6, జనవరి 2013, ఆదివారం

విద్వేషాలను రెచ్చగొట్టే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటించాలి

అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఒవైసీ అసందర్భ ప్రేలాపన ఖండించడంతో మజ్లిస్ పార్టీ ఆత్మ రక్షణలో పడింది. ఇవ్వాళో, రేపో అక్బర్ గాడి లొంగు బాటు దిశగా అడుగులు పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి మూర్ఖులను కనీసం 10 సంవత్సరాలపాటు ఎలాంటి ఎన్నికలలో పాల్గొనకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు తేవాలి.


ఇది ఇలావుండగా మహారాష్ట్ర ఒవైసీ శ్రీమాన్ రాజ థాకరే ధిల్లీ మానభంగం కేసులో ముద్దాయిలపై వివాదాస్పద వ్యాఖలు చేసారు. ఆయన ప్రకారం వీరంతా బీహారు నుంచి ధిల్లీ వలస వచ్చారనీ వాక్రుచ్చారు. ఆయన ప్రకారం ఇలాంటి ఘాతుకాలు బిహారీలే చేస్తారని విషం కక్కాడు. ఒక పక్క స్త్రీలపై జరుగుతున్న వరస అత్యాచారాలతో దేశం అట్టుడికి పోతుంటే, ఇలాంటి ప్రాంతీయ దురభిమానులు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. మంచి, చెడు అనేవి ప్రాంతాలను బట్టి, రాష్ట్రాలను బట్టి ఉండవని ఈ మూర్ఖుడికి తెలియదు.


ఒకే న్యాయం ఒకే చట్టం ఒకే ప్రజా అని గొంతు చించుకునే భా జ పా వారు ఈ ప్రాంతీయ దురభిమాని వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


ఒవైసీ సోదరాలు మతం ముసుగున రాజకీయాలు చేస్తుంటే, థాకరెలు ఉత్తరాది వారిపై, ముంబై వలస వచ్చిన వారిపై విషం కక్కుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు కష్ట పడి పనిచేయడానికి సిద్ధపడనప్పుడు ఆ ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి కోసం వేరే ప్రాంతాల వాళ్ళు, వేరే రాష్ట్రాల వాళ్ళు వలస వెళ్ళడం సహజం. ముంబై కానీ అమెరికా కానీ ఈ విషయంలో రుజువైనదదే.


నా దృష్టిలో ఒవైసీ, థాకరే లిద్దరిదీ సమానమైన నేరమే! మతం పేరుతొ, కులం పేరుతొ ప్రాంతీయ దురభిమానంతో విద్వేషాలు రెచ్చగొట్టే ఎవరినైనా ఉపేక్షించ కూడదు. ఎన్నికలలో నిలబడే అర్హతను రద్దుచేయాలి. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణలు తేవాల్సిన సమయం ఆసన్నమైనది .

 

1 కామెంట్‌ :