20, నవంబర్ 2012, మంగళవారం

ముందస్తుగా కూస్తున్న జంపు జిలానీలు


ఒక బస్సు ఢిల్లీ నుంచి బయలుదేరింది.    కండక్టర్  బొచ్చ గారు -  ఓరయ్యో టికెట్టు తీసుకోండి, ఓలమ్మీ టికెట్ తీసుకోండి అంటూ శ్రీకాకుళం యాసలో  గావు కేకలు పెడతాన్నాడు.   టీవిలో సినిమాలు పాటలు చూడాల్సిన అవసరంలేదు.   మా చిరు  మా బస్సులోనే ప్రయాణం చేత్తన్నాడు గందా నేరుగానే  చూసేయ్యోచ్చు.    ఏటంటారు.   బేగ బస్సు ఎక్కండి.       ఇంతలో మోకాళ్ళు నొప్పితో బాధపడుతున్న వృద్ధులు బస్సు ఎక్కడానికి నానా తంటాలు పడుతున్నారు.    వాళ్ళంతా తొందరాగా బస్సెక్కి కనీసం 70 ఏళ్ల యువకుడిని  ఎన్నుకున్టాము, పెద్ద కమాండ్ ఏమి చెప్తే అది చేస్తాం, మాకు కొంచెము కూర్చోవడానికి సీట్లు ఇప్పించండని  వేడుకుంటున్నారు.     బొచ్చ  గారు వారందరినీ కూర్చోపెడుతున్నారు.    మూడు ప్రాంతాల వారు కలివిడిగా విడి విడిగా కూర్చుని కలిసుండి విడిపోవాలా లేక విడిపోయి కలిసుండాలా అని విచ్చల విడిగా  జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. 

                                              @@@

చిత్తూర్ నుంచి బయలుదేరిన బస్సు, చాల మరమ్మత్తుల తర్వాత కొత్త కొత్త సీట్లతో, పసుపు రంగుతో ఖాళీగా బయలుదేరింది.    డాబు  గారు టికెట్ బ్రదర్,  టికెట్ తమ్ముడు,   రావాలి మీరందరూ నన్ను హైదరాబాద్కు సురక్షితంగా చేర్పించాలి అంటూ e టికెట్   i pad  ద్వారా  sms చేస్తున్నాడు.          కులానికి ఒక రకంగా బడ్జెట్  కేటాయింపులు చేసాను.     మీరంతా ఈ విధంగా ముందుకి పోవాలి.      తమ్ముడూ  ముందుకు పోవాలంటే, మా బస్సు వదిలేసి వేరే బస్సుకి పొమ్మని కాదమ్మా.   ఎనకమాలకి పొండి, చాలా ఖాళీ ఉందమ్మా, నడిచి నడిచి కాళ్ళు బొబ్బలు ఎక్కినై.    కొంచం కూపెరాట్ చెయ్యాలి తమ్ముళ్ళు.   

మా దగ్గర సొంత టి వి, పత్రిక లేకపోయినా,   లావయ్య బాబు  వున్నాడు, మధ్య మధ్యలో తొడ  చరిచి మిమ్మల్ని వుద్రేకపరుస్తాడు.    ఇక సీతయ్య సంగతి చెప్పక్కర్లేదు, ఆయన నా మాటే కాదు, ఎవ్వరి మాటా వినడు.  జై హైటెక్ సిటీ, జై జై ధన్యభూమి.
                                                     ***

సూపెర్ ఫాస్ట్ బస్సు లాంటి కారు కరీంనగర్ నుంచి బయలుదేరింది.      బస్సు పేరు  నైజాం - ఉగాది/దీవాలి/దసరా/డిసెంబర్ 9999.    కండక్టర్ చేతిలో టికెట్లు, కొడుకు చేతిలో టికెట్ పైసల సంచి.       జరుగుర్రి జరుగుర్రి, పదండి ముందుకు తోస్కోని తోస్కోని.    జల్ది రావాలే తమ్మి.    జాగా అసలు లేదు.     నాన్ స్టాప్ మన కారు.    ఈడకెల్లి సురూ చేసినమంటే,  సీదా  మన ప్రాంతం నుండి బయల్దేరి మన ప్రాంతంలోని విధాన సభకి పోతది.     ఇగో కోదండం సప్పుడు చెయ్యకు, వయా గన్ పార్క్ పోదాంలే గాని .      ఫ్రీ పాసు తోని  స్టాఫ్ లెక్క ఎక్కుతావు ఏం  లొల్లి చేస్తావ్ బై.     ఇంతలో ఎవరో గట్టిగా అరవటం మొదలు బెట్టారు.     అన్నా 100 మంది ప్రయాణం చెయ్యాల్సిన బస్ల 150 మందిని ఎక్కిస్తివి, ఎం కథ?   అరె   నీకు మంచం కోళ్ళ  లెక్క తెల్వదర బై.       4 అని 3 చెప్పి 2 చూబెట్టి ....   పార్టీ నడుపుడంటే  మజాకార బై.    బొమ్మల పెట్టె, పేపర్, దఫ్తర్ ఇన్ని చూడాలే.     అరె   హర్ష, ఎందుకురబై వాణ్ని కొడుతున్నావు, ఊకో,   టీవీ గాళ్ళు పంచాయతీ పెడతారు.   తవికమ్మ నువ్వు బస్సులో  మంచిగా  ఆడుకో,  మన నైజాం హైదరాబాద్ల  టాంకు  బండుమీద తర్వాత ఆడుదం .   మన దగ్గర సైన్మా గాళ్ళు ఎవ్వలు లేరు.   ఇంతలో ఎవరో బిగ్గరగా "నారాయణ నారాయణ" అని అరిచాడు.    గా  రానాయన మూర్తి ఆక్టింగ్ ఏమో యాక్ తూ.    అన్ద్రోల్ల పెండ బిర్యాని లేక్కనుంటది.     నువ్వే పూలతో ఆడుకో తల్లీ అందర్నీ ఆడిపియ్, ఏడిపియ్!   అది కాదన్నా - మన ఎర్ర నారాయణ.    వూకోబై సప్పుడుచేయాకు, నేను లేనని చెప్పి పంపియ్. 
                                                       ###


అది ముడుపలపాయ బస్టాండ్.     జనం రద్దీ ఎక్కువైంది.   అన్ని బస్సులు హైదరాబాద్ లోని విధాన సభకు వెళ్ళడానికి సిద్ధంగా వున్నై.   

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వోల్వో బస్సు ముడుపులపాయ  బస్టాండు లోకి  వచ్చి ఆగింది.     ఒకటే జనం.   కొంతమంది సీట్లల్లో కర్చిఫ్లు వేస్తున్నారు.    కొంతమంది ఎమర్జెన్సీ ద్వారం గుండా  దూకుతున్నారు.  డ్రైవర్తో     బాగా చనువు వుండి  మేళ్ళు పొందిన వారు  అటునుంచి  తొందరగా బస్సు ఎక్కేడానికి ప్రయత్నిస్తున్నారు.   ఈ కండక్టర్ అందరు కండక్టర్ లాగా డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వట్ల.     టికెట్తో పాటు డబ్బులిచ్చి బుగ్గలు నిమిరి ఓదారుస్తున్నాడు.   కొంతమందికి పెరుగన్నం తినిపిస్తున్నాడు.    ఇంతలో  రాoబాంబు  ఎవరికో సైటు వెయ్యడం గమనించిన కండక్టరు, లాగి పెట్టి తన్ని టికెట్ చిన్చేశాడు.     ఇంతలో ఒక మూలనుంచి "అరిస్తే కరుస్తా, నా జోలికొస్తే  చరుస్తా" అని శబ్దాలు వినపడ్డాయ్.   కండక్టర్ గారికి అనుమానం వచ్చి,  చూడమ్మా కూజా నీ యాక్టింగ్ బాగున్నప్పటికీ, నీ టికెట్టే RAC లో వుంది, ఈయన ఎక్కడనుంచి వచ్చాడు.    ఆయన్ని కొంచం కిందకు దించి ఓదార్చు తల్లీ లేదంటే ఆయన కొడుకుల్ని బస్సేకించి నటనతో చంపితే నేను మళ్ళీ ఓదార్పు యాత్రకి బయలుదేరాలీ... పెరుగన్నం తినలేక, బుగ్గలు సాగదియ్యలేక చస్తున్నాను.   మనకు సినిమా వాళ్ళు అక్కరలేదు.   మన గ్రూప్ సాంగ్  పెద్దాయన ఓ  పెద్దాయన పాడులోకం పెద్దాయన అని  పాడుకుంటూ చేతులూపుకుంటూ వెళ్దాము.   సరిగ్గా అదే సమయానికి ఎవరో అభర్ది -   సార్  బస్సు ఓవర్ లోడ్ అయ్యింది బయల్దేరదామా అన్నాడు.   ఆగందయ్యా, మన ఒయాసిస్సు గాలూ  తమ్ముళ్ళను తీస్కోని ఇప్పుడే చార్మినార్ నుంచి బయలుదేరారూ .  దగ్గరుండి కర్ఫ్యూ పెట్టించి వస్తానన్నారు.   వారు హైదరాబాదు నుంచి వచ్చి మన బస్సు ఎక్కుతారు. 
                                                      $$$

అది ఒక  చిన్న గుడి.   కృష్ణా రెడ్డి గారు గుడికి  బూజులు దులిపి చింతపండుతో  రాముడి విగ్రాహాలని ధగ ధగ లాడే ట్లు చేస్తున్నాడు.      ఇంతలో  టెంకయ్య నాయుడు గారు వచ్చి,  కృష్ణా రెడ్డి  ఇఫ్  యు కంటిన్యూ విత్ రాం, వి  విల్ గో డాం  , ఆఫ్టర్ దట్ వి  మే హావ్  టు  అప్లై జండు బాం  అండ్  హావ్ టు టేక్ రెస్ట్ ఇన్  అక్షరధాం .     మన మూడు ముక్కలాట బయటికి తీసి లేటెస్టుగా   మూడు రాష్ట్రాల ఆటా   ఆడాలి అంటూ లుంగీ గట్టిగా బిగిచ్చాడు.    మిగిలిన రెండు ప్రాంతాల్లో మన బస్సులు తుస్సు మని ఖాళీగా తిరుగుతున్నాయ్.    ఇక్కడ కూడా పెద్ద జనం కనపడటంలేదు.   కొంచం గొడవలు సృస్టి న్చమ్మ కృష్ణా రెడ్డి.  కులం, మతం, ప్రాంతం, భాష, యాసా ఎన్ని విషయాలున్నాయ్.     ప్రొసీడ్.     
                                          %%%

అన్ని బస్స్తాండ్లు తిరనాళ్ళని తలపిస్తున్నాయ్.   కానీ, అందరి ద్రుష్టి కొత్తగా వచ్చిన వోల్వో మీదనే వుంది.  ప్రజలకు మాత్రం తెలుసు, అందరూ అందరేనని.    





కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి