అదేంటి గుజరాత్ లో భా జ పా గెలుపు అని రాయలేదు అంటారా! అది అంతే, మోడీ లేని గుజరాత్ ని ఊహించడం కష్టం. పేరుకి మాత్రమె కొన్ని జాతీయ పార్టీలు కాని రాష్ట్రాలలో కేవలం నాయకుల పేరులే పార్టీ పేరుకన్నా ఎక్కువ ఖ్యాతి తెస్తుంది ఉదాహరణకి - ఆంద్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్, కర్ణాటకలో యడ్యూరప్ప, గుజరాత్లో మోడీ, బెంగాల్ లో బసు ఈ కోవలోకే వస్తారు ఈ కారణంగానే, ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ ఆర్ మరణం తరువాత కాంగ్రెస్, బసు మరణం తరువాత కమునిస్టులు కోలుకోలేని దెబ్బ తిన్నారు. మోడీ స్థానంలో ఎవరు భా జ పా అభ్యర్ది ఐనా గుజరాత్ లో ఫలితాలు తారు మారుగా వుంటాయి. యడ్యూరప్ప లేని కర్నాటక భా జ పా పరిస్తితి అయోమయంలో
పడింది. ఆయన ఎలాంటివాడు అనే చర్చను పక్కనపెడితే, ఆయనలా పార్టీని
సమర్ధవంతంగా నడిపే నాయకుడు అక్కడ లేడు.
మన దురదృష్టం -
ప్రస్తుత మన రాజకీయాలలో సమర్ధుడైనవాడు నిజాయితీ కలవాడు కాదు, నిజాయతీ కలవాడు సమర్ధుడు కాడు. సమర్ధుడు మరియు నిజాయితీ
కలవాడు రాజకీయాలలోకి రావాలని ఆశిద్దాం.
చంద్ర బాబు నాయుడు సమర్ధుడు కాడని మీ ఉద్దేశామా? ఆయన దగ్గర విషన్ 2020 ఉంది సుమా!
రిప్లయితొలగించండిఅఙాత గారు,
రిప్లయితొలగించండిఅ) నేను పొల్చినవి రెండు జాతీయ పక్షాలుగా చెప్పుకొనే వారి గురించి.
బి) బాబు గారు ప్రస్తుతమున్న పరిస్తితులలో అత్యంత సమర్ధుడు. కానీ ఆయన కొన్ని చారిత్రాత్మక తప్పిదాలవల్ల వెనుకబడి పోయారు. అందులో మొదటిది క చ రా ని 10 సంవత్సరాల క్రిందట మంత్రిని చెయ్యకపోవడం. రెందవది వై ఎస్ ఆర్ ని ఎదురుకొవడానికి తె రా స తో కలవడం.