25, జనవరి 2013, శుక్రవారం

తెలంగాణాతో ముడిపెట్టిన గోర్ఖాలాండ్ ఉద్యమకారులు

 
తెలంగాణపై చర్చోప చర్చలు తీవ్రంగా జరుగుతుండగా గోర్ఖాలాండ్ విభజన వాదులు తమ స్వరాన్ని మరింత పెంచారు. హిందూస్తాన్ టైమ్స్ కధనం ప్రకారం కేంద్రం చిన్న రాష్ట్రాల వేర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకుంటే గోర్ఖలాండ్లో పరిస్తితి చేయ్యిదాటి పోయే ప్రమాదం వుంది. పత్రిక కథనం ప్రకారం గోర్ఖాలాండ్ ఉద్యమ పెద్ద రోషన్ గిరి ఇలా అన్నారు - "మాది 107 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉద్యమం, తెలంగాణా ప్రత్యెక రాష్ట్రం వేర్పాటు చేసే పక్షంలో గోర్ఖాలాండ్ కూడా వేర్పాటు చెయ్యాలి".   లేని పక్షంలో వందాలాది మంది యువకులు ఆయుధాలతో పోరాటానికి  సిద్ధంగా ఉన్నారు.

 
తెలంగాణా నాయకులది "శాంతియుత మిలిటెంట్ పోరాటం" అయితే, గోర్ఖాలది "అశాంతియుత మిలిటెంట్ పోరాటం". గోర్ఖాలాండ్ విభజన చేస్తే దేశ భద్రతకే పెను ప్రమాదం. గోర్ఖాలు "కలకత్తా సహిత" ప్రత్యేక రాష్ట్రం అడగటం లేదు కానీ, వాళ్ళు విభజన కోరుకొనే ప్రాంతం దేశ సరిహద్దులకు దగ్గరగా వుంది.
ఇలాంటి పరిస్తితులలో  ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తేనెతుట్టె కదిపే ప్రయత్నం చేయకపోవచ్చు.


పూర్తి వివరాలకు ఈ క్రింది లింకు నొక్కండి


http://in.news.yahoo.com/gjm-unit-threatens-armed-agitation-gorkhaland-183000149.html
 

5 కామెంట్‌లు :

  1. గూర్ఖాలు డార్జీలింగ్ సహిత గోర్ఖాలాండ్ అడుగుతున్నారు. డార్జీలింగ్ గోర్ఖాలాండ్ భూభాగంలో ఉంది కాబట్టి ఇది సహేతుకమే.

    గోర్ఖాలాండ్ నుండి కలకత్తా దాదాపు 600 కిమీ దూరం. అందుకే వారు "కలకత్తాతొ కూడిన గోర్ఖాలాండ్" అడగలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మేమూ చార్మినార్ సహిత, తెలంగాణ రహిత హైదరాబాదునే UT కోరుతున్నాము. UT అయితే ధరలు, పెట్రోలు అగ్గువగా దొరుకుతాయి. కార్ల ధర తక్కువ ఇంకా ఎన్నో లాభాలు వున్నాయి. మా డిమాండూ సహేతుకమే.

      తొలగించండి
  2. మీ వ్యాఖ్య రాయల తెలంగాణాను ప్రొత్సహించెలాగా వుంది. కర్నూల్ నుంచి హైదరాబాద్ 200 కి మీ. అదే వాల్లు విజయవాడకు రావాలంటే 430 కి మీ. అదే ఖమ్మం నుంచి విజయవాడకు కెవలం 120 కి మీ దూరం. కానీ ఖమ్మం నుంచి హైదరాబద్ 200 కి మీ.

    కాబట్టి రాజధాని ఎంత దూరంలో వుంది అనే దానిని కూడా, రాష్త్రాల విభజనలొ పరిగనలొకి తీసుకోవాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజధాని ఎంత దూరంలో వున్నవారు ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్ చేయవచ్చు? అన్న విషయం మీరిద్దరూ లెక్క వేసి తేల్చగలరు.

      తొలగించండి
    2. లేదండీ, నేను రాయలసీమ & కళింగ (ఉతారాంధ్ర) రాష్ట్రాలు కావాలని కోరుకుంటున్నాను. ఎంతయినా నేను రాయలసీమ అల్లుణ్ణి కదా :)

      తొలగించండి