28, ఫిబ్రవరి 2013, గురువారం

హైదరాబాద్ ప్రత్యేకం పై తెదేపా సన్నాయి నొక్కులు


తెలంగాణలో వాతావరణం చల్లబడుతున్న కొద్దీ తెదేపా స్వరం మారుతున్నది.   కొద్ది రోజుల క్రితం సుదీర్ రాంభట్ల,  అంబేద్కర్ గారు చెప్పినట్లుగా హైదరాబాదును దేశ రెండవ  రాజధానిగా చెయ్యాలి అని శెలవిచ్చారు.    నిన్నటికి నిన్న నల్గొండకు చెందినా తెదేపా నేత మాజీ మంత్రి శ్రీ మోత్కుపల్లి నర్సింలు  గారు కూడా అదే మాట చెప్పారు. 



రాజమండ్రి నుంచి వచ్చిన కిరాయిదారుడికి హైదరాబాద్ మీద కేవలం "అద్దె హక్కులు" మాత్రమె వుంటాయి కానీ అసలు హక్కులు వుండవు అని ఒంటికాలి మీద లేచినవాళ్ళు ఎలా స్పందిస్తారో వేచి  చూడాలి. 


సమైక్య రాష్ట్ర పునాదులపై ఏర్పడ్డ పార్టీని ఓట్లకోసం విభజన వాదంవైపు మళ్ళించే ప్రక్రియలో తెదేపా అధినేత గత ఐదు సంవత్సరాలనుంచి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల ఫలితమే ఆ పార్టీకి ప్రజలలో విశ్వసనీయత లేకుండా పోవడానికి కారణం.    కొంత కాలం సమైక్యం, కొంతకాలం విభజన మరి కొంత కాలం ప్రత్యెక రాజధాని అని పొంతన లేని మాటలతో రెండు ప్రాంతాలలో తెదేపా నష్టపోవడం ఖాయం.         

7 కామెంట్‌లు :

  1. ఇదేమి కొత్త కాదండీ, శ్రీకృష్ణ కమిటీ పుల్ల పెట్టిననప్పటి నుంచి ఊహించిందే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పుడు ప్రచారాలు, అభూత కల్పనలను కాదని వాస్తవాలను లెక్కలతో సహా ప్రజలముందుంచడమే పుల్ల పెట్టడమే అయితే దాన్ని మెచ్చుకోవాలి. శుక్రాచర్యుడు బలి కమండలంలో దూరి అడ్డుపడితే, లోక కల్యాణార్థం వామనుడు పుల్ల పెట్టి పొడిచాడట. మీ ఆవేదన, ఆందోళన, దెబ్బతిన్న మనోభావాలు అర్థం చేసుకున్నాము. ఉప్పున ఎగసి, చప్పున చల్లారే దిక్కుమాలిన వుద్యమాలు చేయడం ఎందుకూ? మనోభావాలు దెబ్బతిన్నాయని విలపించడం ఎందుకు?

      తొలగించండి
  2. ఉత్తరాన ఢిల్లీలా, దక్షిణాన హైదరాబాద్ కావాలని ఆశించడంలో తప్పేముంది? మీరు కొంచెం అతిగా ఆలోచిస్తున్నారనిపిస్తోంది. అది హైదరాబాద్‌కో ప్రత్యేక గుర్తింపు తెచ్చే ప్రయత్నం అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. అజ్యాత గారు,

    నేను ఆసించవద్దు అని ఎక్కడా చెప్ప లేదు. సమైక్య ఆంధ్ర పునాదులమీద నిర్మించిన తెదేపా ఒక పెద్ద నిర్నయం నిర్భయంగా తీసుకోవడంలో కప్పదాటుగా వ్యవహరించింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి నానా తంటాలు పడుతోంది. అడుసు తొక్క నేల కాలు కడుగనేల.....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకరికి కప్పదాటు, మరొకరికి ద్రోహం. ఏ గోదాట్లో చావాలి వాళ్ళు? వచ్చేదా చచ్చేదా? నలుగురితో పాటు నారాయణ. వాళ్ళు అలా అనేంతవరకూ వాళ్ళని ఆడిపోసుకుంటూనే వుంటారు. వైకాపని ఏమన్నా ఆడిపోసుకున్నారా? లేదు. ఏదాటు లేకుండా తెలంగాణ అంటే ఆశ,దోశ,అప్పడం తిప్పడం కాదు అని వాయిలార్ అంటే తెరాస వాయి మూడినట్టు పడుందాలేదా?

      తొలగించండి
  4. అజ్యాత గారు, హైదరాబాదుతో కూడిన తెలంగాణా ఇస్తే అక్కడ స్థిర పడిన వేరే ప్రాంతం వాళ్ళకు కొంత ఇబ్బందులు తప్పవు. ఈ భయాందొనళకు కారణం కేవలం కొంతమంది తె రా స నాయకులు. తెలంగాణా రాకపోవడానికి కూడా వీళ్ళే పరోక్షంగా కారణం.

    తె దే పా, ధైర్యంగా సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపినట్లైతే తాత్కాలికంగా కొంత నష్టం జరిగేదే కాని దీర్ఘ కాలిక ప్రయొజనం ఉండేది. వైకాపా లేదా తెదేపా మద్దతు లేకుండా కెంద్రంలో ఎవ్వరూ అధికారంలోకి రాలేరు. వీరి మద్దతు ఎవరు తీసుకున్నా తెలంగాణా ఇవ్వలేరు, చివరకు భాజపా కూడా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. >>వైకాపా లేదా తెదేపా మద్దతు లేకుండా కెంద్రంలో ఎవ్వరూ అధికారంలోకి రాలేరు.

      Congress or BJP will fall on any donkey's feet, if they are short of majority or can buy those for a price or with an assurance to shelf CBI cases.

      TDP's move put the Congress-TRS in a fix. Now ball is in Congress's court. Congress will suffer a lot if they split the state. Congress-TRS tried to eliminate TDP from the state.

      తొలగించండి