7, జనవరి 2013, సోమవారం

పండంటి కాపురానికి రెండే రెండు సూత్రాలు

పండంటి కాపురానికి రెండే రెండు గొప్ప సూత్రాలు (మంగళ సూత్రాలు కావు) మోహన్ భగత్ గారు హైందవ స్త్రీలకు సెలవిచ్చారు. ఒకటి - భర్తను సుఖ పెట్టడం. రెండు - భర్త గారు ఆమెకు కావలసిన అవసరాలు తీర్చడం.
నిన్న ఇండోర్ సభలో బహిరంగంగా ఆర్ ఎస్ ఎస్ చీప్ మోహన్ భగత్ గారు దాంపత్యం యొక్క సూత్రాన్ని ప్రజలకు విపులీకరించారు. ఆయన గారి ప్రకారం భార్య అంటే భర్త మనసు తెలుసుకొని అతనికి కావలసిన రుచికరమైన శాక పాకాలు వండి పెడుతూ, భర్త గారి పాద పూజ చేస్తూ, పిల్లల్నికనీపెంచే యంత్రంగా వుండాలి అని ఈ ఆజన్మ బ్రహ్మచారి గారి భావన.
ఇలాంటి నియమ నిబంధలను ఉల్లంఘిస్తే, భర్త గారు భార్యని విడిచిపెట్టచ్చు అని కూడా ఆయన వాక్రుచ్చారు.
ఈ విషయంలో ఆర్ ఎస్ ఎస్ భక్తులైన భా జ పా వారు వాళ్ళ కుటుంబాలలో సత్వరం చర్చించి, భగత్ గారి గీతా బోధని తు.చ తప్పక పాటిస్తారని
మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.

3 కామెంట్‌లు :

  1. రెండవదానికి ఎవడూ మాట్లాడడు, ప్రతీ ఒక్కడికీ మొదటిదే దరిద్రం

    రిప్లయితొలగించండి
  2. Rendu kadu. Okkate sutram- okarinokaru samtruptiparachadam. Adi avida vandi vaddinchadam ayina, ayana avida avasaralu teerchadam ayina, parasparam gouravinchukovali. Ego vadileste 100% love annamata.

    రిప్లయితొలగించండి
  3. స్వర్న గారు, నమస్కారం, ఇవి నేను చెప్పినవి గాదు, ఒక బ్రహ్మచారి ఐన భగత్ గారు సెలవిచ్చినది.

    మనం ఈస్వరుణ్ణి అర్ధనారీశ్వరుడు రూపంలో కూడా కొలుస్తాము. మన పురణాలు, ఇతిహాసాలు చెప్పకనే చెప్పిన సత్యం భార్య భర్తలు చెరి సొగం అని. సమస్యల్లా ఈ భగత్ లాంటి లాగానాం పీకానం లాంతి వాళ్ళ వల్లె! ఆయన మార్గ నిర్దెసత్వం మనకు అవసరమా? మీ లాంటి వాళ్ళు తపాకుండా ఇలాంటి వ్యాఖ్యలపై తీవ్రంగా ప్రతిస్పందించాలి. మనం 21వ శతాబ్దంలో వున్నాం.

    రిప్లయితొలగించండి