ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి మెల్లిగా ఒక్కొక్కరే తెదేపాలోకి చేరుకుంటున్నారు. కారణం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని. విభజించిన తీరును తప్ప పట్టవచ్చేమో గానీ, విభజనకు మొట్ట మొదటి నుండి ఒప్పుకున్న తెదేపా ఇప్పుడు అకస్మాత్తుగా సమైక్య పార్టీ ఎలా అయింది? అన్ని పార్టీలు రోజూ మైకుల ముందుకొచ్చి సమస్యను పరిష్కరించమన్నారు, కాంగ్రెస్ వారు వాళ్లకు తోచిన పరిష్కారం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులుచివరి నిమిషం దాకా మంత్రి పదవి వదులుకోవడానికి ఇష్ట పడకుండా, ఇంకా ఏదో అద్భుతం జరగబోతోందని భ్రమలు కల్పించారు. మరీ విచిత్రం ఎన్ టి ఆర్ గారి కూతురు భాజపాను సమైక్య పార్టీగా భావించడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని తెలిశాక జెండా, అజెండా మార్చేశారు. రేపు అధికారంలోకి వచ్చాక, బాబు గారు ఎంత చాణుక్యుడైనా, ఈ వలస పక్షుల దెబ్బకు భవిష్యత్లో విల విల్లాడాల్సిందే.
ఒక పక్క తెలంగాణా పునర్నిర్మాణం మరో పక్క ఆంధ్రాను సింగపూరుగా మార్చడం మా వల్లే సాధ్యమౌతుందని అన్ని పార్టీల వారు వక్కాణిస్తున్నారు. అంటే గత 60 సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని ఒప్పుకుంటున్నారు. 2019 ఎన్నికల నాటికి ఎన్నో మార్పులు జరగ వచ్చు. నిజంగా ఆంధ్ర ప్రదేశ్ సింగపూరు లాంటి ప్రగతిని సాధిస్తే, ఆ క్రెడిట్ రాష్ట్రాన్ని విభజించి మంచి పని చేసిన కాంగ్రెస్కు దక్కాలి. ఐదు సంవత్సరాల తరువాత జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావచ్చు అని అనిపిస్తే, పోలో మంటూ ఇదే నాయకులు బాబును తిట్టి మళ్ళీ కాంగ్రెస్ లోకో లేక ఇంకో నటుడు పెట్టబోయే పార్తీలోకో చేరడం ఖాయం. అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని.
కేవలం తమ స్వార్ధం కోసమే ఇతర పార్టీల్లో చేరుతున్నందుకు కాంగ్రెస్ ఆనందపడాలి .. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రక్షాళన అవుతున్నది.. వచ్చే ఎన్నికలనాటికి నిలదొక్కుకోవడం ఖాయం...
రిప్లయితొలగించండిగ్రహణాలు ఎప్పుడూ కొంత కాలమే ఉంటాయి!
రిప్లయితొలగించండికాంగ్రెస్ చెసిన అడ్డగోలు విభజన దానిని 100 సంవత్సరాలు పాతాళానికి తొక్కెసింది. ఇప్పట్లొ కోలుకోదు
రిప్లయితొలగించండిit is still alive :)
రిప్లయితొలగించండికానీ కాంగిరేసు వల్ల ఈ దేశానికి గ్రహణం ఎల్ల కాలం......స్కాములు...ఎన్.డి తివారీలు... అభిషెక్ మను సింగ్విలు...వారసులు...వాతలు....జీవితపు కోతలు అన్నీ ....
రిప్లయితొలగించండినేడూ ఇటలి ...రేపు ఏ స్పెయినో అర్జెంటీనానో.....గతం లోని ఆంగ్లేయులే నయం అనేలా సాగే కాంగీ పాలన లో బానిసలు మునిగి....తేలిపోతున్నారు(శవాలై!..అస్థిత్వం లేని భారత వోటర్లై!!).
లాగిన్ అవ్వలేక అగ్నాతనైపోయా! :(
Narsimha K