రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిపై సుబెదారీ (వరంగల్) న్యాయస్థానం కేసు నమోదు చేసి ఆయన్ని న్యాయస్థానం ఎదుట హాజారు పరచాలని రక్షకభటులని ఆదేశించింది. ఆయన ఇటీవల రాజమండ్రిలో చేసిన ప్రసంగంలో తెలంగాణా ప్రజలని రజాకార్లతో పోల్చారు అన్నది అభియోగం. ఇది శుభపరిణామం. ఆయన నిజంగా తెలంగాణా ప్రజలని రజాకార్లతో పోల్చారా లేదా అన్నది ప్రసంగ సి డిలు న్యాయస్థానం పరిశీలించి తీర్పు ఇస్తుంది . న్యాయస్థానాలు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసం చేసే రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొనే అవకాశం వుంది. ఇలా కేసులు నమోదు చెయ్యడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే, ఉండవల్లి గారి కేసులో ఆయన నిర్దోషిగా బయట పడతారని నాకు పూర్తీ విశ్వాసం వుంది. కాబట్టి ఎలాంటి భేషజాలు లేకుండా ఆయన తప్పకుండా న్యాయస్థానం ఎదుట హాజారు కావాలి.
19, ఫిబ్రవరి 2013, మంగళవారం
ఉండవల్లి గారూ - న్యాయస్థానంలో హాజరు కండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
రజాకార్లది తెలంగాణా ప్రాంతమే అన్నది కాదనలేని చారిత్రిక సత్యం, డౌటున్నవాళ్ళు పిల్లితల గొరిగే పని కల్పించుకున్నట్టే. ఉండవల్లికి శిక్షపడితే, బండబూతులు మాట్లాడిన కచరా తప్పించుకోగలడా? వుండవల్లికి శిక్ష పడాలనే కోరుకుందాము.
రిప్లయితొలగించండిI was in Rajahmundry at that time and attended the meeting. Undavalli garu didn't comment anything wrong on Telangana people. The complete video of that meeting is readily available on Youtube.
రిప్లయితొలగించండిIt is very unfortunate how some people can tarnish something to their own benefit. The actual comment was when KCR said “talalu tegipadataayi, naalukalu kosta” in one of his old speech (which Undavalli showed it on screen during the meeting), these words resemble that of Razak who killed so many people in Telangana area during Nizam rule. This is modified in such a way from TRS guys (and their supporters) that he scolded or tarnished the image of telangana people.
His actual point was if those leaders scold Andhrites like this, how can we agree for the division of the state? If they want a separate is it the correct attitude? We need to discuss and debate on this issue and solve the problem amicably. These are actual statements he made during the meeting. How many TV channels telecasted this? I saw one news on TV9 where they showed Harish Rao comments back to Undavalli’s statements in which they completely misrepresented the words of Undavalli on Polavaram! TV9 completely deleted the part on what he said on rehabilitation of the tribes and what TRS is doing against the construction of Polavaram!
తెరాసకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది తెలంగానా ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే, అదంతే ఎందుకంటే, తెలంగాన అంటె తెరాస, తెరాస అంటే తెలంగానా కాబట్టి. మీకేమైనా సందేహాలుంటే, స్థానిక ఎన్నికల వరకు ఓపిక పట్టండి అన్ని అపోహలు పటాపంచలౌతాయి.
తొలగించండి@above:
తొలగించండిhahaha.. OK Let's wait and see how many seats that uneducated KCR team can win in Telangana. Do you think TRS will win in Hyderabad?
నేను ఆ వీడియోని టివిలో చూశాను. "కెమెరామేన్ గంగతో రాంబాబు" సినిమా డైరెక్టర్‌లాగ ఉండవిల్లి కూడా తెలంగాణా ప్రజలు నిజాం బూజుని నమ్ముతారని చెప్పడానికి ప్రయత్నించాడు, "తెలంగాణావాళ్ళు నిజాం పాలన వల్ల వెనుకబడిపోయారు కానీ కోస్తా ఆంధ్ర వల్ల తాము వెనుకబడిపోయామని చెప్పుకుంటున్నారు" అని ఉండవిల్లి బహిరంగంగానే అన్నాడు. అతని వ్యాఖ్యలు నాకు బాగానే గుర్తున్నాయి.
రిప్లయితొలగించండిప్రవీణ్ గారు, మీరు ఓషో ని చదవాలని కోరుతున్నాను. అంటే ఆయన పుస్తకాలను కాకుండా, ఆయన వివిధ అంశాలపై ఏమన్నారో చదివితే మీకు క్లారిటీ మోతాదు పెరుగుతుందని నాకు విశ్వాసంగా ఉంది.
రిప్లయితొలగించండిగమనిక: ఆయన ప్రతి అంశం పైనా రెండు వైపులా మాట్లాడతారు, సత్యాన్ని చదువరులే తెలుసుకోమంటాడు.
హీ హె హీ
తొలగించండినయం ఆయన రెండువైపుల మాత్రమే మాట్లాడుతాడు, ఈయన ఎన్ని వైపుల మాట్లాడతాడో ఈయనకే తెలియదు.
కచడా గారు: మీరు తెలంగాణా మీదనే ఎక్కువ వ్రాస్తున్నారు, ఇది మంచిది కాదు. ఏదైన ఒక విషయమే ఎక్కువగా ఒక మనిషి పట్టించుకుంటే అనవసర మానసిక అశాంతులు ఏర్పడతాయి.. తామరాకు మీద నీటి బొట్టులా ఉండమని కోరుతున్నా.
రిప్లయితొలగించండిమీ సూచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అదే ప్రయత్నంలో వున్నాను. బహుశా ఒక నెల రోజులలో నా ప్రయత్నం ఒక రూపు దిద్దుకొనే అవకాశం వుంది.
తొలగించండిరీసెర్చ్, స్పెషలైజేషన్ ఒకే లేదా పరిమిత అంశాలపైనే చేస్తారు.
తొలగించండితామరాకు మీద నీటిబొట్టులా వుండటానికి, ఒకే అంశం మీద రాయడానికి తేడాలేవి? అసలు ఎందుకు తామరాకు మీద నీటిబొట్టులా వుండాలి? ఆ అవసరం ఎవరికి కావాలి?
అద్సరే, తమరు భయంకర్ అని గుర్తింపు పెట్టుకోవడానికి మానసిక అశాంతే కారణం అనుకుంటా. లేదా ఓషో బుక్కులు చదివాక ఇలా అయ్యారా? :-P
తొలగించండితామరాకు మీద నీటి బొట్టులా ఉండటమంటే, మన పైత్యాలు వివిధ అంశాలలో చొప్పించకుండా ఉండటమే అని నా కామెంటు అర్థం..
రిప్లయితొలగించండిఅయినా భయంకర్ అనే పేరు సూపర్ ఉందని నేను ఖుషీ అయితుంటే గట్ల అంటవేందన్నా...