2, జూన్ 2014, సోమవారం

తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు


భారత దేశ 29 వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు.   దేశంలో మొట్టమొదటి సారిగా ఒక ప్రాంతీయ భాష మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడినట్లైంది.   భౌగోళికంగా తెలుగు వారు రెండు రాష్ట్రాలలో వున్నా మనం మాట్లేడే భాష తెలుగు.   తెలంగాణా అంటేనే తెలుగు మాట్లాడే ప్రాంతం.   అచ్చ తెలుగు మాట్లాడే ప్రాంతం తెలంగాణా అని నేను నమ్ముతాను. 


ఈ శుభ సమయంలో ఒక ప్రాంతం వారు గెలిచారానో మరో ప్రాంతం వారు ఓడారనో భావించడం మూర్ఖత్వం.   రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజకీయ క్రీడ పరాకాష్టకు చేరింది.   ఈ క్రీడలో  కాంగ్రెస్ పార్టీ  పోషించిన పాత్ర తెలంగాణా లో స్థిరపడ్డ తీర సీమాన్ద్రులని కూడా కలిచివేసింది.   వారిలో ఎక్కువ మంది తెరాసకు ఓటేశారే కాని, కాంగ్రెస్  వైపు మొగ్గు చూపలేదు.   ఇది కూడా శుభ పరిణామమే.    


ఈ రోజు నుండైనా రెండు రాష్ట్రాలలోని తెలుగు వారందరు మరి ముఖ్యంగా నెటిజన్లు ఒకరినొకరు దూషించుకోకుండా  ప్రేమానురాగాలతో   అభివృద్ధి పధంలో పయనిద్దాం . 

2 కామెంట్‌లు :

  1. "ఈ రోజు నుండైనా రెండు రాష్ట్రాలలోని తెలుగు వారందరు మరి ముఖ్యంగా నెటిజన్లు ఒకరినొకరు దూషించుకోకుండా ప్రేమానురాగాలతో అభివృద్ధి పధంలో పయనిద్దాం."

    చక్కని మాట చెప్పారు!!

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ, దశాబ్దాల కల సాకారమయిన ఈ శుభ సందర్భాన అందరికీ శుభాకాంక్షలు. మహత్తర తెలంగాణా ఉద్యమ క్రమంలో ప్రజలు చూపిన చైతన్యం ఇకపై బంగారు తెలంగాణా నిర్మాణంలో చూపిస్తారని నా నమ్మకం, కోరిక.

    రిప్లయితొలగించండి