25, జనవరి 2014, శనివారం

తెలంగాణపై స్వరం మారుస్తున్న భాజపా!


అధికార పార్టీ పార్లమెంటులో రాష్ట్ర విభజనపై బిల్లు ఎప్పుడు పెట్టినా మేము బేషరతు మద్దతు ఇస్తాం అని ఊదరగొట్టిన భాజపా "అశ్వ్థ్థథ్థామ హతః కుంజరః " అన్న మహాభారత ఘట్టాన్ని గుర్తుచేస్తోంది.   బిల్లు పెట్టేప్పుడు సీమాన్ధ్రకు కూడా న్యాయం చెయ్యాలి.   భాజపా నాయు(కు)డు, తెదేపా నాయు(కు)డు - ఇద్దరు నాయుళ్ళు చెప్పేదీ దాదాపుగా ఇదే.   కానీ ఈ ఇద్దరు నాయుళ్ళు ఏమి చేస్తే సమంగా న్యాయం జరుగుతుందో చెప్పరు.   వాళ్ళని వచ్చే ఎన్నికలలో ప్రజలు అధికారంలోకి తెచ్చిన ఉత్తర క్షణం వాళ్ళ దగ్గరున్న పెట్టె లోనుండి సమన్యాయమనే పదార్ధాన్ని బయటకు తీసి అందరినీ సంతృప్తి పరుస్తారట.   లేదంటే పార్లమెంటులో సవరణలు ప్రతిపాదించి బిల్లును ఓడించడం ద్వారా సాధారణ ఎన్నికలకు నెల రోజులు ముందుగానే వెళ్ళడం.   

10 సంవత్సరాలు శీతల గిడ్డంగిలో దాచిన విభజనను ఎన్నికలలో కనీసం ఒక ప్రాంతపు ఓట్లనన్నా కొల్లగొట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటే, మరి భాజపా చూస్తూ ఊరుకోలేదు కదా!  సీమాన్ధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేసే హీరోలం మేమే, ఇరు ప్రాంతాల వారు మాకు సమంగా ఓటెయ్యండి అని భాజపా చెప్తోంది.     జులై 2013 నుండి రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వున్నా లేనట్లే.   ఒక వేళ భాజపా అధికారంలోకి వచ్చి బిల్లు పెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలుపుతుందనే నమ్మకం లేదు.   ఈ రెండు పార్టీలు కలిసి ప్రగతి పధంలో వున్న తెలుగు రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి.   ఈ సమస్యకు ఏదో రకమైన పరిష్కారం త్వరలో లభించాలని ఆశిద్దాం.  

5 కామెంట్‌లు :

  1. బీజేపీ తెలంగాణా బిల్లుకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీజీపీకి తెలంగాణలో కన్నా సీమంధ్రలోనే ఆదరణ ఉంది. ఇప్పుడిప్పుడే ప్రచార హడావిడిలో కూడా ఉంది.

    రిప్లయితొలగించండి
  2. భాజపా సమస్య తెలంగాణా క్రెడిట్ కాంగ్రెస్సుకు దక్కొద్దన్న తపన మాత్రమె. అంతే తప్ప వారేదో ఆఖరి నిమిషంలో తెలంగాణాను అడ్డుకుంటారని కలలు కనడం మానేస్తే మంచిది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొట్టిముక్కల గారు,

      నెల క్రితమే నేను రాసిన పొస్టులొ తెలంగానా ఆవిర్భావం ఆగదు, ఎవరూ ఆపలేరు అని వ్రాశాను. తెరాస బ్రతికున్నంత వరకు రెండు ప్రాంతాల మధ్య విద్వేషం చల్లారదు. ఆ పార్టీ వలన రాబొయే తెలంగాణాకు కూడా చెదు జరుగుతుంది. ఆ పార్టీ ఎప్పుడు శివైక్యం చెందుతుందా అని రాష్త్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

      తొలగించండి
    2. "రాష్త్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు"

      ఎ రాష్ట్ర ప్రజలు? తెలంగాణా ప్రజలకు తెరాసా ఏమవుతుందో పెద్ద పట్టింపు లేదు, తెలంగాణా బాగుంటుంది చాలు.

      తొలగించండి
  3. కాసేపు నిజం మాట్లాడుకుంటే... పార్లమెంటులొ ఏ బిల్లు విషయం లో నైనా భా జా పా ఏమైనా చేయ గలిగేది ఉందా? భాజాపాయేతర ఎంపీ లు అందరు ఇటలీ చెప్పులు నాకే వారే కదా ....! లాలు, డి ఎం కె, ఎస్.పీ అంతా ఒక్క తాటి పై వచ్చి తెలంగాణా బిల్లు ని ఎట్ కుదిరితే అటు తిప్పగలరు అలాంటప్పుడు భా జా పా ని ఎందుకు బద్నాం చేయడం?
    బానిసత్వానికి పరాకాష్ట మన కాంగిరేసు మనుషులు, తెలంగాణా కాంగిరేసు మాట అలగ్, సీమాంధ్రా కాంగిరేసు అలగ్ ఎవ్వరికి వారు వారి పార్టీని బతికించుకుందాం అనుకుంటే భాజాపా ఒక్కటే తెలంగాణాకు అనుకూలం అని చెప్పి సీమాంధ్రా లో కూడా ఒకే మాట చెప్పింది .... సొ ఇక్కడ కాంగిరేసు బానిసల టార్గెట్ ఒక్కటే భాజాపా కి వోట్లు పోవద్దు అని అందుకే శాయ శక్తులా ప్రయత్నించి భాజాపా ని ఈ గొడవలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు!.
    కాంగిరేసు చేసే వీభజనా రాజకీయాలు ఉన్నంత కాలం దేశం ముక్కలు అవుతూనే ఉంటుంది ఇది నేడు మొదలైంది కాదు కదా...... 1947 లో పాకిస్తాన్ ఏర్పాటు నుండి ఇదే తంతు....
    కాంగిరేసు బానిసల కి కాంగిరేసు మాత్రమే కనిపిస్తది! ....... భాజాపా కి బానిసలు లేక రాజకీయం లో నెగ్గుకొస్తలేదు అంతే!

    Narsimha K

    రిప్లయితొలగించండి