15, జనవరి 2013, మంగళవారం

ప్రజలను సోమరిపోతులని చేస్తున్న రాజకీయులు


తమిళనాడు వాసులకి "పొంగల్" శుభాకాంక్షలు.     ఇప్పుడు కేవలం రు|| 25 జేబులో వుంటే చాలు, చెన్న పట్నంలో ఎంచక్కా ఒక రోజు బతికేయవచ్చు.  


ముఖ్య మంత్రి కుమారి జయలలిత గారు ఒక కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు.   దాని ప్రకారం చౌక ధరల అంగళ్ళలో ధర వరలు ఇలా వుంటాయి :


ఇడ్లీ ఒక్కింటికి - రు|| 1-00 (సాంబారు, జాతీయ జెండాలో వుండే 3 రంగుల్లా వుండే 3 రకాల పచ్చళ్ళుతో సహా)
సంబారు అన్నం - రు|| 5-00 (మాంచి ములక్కాడలు, చిన్న సైజులో వుండే ఉల్లిపాయలతో సహా వాళ్ళే మొత్తం సమ పాళ్ళలో  కలిపి/పిసికి ఇస్తారు
పెరుగన్నం - రు 3-00 (నంజుడికి ఆవకాయ ముక్కతో సహా)


పొద్దున్నే లేచి ఎంచక్కా నోరు కడుక్కొని 4/- జేబులో వేసుకొని పొతే, ఫలహారం వేడిగా దొరుకుతుంది.    వెంటనే ఇంటికొచ్చేసి, ప్రభుత్వం వారు ఉచితంగా ఇచ్చిన టెలివిజన్ ముందు కూర్చొని, పురుచ్చి తలైవి (విప్లవ వనిత) గారు ఉచితంగా ఇచ్చిన కేబుల్లో  (అరసుకేబుల్) సినిమాలు గట్రా చూసేసి కొంచెంసేపు నడుమువాలిస్తే 
మధ్యాహ్నం అవుతుంది.    ఎంచక్కా,మళ్ళీ ఒక్క 8/తీసుకొని కొంచం కష్టపడి 
నడిస్తే, సాంబారు అన్నం,పెరుగన్నం తిని త్రేన్పుతూ ఇంటికొచ్చి మళ్ళీ టి వి చూడొచ్చు.  
 
 
మళ్ళీ రాత్రికీ ఇదే వరస.   మొదట్లో మహారాష్ట్రలో కూడా "ఝుంకా భాకర్" అని దుకాణాలు ఉండేవి.  అక్కడ ఇడ్లీ బదులు వడా-పావ్ అంతే తేడా!
 
 
అనాధ శరణాలయాల్లోనో, చదువుకొనే పిల్లల్ని ప్రోత్సహించడానికో ఈ పధకం బాగానే వుంటుంది, కానీ కేవలం వోట్ల కోసం, సీట్ల కోసం ప్రజలని సోమరిపోతుల్లాగా తీర్చి దిద్దుతున్న ఇలాంటి రాజకీయ నాయకుల పాపం పండేదేప్పుడో  కాలమే నిర్ణయించాలి.    

3 కామెంట్‌లు :

  1. తెదేపా మొదటి సారి గెలిచినప్పుడు ఇట్లాంటిదే ఒక పథకం పెట్టారు. హోటల్ వాళ్ళు తక్కువ తిన్నారా? సాదా ఇడ్లీ అన్న గారి రేట్లకు, స్పెషల్ ఇడ్లీ మామూలు ధరలకు అమ్మారు.

    రిప్లయితొలగించండి
  2. ఆ తెదెపా సాదాఇడ్లీలు తెగ తిని హైదరాబాద్ ప్రాంతంలో బాగా కొవ్వెక్కి సోమరిపోతులు అప్పటినుంచి ఎక్కువయ్యారు సార్

    రిప్లయితొలగించండి
  3. అఙాత గారు మీరు చెప్పింది నిజం. స్థానికంగా వుందెవాళ్ళు కష్ట పడటానికి ఇష్టపడనప్పుడు ఇడ్లీలు తక్కువ రేటుకు పెట్టినా పెట్టకపోయినా, వలసలు పెరగడం ఖాయం. ఈ నిజం బొంబాయి, దుబాయి, హైద్రాబాదు విషయంలొ తెలిసిందెగదా!

    రిప్లయితొలగించండి