21, నవంబర్ 2012, బుధవారం

మోటారు వాహన చట్ట సవరణలు అవసరం



మనకు స్వాతంత్రం సిద్ధించి 60 సంవత్సరాలు  దాటినా,  కొన్ని చట్టాలు ఇంకా బ్రిటిష్ వారు రూపొందించినవే అనుసరిస్తున్నాం.     ఉదాహరణకు - మోటార్ వెహికల్ ఆక్ట్ - రోజు  పాటశాలల్లో  పాఠాలు ప్రారంభించే ముందర మనం ఒక స్తోత్రం పఠిస్తాం.   భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు అని..   ఎక్కడండి ఆచరణలో ??  పంజాబ్ నుంచి బయలుదేరిన లారీ 3 అంతరాష్ట్ర చెక్కు పోస్టుల పోస్టుల దగ్గర మూడు చెరువల నీళ్ళు తాగి, 3000 లంచం ఇచ్చి వచ్చీ రానీ  భాషలో మాట్లా డాలి.    ఎందుకీ ఖర్మ?    ఈ దేశంలో నమోదైన  వాహనం ఏ  రాష్ట్రానికైనా స్వేచ్చగా వెళ్ళే హక్కు ఎందుకు లేదు.  ఇలాంటి చట్ట సవరణలు ఎవరు చేస్తారు?   మన పార్లమెంట్ సభ్యులు కాదా?     ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ప్రజే అని గొంతు చించుకునే భా జ పా వారు చెయ్యలేదు.    స్వాతంత్ర్యానంతరం ఎక్కువ రోజులు మనల్ని పరిపాలించిన కొంగ్రేస్స్ వారు చెయ్యలేదు. 

మన సొంత ద్విచక్ర వాహనం కాని కారు గాని ప్రక్క రాష్ట్రంలో దొంగల్లాగా వాడుకోవాలి.   మనం రోడ్ టాక్స్ చేల్లిన్చాము కదా అంటే, మీరు చెల్లించింది మీ రాష్ట్రంలో మా రాష్ట్రంలో కాదు.    పోనీ రిజిస్ట్రేషన్ మార్చుకున్దామా అంటే మళ్ళీ మనం ఇక్కడ పన్ను చెల్లించి, ఎక్కడైతే మొదలుగా రిజిస్ట్రేషన్ ఐనదో వారినుంచి మనమే డబ్బులు వాపసు తీసుకోవాలి.   ఇది జరిగే పనేనా.      పక్క రాష్ట్రం వాహనం ఎప్పుడు వస్తుందా వాణ్ని పట్టుకొని అదిరించి బెదిరింఛి  ఒందో రెండువందలో  లాగుదామని ట్రాఫిక్కు సైతం గాలికి వదిలేసి వాహనదారుల మీదికి అమాంతం దూకే బడుగు పోలీసులు.     ఏంటి ఇదంతా?      

చెక్ పోస్టుల దగ్గర వసూలు చేసే డబ్బులు నెలవారీ మామూళ్ళ రూపంలో సంభందిత మంత్రి గారి వరకు వెళ్తాయి  అనడంలో సందేహం లేదు.    అందుకే ఇలాంటి అర్ధం పర్ధం లేని చట్టాల్ని మార్చడానికి మన పార్లమెంటు సభ్యులకు పాపం  తీరిక లేదు.         అదే వారి జీత భత్యాల విషయంలో ఆఘ మేఘాల మీద సవరణలు చేస్తారు.       దీనికి చిన్న చట్ట సవరణ అవసరం వుంది.    అన్ని రాష్ట్రాలలో రోడ్డు పన్ను ఒకే విధంగా ఉండేలా చూడడం.    అలా రాష్ట్రాలో వసూలైన డబ్బు మొత్తం కేంద్ర ఖాతాలోకి జమ చేయబడాలి.      కేంద్రం దామాషా పద్ధతిలో ఆ పన్ను మొత్తాన్ని రాష్ట్రాలకు పంచాలి.      ఎవరైనా సొంత ఉపయోగం కోసం వాహనాన్ని పొరుగు రాష్ట్రాలకు తీసుకొని పొడలచుకుంటే కేవలం (NOC) నిరభ్యంతర పత్రం, అది కూడా అంతర్జాలంద్వారా, తీసుకొని దగ్గర వుంచుకోవాలి.     

కనీసం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలనాటికైన (2047) ఈ చట్టం అమలులోకి వస్తుందని ఆశిస్తూ.

3 కామెంట్‌లు :