంట్‌ :

  1. విభజించినా ఒకటిగా ఉంచినా కాంగ్రెస్ కి మిలేది చిప్పే :) 2014 లో

    రిప్లయితొలగించండి