26, ఫిబ్రవరి 2013, మంగళవారం

చావు తప్పి కన్ను లొట్టబోయింది


క తా రా గారు హరీష్ గారు ఎం ఎల్ సి ఎన్నికలలో గంపగుత్తగా తెలంగాణలో 3 స్థానాలు గెలిపించడం  ద్వారా తమ పార్టీపై,   తెలంగాణా రాష్ట్రంపై  ప్రజలు ఆకాంక్ష  వ్యక్తం చేస్తారు.  తెరాసా అన్ని స్థానాలు గెలిస్తే తెలంగాణా విభజనకు అంగీకరిస్తారా  అని   విసిరిన సవాలు తీర సీమాంధ్ర నాయకులు  ఎవ్వరూ స్వీకరించ లేదు.     ఇప్పుడు చూడండి ఏమైందో - నల్గొండ, ఖమ్మం ప్రాంత పట్టభద్రులు  తెరాసా ని తిరస్కరించారు. 


వాస్తవానికి, లోగడ జరిగిన సహకార ఎన్నికలు గానీ, నిన్న వెలువడ్డ ఎం ఎల్ సి ఎన్నికలు గానీ, నేలబారు వోటరు మనోగతాన్ని ప్రస్ఫుటించలేవు.    మే నెలలో జరగబోయే  స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల ప్రాతిపదిక మీద జరిగితే వాటి వల్ల  వచ్చే ఫలితాలు,  తప్పక రాబోయే సాధారణ ఎన్నికలకు గీటురాయిగా  చెప్పవచ్చు. 


నిన్న వెలువడ్డ ఎం ఎల్ సి ఎన్నికల ఫలితాలు తెరాస నాయకత్వాన్ని, వారి కుటుంబానికున్న మితిమీరిన నమ్మకాన్ని మాత్రమె  వమ్ము చేశాయి.   
  


1 కామెంట్‌ :

  1. వరదారెడ్డి పై నల్గొండ అధ్యాపక జాక్ నాయకుడు రవీందర్ గెలవడం ఒక మంచి పరిమాణం. స్వామీ గౌడ్ వంటి కమిటెడ్ నాయకులకు సీట్లు ఇస్తే మంచిది కానీ తెరాస ఏమి చేసినా చెల్లుతుందని అనుకుంటే అది పొరబాటు.

    రిప్లయితొలగించండి