దేశ అత్యున్నత న్యాయ స్థానం తీర్పు దరిమిలా, పంచాయతీలు, నగర పాలక సంస్థలకు జరగవలసిన ఎన్నికలకు మార్గం సుగమమైంది.
స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికలు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు రసాయన పరీక్ష లాంటిది. ఈ ఎన్నికల ఫలితాలు 2014లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సూచిక లాంటిది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాదిపదికపై జరుగుతాయి కనుక ఓటరు మనోగతాన్ని విశ్లేషించడానికి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం దొరుకుతుంది. ఈ ఫలితాల ఆధారంగా, రాబోయే సాధారణ ఎన్నికలలో పెట్టుకోవలసిన పొత్తులు,సర్దుబాట్లు మరియు దిద్దుబాట్లు చేసుకొనే అవకాశం వుంది.
ఇటీవల జరిగిని కేంద్ర సహకార బ్యాంకు మరియు మార్కెట్ సంఘాల ఎన్నికలకు, మే లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా వ్యత్యాసం వుంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ తెదేపా కన్నా తెరాస మరియు వైఎసార్ పార్టీల మనుగడను నిర్ణయించే అవకాశాలు మెండుగా వున్నాయి.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి