19, డిసెంబర్ 2012, బుధవారం

ఓటు బదిలీ పధకాలు

 
ఒకప్పుడు తమిళనాడులో ఎం జి ఆర్ మొదలు పెట్టిన రూపాయికి కిలో బియ్యం పధకం, తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు రకరకాల రూపాంతరాలు చెంది పేద వాడిని సోమరిపోతుగా, తెలివి తేటలని వుపయోగిన్చుకోనివ్వకుండా తయారు చేస్తున్నై. ఎందుకంటే సగటు మనిషి తెలివి తేటలు పెరిగితే, వాళ్లకి , రాజకీయ నాయకుల నిజ స్వరూపం తెలుస్తుంది కనుక. తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ పధకానికి కొనసాగింపుగా, నెల వారి సరుకులతో పాటు, టి వి, కేబుల్ కనేక్షున్ కూడా కల్పించింది. అంటే, ఓ మనిషీ, నువ్వు ఆలోచించడం కష్ట పడడం మానేయ్. మేము ఇచ్చే పప్పు, ఉప్పు, సాంబారు పొడి, బియ్యం తింటూ, టి వి లో 24 గంటలు వార్తలు, సినిమాలు, కుళ్ళు జోకులు చూస్తూ మేం కట్టిచ్చిన 50 గజాల స్థలంలో వుంటూ మేము చెప్పినప్ప్డు చెప్పిన గుర్తుకు ఓటెయ్యి అని అర్ధం.అంతేగానీ,పేదవాడిని చైతన్య పరచే వాళ్లకు ఏమిచేస్తే భవిష్యత్లో ఒకరిపై ఆధారపడకుండా జీవిస్తారు అని ఆలోచించే వారు రాజకీయాల్లో లేరు. ఉదాహరణకి వరి ధాన్యం పండించాలంటే భూమి కావాలి, పనిముట్లు కావాలి, ఎరువులు కావాలి, గిడ్డంగులు కావలి, సరిఐన కిట్టుబాటు ధర కావాలి. ఒక పార్టీ నాయకుడు నేను వడ్లు కిలో రూపాయికి ఇస్తానంటాడు, ఇంకొక పార్టీ వాడు వాటిని మిల్లు ఆడించి అదే ధరకి బియ్యం ఇస్తానంటాడు. ఇంకొకాయన, ఇంకొక అడుగు ముందుకేసి నేనే వండి పెట్టి మిమ్మల్ని ఓదారుస్తూ గోరుముద్దలు తినిపిస్తా అంటాడు ఇవన్నీ గమనించిన కాంగ్రెస్ వాళ్ళు, మీ అకౌంట్ నంబరు ఇవ్వండి మీకు డబ్బులు పంపిస్తాము. బియ్యం ఇస్తే మీరు అన్నం మాత్రం మాత్రమె తినచ్చు కాని డబ్బులిస్తే ఎంచక్కా దానితోబాటు మందు కూడా కొనుక్కోవచ్చు అని కొత్త ఓట్ల బదిలీ పధకం ప్రవేశ పెట్టింది. ఈ మధ్యనే క చ రా గారు మాట్లాడుతూ, మనది మనకు వచ్చినతరువాత 400 గజాల స్థాలమిస్తా ఫాం హౌసు లాంటి ఇల్లు కట్టుకొని గులాబి పూల మొక్కలు  కూడా పెట్టుకోండి అని సెలవిచ్చారు.
 

పేద వాడు కష్ట పడి పనిచేయడానికి సిద్ధంగా వున్నాడు. వాళ్లకు కావలసింది గౌరవ ప్రదమైన జీవితం, ఒకళ్ళ మీద ఆధార పడటం కాదు. భూమి ఇవ్వండి, నీరు ఇవ్వండి, సరైన కిట్టుబాటు ధర ఇవ్వండి చాలు, మీరిచ్చే ముష్టి వాళ్లకు అవసరం లేదు. వాళ్ళ పిల్లలకు ఉన్నతమైన విద్య, చక్కటి వసతి, సుచికరమైన భోజనం ఇవ్వండి చాలు. కాకపొతే, వాళ్ళు విద్యావంతులైతే మీకు మాత్రం ఓట్లు వెయ్యరు, వాళ్ళే పాలకులు అవుతారు, దానికి మీరు సిద్ధమేనా?

5 కామెంట్‌లు :

  1. /మీరిచ్చే ముష్టి వాళ్లకు అవసరం లేదు. వాళ్ళ పిల్లలకు ఉన్నతమైన విద్య, చక్కటి వసతి, సుచికరమైన భోజనం ఇవ్వండి చాలు/
    ముష్టి వద్దంటూనే వాళ్ళ పిల్లలకు భోజనాలు, మందు, లాడ్జీలు ఇమ్మంటున్నారు!!!

    రిప్లయితొలగించండి
  2. "Please prove you're not a robot "

    To whomsoever it may concern

    I am not a robot as on today.

    Sd/-

    రిప్లయితొలగించండి
  3. SNKR గారు,

    పిల్లలకు పెద్దలకు ఇద్దరికి ఇవ్వద్దని నా ఉద్దేశం. పిల్లలకు మాత్రమే సౌకర్యాలు ఇచ్చి విలువలతో కూడిన మంచి చదువు చెప్పిస్తే, పరిస్తితి ఓ యు లో లాగా వుండదన్న సదుద్దేశం మాత్రమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరన్నది నిజమే.
      తేరగా వస్తుంటే ఎందుకు కష్టపడాలి? అనే ప్రశ్న పిల్లల్లో తేలిగ్గా నాటుకు పోతుంది.
      ఫ్రీగా చికెన్ బిరియానీలు, కావాల్సినంత(ఎన్నేళ్ళైనా గబ్బిలాల్లా యూనివర్సిటీ గది కప్పులకు వేలాడే సౌకర్యాలు) చదువు కలిపిస్తే వుస్మానియా అంకుల్స్ ఎందుకు తయారవ్వరూ?

      అపాత్ర దానం కూడదు అని చాణిక్యుడు చెప్పాడంటారు.
      ---
      మనలో మాట, వర్డ్ వెరిఫికేషన్ మీకు అంత అవసరమనిపించిందా? రోబోట్లు కామెంట్లు పెడుతున్నారనే అనుమానం మీకు ఎప్పుడొచ్చింది? రోబోట్లు వర్డ్ వెరిఫై వేయలేవనడానికి ఆధారాలున్నాయా? అసిమో అనే రోబోట్ డాన్స్ చేసినట్టు, మనుషులనే గుర్తించినట్టు, సంభాషించినట్టు యుట్యూబ్లో చూశాను. తెలుగు బ్లాగుల్లో కామెంట్లు పెట్టినట్టు చెప్పబడలేదు. :P

      తొలగించండి
  4. snkr gaaru, sorry, i have not initiated any such provision for word verification?? let me see and correct it.

    రిప్లయితొలగించండి