22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రాష్ట్ర బందుకు భాజపా పిలుపు సమంజసమా?

 
నిన్న హైదరాబాదులో జరిగిన ఉగ్రవాదుల దాడి తీవ్రంగా ఖండించ తగినదెఐనా, భాజపా వారు బందుకు పిలిపునివ్వడం అర్ధరహితం. ఈ రోజు శుక్రవారం ఒక వర్గం వారు ప్రార్ధనా స్థలాల దగ్గర పెద్ద సంఖ్యలో గుమికూడే అవకాశం వుంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకొని అసాంఘిక శక్తులు పెచ్చరిల్లే ప్రమాదం వుంది. ఉగ్రవాదుల కోసం జరిగే తనిఖీలలో, వి ఐ పి ల తాకిడితో వరస బందులతో పోలీసులు తలమునకలై వున్నారు.    ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది.     
 
 
వీరు తలపెట్టిన బందు ద్వారా కలిగే సామాజిక  ప్రజా ప్రయోజనం ఏమీ లేకపోయినా సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదురుకోవలసి వస్తుంది. విపత్కర పరిస్థితులలో రాజకీయాలను పక్కన పెట్టి సమస్య తీవ్రతను తగ్గించడం ద్వారా జాతికి ఉపకారం చేసిన వాళ్లవుతారు.


10 కామెంట్‌లు :

  1. avunu miru cheppindi nijam vedhava raajakiyaalu maani janam pranaala kosam alochiste baavundi anni party lu

    రిప్లయితొలగించండి
  2. మళ్ళీ విషం కక్కాడు కచడా చక్రవర్తి, పని చెయ్యని రక్షణ వ్యవస్థ ఉంది దానికోసం రక్షణ కోసం పనిచేసే యువకులను తీర్చి దిద్దితే శత్రువులను దేశంలోనే పుట్టిస్తారు అంటారు.

    రిప్లయితొలగించండి
  3. గెల్లి గారు, నేను కక్కిన విషంలోని విషయం తెలిస్తే ఎలాంటి మొహమాటం లేకుండా సరిచేసుకుంటా. మీకు భాజపా మీద వల్లమాలిన అభిమానం వుంటే వుంచుకోండి. మీ అభిప్రాయం ఇతరులమీద రుద్దటం భావ్యం కదా?

    రిప్లయితొలగించండి
  4. సమస్య తీవ్రత అని తగ్గించాలా ? ఎందుకు , ?
    తగ్గిస్తే ఆ బాధితుల బాధలు తగ్గిపోతాయ ?
    పోయిన ప్రాణాల్ని తీసుకుని వస్తారా ?
    పెంచితే ప్రభుత్వానికి కనీసం ఒక నెల రోజులైనా గుర్తుంటుందేమో.
    ఎవరి అండ చూసుకుని హైదరాబాద్ లో టెర్రరిస్ట్ లు రెచ్చిపోతున్నారో తెలుసా ?
    ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ కి మాత్రమే ఈ గౌరవం ఎందుకు ఉగ్రవదులకి స్వర్గధామం అని .
    జైల్లో ఉన్న ఒక ఉగ్రవాది ని , సాక్షాత్తు ప్రభుత్వం లో ఉన్న మంత్రి మైనారిటి పేరు చెప్పి వెళ్లి కలిస్తే , అది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది మిగతా వాళ్ళకి. సాక్షాత్తు డిజిపి ఆఫీసు మీదకి దాడి చేసే అంత ధైర్యం ఏ గవర్నమెంట్ లో ఉండగా వచ్చింది వాళ్లకి.
    గవర్నమెంట్బి కి బిజెపి ఇచ్చిన మద్దతు మరి ఏ ఇతర పార్టి ఇచ్చి ఉండదు ఉగ్రవాదుల విషయం లో.
    ఎలా అయినా ఉగ్రవాదాన్ని తగ్గించమని , అందుకు మా మద్దతు ఉంటుందని గొంతెత్తి అరిచిన వినకుండా తిరిగి వోట్ల కోసం, హిందువులే ఉగ్రవాదులు అని కొత్త పల్లవి అందుకున్నారు .
    కఠినమైన చట్టాలని తీసుకురాదానికి ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందని చెప్పిన వినని ఈ మూగ చెవిటి ప్రభుత్వాన్ని వేనేకేసుకోస్తున్నారా ?
    ఇప్పుడే చదివాను ఎక్కడో ..
    ఒక ఉగ్రవాదిని ఉరి తీయడానికి పది సంవత్సరాలు పట్టింది .
    కాని తిరిగి వాళ్ళు దాడి చేయడానికి పది రోజుల కూడా పట్టలేదు.

    రిప్లయితొలగించండి
  5. తాకిడితో వరస బందులతో పోలీసులు తలమునకలై వున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో బాధ్యతాయుతమైన జాతీయ పార్టీగా ప్రభుత్వానికి వెన్ను దన్నుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

    మీరు గమనించాలి వారు చేస్తుంది సరిగ్గా అదే పని జనాన్ని తక్కువ తిరిగేలా జన సాంధ్రతను తగ్గించి బంధ్ పేరు తో సహకరిస్తున్నారు,పైగా మీరు అన్న సమూహాలు రెచ్చి పోతే రియాచ్ట్ కావడానికి ర్వరూ ఉండరు ఎందుకంటే బంధ్ అంటే హాయిగా టి.వి చూస్తూ గడిపేస్తారు....కానీ బయటికి వచ్చి టూరు వెయ్యరు,నిన్న దర్యాప్తు బృందాలని కూడా ఇబ్బంది పెడుతూ "షో"చూసిన ఉద్ధండులు ఈ రోజు బంధ్ కారణంగా రోడ్లెక్కరు సో తనిఖీలు తేలికగా జరుగుతాయి.....

    రిప్లయితొలగించండి
  6. నాదో సూటి ప్రశ్న దేశ విద్రోహ శక్తులు ఎక్కువ ఉన్న చోటనే ఇలాంటి చర్యలు జరుగుతాయి అనేది జగమెరిగిన సత్యం, మరి ఎందుకు మన రెండు పార్టీలు ఒకే విషయం లో విఫలం అయ్యాయి?

    దీన్ని బట్టి చెప్పొచ్చు మన 2 పార్టీలు ఎంత మలినం అయ్యాయో కనుక ర్రాష్ట్రం లో భాజాపా అధికారం లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.తర తరాలుగా దాస్యం లో మగ్గి నేటికీ కనీస రక్షణకి దిక్కు లేదు కానీ మళ్ళీ గెలిపించి మళ్ళీ పట్టం కట్టిస్తె ఈ 2 పార్టీలు చెసేదేమిటీ....65 యేళ్ళల్లో 14 యేళ్ళు మాత్రమె సైకిలు ...మిగతా 50 యేళ్ళు పలించిన కాంగీ చేసిందేమిటి?అధికారం లోకి వచ్చిన అన్ని సార్లూ మెజారిటీ కట్టబెట్టిన ఆంధ్రప్రదెశ్ ని నాశనం చేస్తున్న పార్టీని నమ్మడం ఎంతవరకు సమంజసం?

    రిప్లయితొలగించండి
  7. నరసిమ్హ గారు, ఉగ్రవాదానికి, కులం, మతం, ప్రాంతం పార్టీ, పాలకులెవరు అనె విషయాలతొ సంబంధం వుండదు. భాజపా కెంద్రంలొ అధికారంలో వుండగా కార్గిల్ లో చొరబాట్లు జరగలేదా! గత కొంత కాలంగా దేశం ప్రశాంతంగా వుంది. అలా వుండటం మన శత్రువులకు ఇబ్బందికరంగా వుంటుంది. అందుకే ఇలాంటి చర్యలకు మతం ముసుగులో యువకులను రెచ్చగొట్టి వాడుకుంటారు. ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నదో వాళ్ళ ప్రజల జీవన స్థితిగతులు మనకు తెలియనవి కాదుకదా! అలాంటి "రొగ్" దేశానికి అందనంత ఎత్తులో మనం వున్నాం. కొంచం సమ్యమనంతో వుండాలనే నేను చెప్పేది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దయ చేసి వాదన అనుకోవద్దు....పోటా చట్టం ఉన్నప్పుడు ఉగ్రవాద తనిఖీలు బాగా జరిగి కొంత మంది దొరికిన విషయం వాస్తవం!..అలాగే కొన్ని రోజులుగా దేశం ప్రశాంతంగా ఉంది అనేది పచ్చి అవాస్తవం 2007 హైదరాబాద్ ,2008 ...2009 ముంబాయి,మొన్న పునే మధ్యలో అస్సాము....ఇలా ఏ ఒక్క సంవత్సరం ఖాలీగా లేదు!ఇక సమ్యమనం అది తప్ప మరేదీ లేదు కనుకే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి ప్రస్తుతం నా అంచనా బట్టీ ఎవరూ సమ్యమనం కోల్పోరు ఎందు కంటే అన్ని పార్టీలకూ ఓట్లు కావాలి కనుక పాత బస్తీ అలజడులు జరగవు....

      తొలగించండి
    2. బిజెపి, కాంగ్రెస్ రెండూ దొందూ దొందే. బిజెపి వస్తే తెలంగాణ వస్తుందని నరసింహ గారు ఆశలు పెట్టుకున్నారేమో. బిజెపి బ్లాక్ అండ్ వయిట్లో శాంతిభద్రతల కారణాలతో ఇవ్వడం కుదరదు అని అదవానీ చెప్పింది మరిచారేమో.

      తొలగించండి
  8. నరసిమ్హ గారు, పొటా చట్టాన్ని మొట్టమొదట దుర్వినియోగం చేసింది ప్రస్తుతం భాజపోతో పూసుకు తిరుగుతున్న జయలలిత గారే కదండి. పోటా వుందని తెలిస్తే, పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ ఆగిపొతుందా! పోటా వలన తప్పుచేసినవాడు కేవలం బైలుకు అర్హత కోల్పోతాడు. తనని తాను పేల్చుకొని ఎడ్టివాళ్ళకు నష్టం కలిగించడానికి సిద్ధపడ్డవాళ్ళని ఏ చట్టం ఆపలేదు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహిస్తున్న మన దాయాదులను ప్రపంచ దేశాలతో కలిసి ఏకాకిని చెయ్యడం ద్వారా కొంత ఉపశమనం కలగవచ్చు.

    రిప్లయితొలగించండి