21, జూన్ 2014, శనివారం

హిందీ జాతీయ భాష కాదు

ఏదో ఒక సంచలన ప్రకటన చేసి అసలు విషయాలను పక్క దారి పట్టించడం పాలకులకు పరిపాటైంది.   రైల్వే చార్జీలు పెంచిన ప్రకటన వెలువడిన రోజే దేశంపై హిందీ భాష దాడి వార్తను కూడా వెలువరిస్తారు.   కరుణానిధి లాంటి వాళ్ళు రైల్వే చార్జీల పెంపు పక్కన పెట్టి హిందీ గురించి మాట్లాడతారు.   

హిందీ మన జాతీయ భాష కాదు అని ఇటీవలే గుజరాత్ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది.  సురేష్ కచ్చాడియా వేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం, దేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న భాషగా హిందీ వుందని, దానిని జాతీయ భాషగా రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొన లేదని తీర్పు ఇచ్చింది.  

అధికార భాషా చట్టం 1963 ప్రకారం పార్లమెంటు కార్య కలాపాలు హిందీలో మరియు ఆంగ్లంలో జరపవచ్చని పేర్కొంది.   పార్లమెంటు చేసే ప్రతి చట్టం హిందీ లోను  ఆంగ్లంలోను అందుబాటులో ఉండేలా నిర్దేశించింది.  

దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ.  అందులో సందేహం లేదు.   దానిని బలవంతంగా మరింత ప్రోత్సహించాల్సిన అవసరం మాత్రం లేదు.   ఉత్తరాది వారికి ఇప్పటికీ దక్షిణాది వారంటే చులకన.  దక్షిణాది వారి భాష, వేషం, ఆచార  వ్యవహారాలను వారు ఈసదించుకుంటారు.   

ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న సమస్యల ముందు హిందీ భాష బలవంతంగా రుద్దడం అనేది ప్రాముఖ్యత లేని విషయం.   దేశం మొత్తం త్రిభాషా సూత్రాన్ని అమలు చేసి, ఎవరు ఏ భాషలో చడువుకోవాలి అనేది వారి వారి స్వంత నిర్ణయంగా వదిలి వెయ్యాలి.    కర్ణాటక రాష్ట్రంలో ప్రాధమిక, మాధ్యమిక విద్యనూ కన్నడ మాధ్యమంలో చదివిన విద్యార్ధులకు వైద్య మరియు తాంత్రిక విద్యలో 5 శాతం రిజర్వేషన్ వుంది.   కన్నడ మాధ్యమం విద్యార్ధులు గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలో చదివితే రిజర్వేషన్ మరింత ఎక్కువ.   వాళ్ళ భాషను ప్రోత్సహించే విధానం యిది. 

ఉద్యోగం కోసం ఆంగ్లం, దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి హిందీ ఆత్మ సంతృప్తికి అమ్మ భాష అవసరం. 

2 కామెంట్‌లు :

  1. జాతీయ భాష, రాష్ట్ర భాష అనే మాటలు అర్ధం లేనివి. అధికార భాష అనే ఒక్కటే సరి అయిన పదం. దానికి కూడా చాలా పరిమతమయిన ప్రాధాన్యత ఉంది. ఒక ప్రాంతంలో అధికార భాషగా గుర్తింపు ఉన్న భాషలో రాసిన ఉత్తరాలను అధికారులు తప్పక స్వీకరించాలాన్న హక్కు మాత్రమె ఉంది. An official language has only one right i.e. a communication in that language can't be refused by a Government official.

    ఉ. ఆంద్ర రాష్ట్రంలో ఆరు & తెలంగాణాలో ఏడు జిల్లాలలో ఉర్దూ అధికార భాష హోదా కలిగి ఉంది. తెలుగు రెండు రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో అధికారిక హోదా కలిగి ఉంది. అయితే ఉర్దూ గుర్తించిబడిన పదమూడు జిల్లాలలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పజాలము. The fact that Telugu is official in other districts where Urdu is not does not confer it any special status.

    రిప్లయితొలగించండి
  2. అందరి మాతృభాషని గౌరవించటం ప్రజాసామ్యం. హిందినే వాడండి అనటం దురహంకారం అవుతుంది. దేశంలో కోట్లలో మాట్లాడే అనేక భాషలున్నాయి. ఎవరికీ ఏది అవసరమో దానిలో మాట్లాడతారు. అది అవసరం అవుతుందే కానీ, మాతృభాషతో సమానం ఎప్పటికి కాదు.

    రిప్లయితొలగించండి