12, జనవరి 2013, శనివారం

రేప్ మరియు క్రిమినల్ కేసుల్లో రాజకీయ నాయకులు

 
ప్రజల మేలు కోసం, మనం ఎన్నుకోబడిన మన  ప్రతినుదులు ప్రజాహితం  కోరుతూ చట్ట సభలలో చట్టాలు చెయ్యాలి  అలాంటి చట్ట సభలలో ఎలాంటి వారు వున్నారో చూద్దాం :
 
 
రేప్ కేసులలో ఉన్నవారు : 12 మంది 
స్త్రీ లను దూషించడం, క్రూరంగా హింసించడం  వంటి కేసులున్నవారు : 36 మంది 
 
 
మొత్తం మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసన సభ సభ్యులు మరియు పార్లమెంటు సభ్యుల సంఖ్య : 4835
వారిలో నేర చరిత వున్నా వారి సంఖ్య : 1448 మంది 
అంటే దాదాపు 30 శాతం మంది ఈ కోవలోకి వస్తారు 
 
 
ఇలాంటి వారు దాదాపు అన్ని పార్టీల లోను వున్నారు.  వీళ్ళందరూ ఎన్నికలప్పుడు దాఖలు చేసే తమ వయసు, విద్యార్హతలతో పాటు నేర చరిత్రను కూడా బహిర్గతం చేస్తారు.    అయినా సరే, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం వారు ఎన్నికలలో నిలబడడానికి,  గెలవడానికి అర్హులే.   ఒక సాధారణ గుమాస్తా ఉద్యోగం చేసే వ్యక్తీ 24 గంటల కన్నాఎక్కువ సమయం  ఖైదు చేయ బడితే అతన్ని ఉద్యోగంనుంచి తాత్కాలికంగా తొలగిస్తారు.     కానీ ఒక రాజకీయ నాయకుడు నేరం చేసి రెండు వేళ్ళు టెలివిషన్ ద్వారా (విజయ చిహ్నం) ప్రజలకు చూపిస్తూ నవ్వుకుంటూ జైలుకు వెళ్తాడు.   అతని సభ్యత్వానికి వచ్చిన ధోకా ఏమీ లేదు.    అలాంటి వ్యక్తీ మన దేశ  అధ్యక్షుడని కూడా ఎన్నుకోవచ్చు.   
 
 
 
ఇలాంటి వారిని ఎన్నికలలో నిలబడకుండా చెయ్యాలంటే ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు రావాలి.   మరి ఆ చట్టాలను సవరించేదెవరు?  అందులో ఈ క్రిమినల్ కేసుల్లో జైల్లో వున్న వాళ్ళు, కేసులు నమోదు కాబడి దర్జాగా తిరుగుతున్నా వాళ్ళు.     మరి అలాంటి సభ్యలు చట్ట సవరణ చేస్తారా??   చెయ్యరు - ప్రభుత్వాలు కూలి పోతాయి.   ఇలాంటి చట్ట సవరణ చెయ్యాలి అని ప్రతి పార్టీ గొంతు చించుకొని మైకుల ముందు అరుస్తుంది, టికెట్ల పంపకాని కొచ్చేప్పటికి కండ  బలం, అర్థబలం, గెలుపు సామర్ధ్యం మొ| | ప్రాతిపదికలుగా ఆ నేరగాళ్ళకే టిక్కట్లు పందేరం చేస్తాయి.   ఇలాంటి వాళ్లకి ఓటర్లే బుద్ధి చెప్పాలి  

1 కామెంట్‌ :

  1. నేరగాళ్ళు అన్ని పార్టీలు పెంచి పోషిస్తున్నాయి, చట్టాలు చేసేది వాళ్ళే. కనీసం 10ఏళ్ళు స్కూలుకెళ్ళిన వాళ్ళకు మాత్రమే ఓటుహక్కు వుండాలి.

    రిప్లయితొలగించండి