జగన్ కొంప కొల్లేరు కావడానికి ముఖ్య కారకులు ఇద్దరు - మాజీ మంత్రి శ్రీ శంకర్ రావు మరియు రవీంద్రా రెడ్డి. ఇద్దరు వైద్య శాస్త్రంలో పట్టభద్రులే. శంకర రావు గారు కోర్టుకి లేఖ రాస్తే, రెడ్డి గారు ఇమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం వివరాలు బహిరంగ పరచారు. ప్రస్తుతం ఇద్దరులో ఒకరిని ముఖ్యమంత్రి గారు మాజీని చేసేశారు. రెడ్డి గారిని కూడా అదును చూసి మాజీని చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
రెడ్డిగారు ఒంటరిగా కడపలో వుండి జగన్ను ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఎంచక్కా మైసూరా గారు, రవీందర్ గారు కలిస్తే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ముఖ్యమంత్రిని కడపలో దీటుగా ఎదురుకొవచ్చు. శ్రీ రవీందర్ రెడ్డి గారు కూడా త్వరలో జగన్ "చంచల్" గూడాలో కలుస్తారని ఆశిస్తున్నాను.
అందుకే అంటారు రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం/శత్రుత్వం ఉండదని. మరి శంకర్ రావు గారు ఏం చేస్తారో త్వరలో తేలుతుంది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి