ఉస్మానియా యూనివర్సిటి లో కొందరు విద్యార్ధులు ఉపాధ్యాయుల్ని దండిన్చినట్లుగా వార్తలు వచ్చాయి. దండం దశగుణం భవేత్ అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయ్. డిగ్రీ చదువుకునే యువకుల లో సహజంగానే ఉడుకు రక్తం వుంటిది. ఆ ఉద్రేకాలని చల్లార్చి సక్రమమైన దారిలో పెట్టవలసిన బాధ్యత ఉపాధ్యులది. అలాంటి మహా మహోపాధ్యాలే చదువు చెప్పడం పక్కన పెట్టి పిల్లలను రెచ్చగొట్టే పనిలో (పిల్లలంటే ఆయన సొంత పిల్లలని బ్రమ పడేరు, నేను చెప్పేది ఊళ్ళో వాళ్ళ పిల్లగురించి - ఆయన పిల్లలు అమెరికాలో హాయిగా ఉన్నారు) నిమగ్నమై ఉన్నారు. కొందరు ఉపాధ్యాయులు పిల్లలని రెచ్చగొట్టి వాళ్ళు పోలీసులపై రాళ్ళు వేస్తుంటే రాళ్ళను అందించి (అదేదో తాజ్మాహాలు కట్టడానికి రాల్లందించిన కూలీల్లాగా) , సహకరిస్తే ఏమవుతుంది? ఇవే కాకుండా మన పరీక్షా పత్రాలు మన ప్రాంతం వాళ్ళే దిద్దాలి. అప్పుడే న్యాయం జరిగేది, మన ప్రాంతం ఉద్యోగులపైకి అవినీతి అధికారుల దాడి ఎక్కువైంది, అది ఆపాలి, ఇవండీ భావి భారత పౌరులకి మనమిచ్చే నినాదాలు.
విద్యార్ధులు, ఉపాధ్యాలు చక్కగా స్నేహితుల్లాగా అరె తురె అనుకుంటూ కలిసి మెలిసి ఉద్యమాల్లో అలయ్ భలయ్ చేసుకుంటూ విప్లవ గీతాలు పాడుకుంటూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఎంపీలు ఎం ఎల్ ఎ లు కలిసి ఉపన్యాసాలు ఇస్తుంటే ఊరుకున్న యూనివర్సిటి అధికారులు ఇప్పుడేమీ చెయ్యగలరు - చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా. మరి మన ఒస్మానియా విద్యార్ధులు - కుర్రాళ్ళు, ఉడుకు రక్తం సరదాగా పంతుళ్ళని ఒక మొట్టికాయ్ వేస్తారు దాన్ని కూడా తప్పంటే ఎలా ? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా (అమ్మయ్య టైటిల్కి కూడా న్యాయం జరిగింది).
/కుర్రాళ్ళు, ఉడుకు రక్తం సరదాగా పంతుళ్ళని ఒక మొట్టికాయ్ వేస్తారు దాన్ని కూడా తప్పంటే ఎలా ?/
రిప్లయితొలగించండి:) తప్పెలా అవుతుంది? తోలు తీసి డప్పు కొట్టినా తప్పులేదు.
కావాలంటే కేసులేసుకోమనండి, 3నెల్ల తరవాత ఎత్తేస్తాం.