21, జనవరి 2013, సోమవారం

వ్రతమూ చెడింది - ఫలితమూ దక్కేట్టు లేదు

 
పాపం చంద్ర బాబు గారి  కష్టాలు పాకిస్తాను అధ్యక్షుడికి కూడా రాకూడదు. ఒక పక్క కాళ్ళు పుళ్ళు పడుతున్నా పంటి బిగువన మూడు నెలలనుంచి నడుస్తున్న బహుదూరపు బాటసారి.

 
శాసన సభలో మీరు బిల్లు పెట్టండి, పొట్టిదో- పొడుగుదో సంతకం పెడతాం అని రెచ్చిపోయారు. ఆ... కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వదులే అని ఒక నమ్మకం. పుట్టి మునిగింది, మీరందరూ సంతకం పెట్టారు కాబట్టి రాష్ట్ర వేర్పాటు ప్రక్రియను ప్రారంభించండి అని డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. తూచ్ రాత్రి పూట రాష్ట్రం ఎట్లా ఇస్తారు అన్నాడు. ఆ రోజు మొదలైన ఆయన కష్టాలు ఇంకా "నడుస్తూనే" వున్నాయి. డిసెంబర్ అంటేనే బాబుకు అచ్చొచినట్లు లేదు. తన తెలంగాణా పర్యటనలో భాగంగా, తెలంగాణపై తొందరగా పగటిపూట నిర్ణయం తీసుకోండి, మేము గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అని అఖిల పక్షంలో వక్కాణించారు. అంతకముందు చేసిన తప్పులకు ఒక కన్నె పొడుచుకున్న బాబు గారు ఇప్పుడు రెండు కళ్ళు పొడుచుకున్నారు. అటు తెలంగాణా వాళ్ళు ఈయన గారిపై విశ్వాసం వుంచట్లేదు. ఇటుపక్క తీరాంధ్ర ప్రదేశ్లో కూడా బాబు గారి నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీకి కావలిసిందే ఇలాంటి పరిస్తితి. గోచార రీత్యా బాబు గారి పరిస్తితి బొత్తిగా ఏమీ బాగా లేదు, హతవిధీ!

1 కామెంట్‌ :

  1. అదంతా మీ వూహ. చంద్రబాబు చేసింది సరైనదే. ఓ పార్టీగా, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ముఖ్యమైనవే అన్నది సరైన సిద్ధాంతం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది చంద్రబాబు హయాంలోనే అని ఒప్పుకోక తప్పదు. అతను చేసిన తప్పంతా హైదరాబాద్తో పాటు సీమాంధ్ర పట్టణాలను అభివృద్ధి చేయకపోవడంతో తెలంగాణా వాదులకు హైదరాబాద్ దొబ్బేయాలనే దురాశ పుట్టింది. కాంగ్రెస్ చేసిందల్లా హైదరాబాద్ పరిసరాల్లో భూములు కబళించడమే. ఎంతైనా మన నాయుడుబావే మేలు.

    రిప్లయితొలగించండి