మన రాష్ట్రంలో ఈ మధ్య రాజకీయ నాయకులపై కేసులు, అరెస్టులు, జైలు జీవితాలు సర్వ సాధారణమైనాయి. ఈ మధ్య తె రా స అధినేత ఆధ్వర్యంలో జరిగిన బూతుల పంచాయతీలో పాల్గొన్న ప్రముఖ విద్యావేత్త ఆచార్య కో రా గారిపై కూడా వివిధ రక్షక భట నిలయాలలో కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదు చేసిన తర్వాత ఎవరూ వాటిని పెద్దగా పట్టిచ్చుకోరు. అక్బర్ ఒవైసీ గారి కేసు చూడండి, అప్పుడెప్పుడో కలెక్టర్ గారిని దుర్భాషలాడాడని కేసు నమోదు అయితే, 6 సంవత్సరాల తరువాత మొన్ననే కేసు తిరగతోడి సాంబారు అన్నం తినిపించారు.
మన శరీరంలో రక రకాల జబ్బులు ఉంటాయి. కానీ మన వయసు పెరిగే కొద్దీ రోగ నిరోధక శక్తి తగ్గిపోయి, ఒక్కసారి మనల్ని చుట్టుముడతాయి. ఇది కూడా అంతే, కేసులు ప్రస్తుతానికి దస్త్రాలలో దుమ్ము కొట్టుకొని పోవచ్చు.
కర్మ కాలి 2014 ఎన్నికలలో ఓడిపోతే అప్పుడొచ్చే ముఖ్యమంత్రి గట్టి వాడయితే, దూల తీరటం ఖాయం. ప్రస్తుతం "దమ్ముంటే నన్ను అరెస్టు చెయ్యండి" అని విర్రవీగే వాళ్ల భవిష్యత్ లో కష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం తను అతిగా విశ్వసిస్తున్న వ్యక్తులు, పార్టీలు రేపు వీపు చూపించే అవకాశం మెండుగా వుంది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి