డిసెంబర్ వస్తుందంటేనే భయం వేస్తుంది. చలి పులి భయపెడుందని కాదండి. అంత తీవ్రమైన చలిలో కూడా వేడి వేడి పకోడీ లాంటి విషయాలు ఉంటాయ్. ప్రతి సంవత్సరం ఐతే, డిసెంబర్ 6న మసీదును కూలగొట్టారాని ఒక వర్గం వాళ్ళు అక్రోసిస్తే ఇంకొక వర్గం వాళ్ళు మేము పడగొట్టామని పండుగ చేసుకుంటారు. ఇలాంటి ప్రోటీన్ (అదేనండి రొటీన్) విషయాలతోపాటు, డిసెంబర్ 9 2009న చిదంబరం గారు లుంగీ కట్టుకొని మరీ అర్ధరాత్రి ప్రకటించిన స్వాతంత్రం. దాన్ని తూచ్ అంటూ ఇంటూ కొట్టి మళ్ళీ లుంగీ కట్టుకొనే డిసెంబర్ 23 పగలు పూట చేసిన ప్రకటన. డిసెంబర్ 9ని రాష్ట్రంలోని కొంతమంది విజయ దివాస్గా జరుపుకుంటే మరి కొంతమంది డిసెంబర్ 23ను విజయోత్సవాల పేరిట పండుగ చేసుకుంటారు. దీనికి తోడూ ఇటీవల తెలంగాణా కాంగ్రెస్ (4గురు) పార్లమెంట్ సభ్యులు పెట్టిన చివరాఖరి గీత (అదేనండి డెడ్ లైన్) కూడా డిసెంబర్ తొమ్మిదే . ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికి తలకు ఒక్కింటికి షుమారుగా రూ 1.50 ఖర్చు పెట్టి డిసెంబర్ 27-29 తారీఖులలో తిరుపతిలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు ఏ మేరకు విజయవంతం అవుతాయోనన్న భయం సర్కారును పట్టి పీడిస్తోంది.
ఇవి చాలవన్నట్లు మన పొరుగు రాష్ట్రంలో డిసెంబర్ 8న యడురప్ప గారి క జ పా (కర్ణాటక జనత పార్టీ) ఆవిర్భావం కాబోతోంది. డిసెంబర్ 9వ తారీఖు నుండి కర్ణాటక విధాన సభ సమావేశాలు జరగబోతున్నాయ్. ఈ సమావేశాలు జరుగుతాయా లేదా అసెంబ్లీ రద్దు అవుతుందా అనేది యడురప్ప గారి మీద ఆధార పడివుంటుంది. మరి ఇది కూడా కమలనాధులకు పెద్ద విషయమే కదా??
టి వి చానళ్ళకు, పత్రికలకు మాత్రం పండగే, పండగ.
ఇంకోటి మర్చిపోయారు. డిసెంబర్ 21 2012. యుగాంతం అనే పెద్ద జోకు
రిప్లయితొలగించండిబాగు బ్లాగు మీ వ్యాఖ్యానం. నెనర్లు.
తొలగించండి28 డిసెంబర్ అకిలపచ్చమే డిసైడ్ చేసే యుగాంతమే తెగ టెన్షన్ పెట్టోస్తోంది. :)
రిప్లయితొలగించండి