24, జనవరి 2013, గురువారం

సమస్య "ఒక నెలలో" పరిష్కరిస్తాం

మన గృహ శాఖ మంత్రి గారు "ఒక నెలలో తెలంగాణాకు పరిష్కారం చూపిస్తాం" అని చెప్పారు. జనవరి నెల అని మనం అర్ధం చేసుకున్నాం.   కానీ ఆయన ప్రకారం డిసెంబరు మంచి నెల. తెలంగాణా ప్రక్రియ ప్రారంభం అయినది డిసెంబరులో, రద్దు చేసింది డిసెంబరులో, అఖిల పక్షం జరిగింది డిసెంబరులో, హరీష్ రావు అగ్గిపెట్ట కోసం వెదికింది డిసెంబర్ లో, బాబ్రీ కూల్చింది డిసెంబరులో, క్రిస్టమస్ డిసెంబరులో, కృష్ణ కమిటీ ఏర్పడింది డిసెంబరులో, బస్సులు, కేబుళ్ళు తగలబెట్టింది డిసెంబరులో, నిరాహార దీక్షలు జరిగిన పవిత్ర మాసం డిసెంబరు.
ఇన్ని ప్రత్యేకతలున్న డిసెంబరును కాదనే హక్కు తెలుగు ప్రజలకూ లేదు, మరాఠీ మానుస్ షిండే గారికీ లేదు. కాబట్టి డిసెంబరు వరకు వేచి ఉందాం. ఈ లోగా ఇరు పక్షాల రాజకీయ నాయకులు కొట్టుకుంటారు, మనం లైవ్ లో చూద్దాం.

1 కామెంట్‌ :

  1. కేశవరావు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధం. జానారెడ్డి, పొన్నం, యాష్కీలు ముఖ్యమంత్రిగా త్యాగాలు చేయడానికి సిద్ధం. ప్రస్తుత తెలంగాణా కాశిం రజ్వీలు ఆత్మహత్య చేసుకుంటేగాని తెలంగాణ రాదు.

    రిప్లయితొలగించండి