23, జూన్ 2014, సోమవారం

మోటార్ వాహనాన్ని అమ్మేపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం మా కంపెనీ సలహా మీద కొన్ని మోటార్ బైకులు షోరూం వాళ్లకి ఇచ్చి కొత్త వాహనాలు తీసుకున్నాము.   ప్రతి షోరూంకు అనుబంధంగా కొంత మంది ఏజెంట్స్ వుంటారు.  మన పాత వాహనం వాళ్ళు తీసుకొని షో రూం వాడికి డబ్బు ఇస్తారు.    షోరూం వాడు మన దగ్గర ధరలో వ్యత్యాసాన్ని తీసుకొని మనకు కొత్త వాహనం ఇస్తాడు.     ఈ మొత్తం వ్యవహారం మనకి కొత్త వాహనం వచ్చిన సరదాలో మర్చిపోతాం.   

ఇటీవలే మా ఆఫీసుకు కోర్టు నుండి 'సమన్స్' వచ్చాయి.    దాని సారాంశం -- మీ పేరిట వున్న వాహనం ఒక రోడ్డు ప్రమాదంలో వుందని, ఎవరికైతే మీ వాహనం వలన గాయాలు తగిలాయో వారు మీ మీద మూడు లక్షలకు నష్ట పరిహారం వేసారని --  పాత కాయితాలు తిరగేస్తే, తెలిసినది ఏమిటంటే, మా పాత వాహనం కొనుగోలు చేసినవాడు దానిని తన పేరిట మార్చుకోలేదు.    వాహన బీమా కూడా మా కంపెనీ పేరిట వాడే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు.   షోరూము వాడు మా దగ్గర నుండి 10,000 నగదు (పాత వాహనం విలువ) గాను మిగిలినది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలోనూ ముట్టినట్లు కొత్త బండి తాలూకు బిల్లులలో చూపించాడు.      బండి కొనుగోలుదారుడు చేసిన తప్పులకు మేము న్యాయస్థానం చుట్టూ తిరగ వలసి వస్తున్నది.     

అందుకనే, ఏదైనా వాహనం అమ్మినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా న్యాయవాదిని సలహా అడిగితే, ఆయన చెప్పిన అంశాలు -- 

-- కొనుగోలు చేసిన వ్యక్తీ నుండి రశీదు తీసుకోవడం (Delivery నోట్) మరవద్దు
-- వాహనం అమ్మిన మరుసటి రోజే, సంబంధిత బీమా సంస్థకు మరియు ఎక్కడైతే వాహనం మొదట  నమోదు
    అయ్యిందో ఆ యొక్క R.T.A కార్యాలయానికి ఈ transaction తాలూకు వివరాలు డెలివరీ నోటు నకలుతో
    రిజిస్టర్డ్ పోస్టు చేసి దాని రశీదును భద్రపరచుకోవడం మంచిది.
-- వాహనం కొనుగోలు చేసిన వారి నుంచి వారి లైసెన్స్ కాపీ ఉంచుకోవడం మంచిది.
-- వాహనం అమ్మిన నెల తరువాత  R.T.A వారి వెబ్ సైట్ లో వాహనం సంఖ్యతో దాని ఓనర్ పేరు తెలుసుకోవచ్చు
     దానిలో ఇంకా మీ పేరే వుంటే మీరు తక్షణం మేల్కొని R.T.A ను సంప్రదించండి

పైన తెల్పిన వివరాలు  చదవడానికి చాలా చిన్నవిగా వుంటాయి.  అనుభవించే వాడికి అసలు విషయం తెలుస్తుంది. బైకుకు ఏక్సిడెంట్ అయింది కాబట్టి ఏదో రకంగా రాజీకి వచ్చి డబ్బులిచ్చి వదిలించుకోవచ్చు.    అదే బైకు అసాంఘీక శక్తుల చేతులో పడితే అంతే సంగతులు.  


1 కామెంట్‌ :

  1. వాహనం అమ్మిన నెల తరువాత R.T.A వారి వెబ్ సైట్ లో వాహనం సంఖ్యతో దాని ఓనర్ పేరు తెలుసుకోవచ్చు
    ---------------------------------------------------------------------------------------------------
    నేను సంవత్సరం క్రితము పాత వాహనన్ని కొన్నాను...
    వెంటనే నా పేరు తొ నమొదు (రిజిస్టర్ ) చెయించాను ...
    ఇప్పటికి R.T.A వారి వెబ్సైట్ లొ ఇంకా నాపేరు నామొదు కాలేదు ....ఇప్పటికి పాత యజమాని పేరు వుంది .... :-(

    ఎందుకు చెబుతున్నాను అంటే ఈ వెబ్సైట్ ని నమ్మలేము ...

    రిప్లయితొలగించండి