దురదృష్ట వశాత్తు, ప్రస్తుతం దేశంలో రెండే రెండు జాతీయ పార్టీలు మిగిలినయ్, అవి కాంగ్రెస్ భాజపా లు. ఈ రెండు పార్టీలు అన్ని రాష్ట్రాలలో లేనప్పటికీ యు పి ఎ, ఎన్ డి ఎ పేర్లతో ప్రాంతీయ పార్టీల కూటములకు నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసినదే.
జగన్ విషయంలో కాంగ్రెస్, గాలి బ్రదర్స్ విషయంలో భా జ పా రాజీ పడటానికి సిద్ధంగా వున్నాయి. ఈ దిశగా సంప్రదింపులు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిద్ర లేచిన మొదలు టి వి మాధ్యమాల ద్వారా పరస్పరం వ్యతిరేకించుకుని సిద్ధాంత రాద్ధాంతాలు చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ రెండు పార్టీలు అవినీతి విషయంలో రాజీ పడినట్లే. గడ్కరీ గారిని మలి దఫా పార్టీ అధ్యక్షుడ్ని చెయ్యడం ద్వారా అవినీతి విషయంలో వారి ద్వంద నీతిని వారే బయట పెట్టుకున్నట్లు అయింది. ఈ పొత్తుల ప్రక్రియ కార్య రూపం దాలిస్తే,కేవలం గెలవడం కోసం డబ్బు కోసం మాత్రమే, కాంగ్రెస్ కాంగ్రెస్ జగన్తోను, భా జ పా గాలి బ్రదర్స్తోనూ పొత్తు పెట్టుకున్నట్లుభావించాల్సి వస్తుంది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి