23, జూన్ 2014, సోమవారం

ఎవరు స్థానికులు?


వైద్య, తాంత్రిక మరియు వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు దాదాపు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయి.    తమిళనాడులో 8 నుంచి 12వ తరగతి వరకు ఆ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్ధైనా అక్కడి కాలేజీల్లో  స్తానికుడిగా గుర్తింపబడతాడు.     కర్ణాటకలో 1 నుండి 12 వ తరగతి లోపల ఏడు సంవత్సరాలపాటు (పి యు సి తప్పకుండా  కర్ణాటకలోనే చదవాలి) చదివితే వారు స్థానికులుగా గుర్తింపు పొందుతారు.   ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జోనల్ సిస్టం ప్రకారం ఉండేది.    అందులోను స్థానికతను ఆనప కాయ-సొర కాయ, గోంగూర-కుంటికూర గుర్తింపులతో కాకుండా ఎక్కడ చదువుకున్నారనే వాస్తవాన్ని బట్టే ప్రవేశం వుండేది.


చిక్కల్లా, ప్రియతమ నాయకుడు దివంగత మేత ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్సుమెంటు పధకం వల్లనే వచ్చింది.   తెలంగాణాలోని ఇంజనీరింగు కాలేజీలలో మాత్రం 5-7 సంవత్సరాల స్థానికత ప్రకారం విద్యార్ధులు చేరవచ్చు. కానీ, ఫీజు రియంబర్సుమెంటు విషయంలో విద్యార్ధి తండ్రి తెలంగాణలో పుట్టి వుంటేనే ఈ సదుపాయం దక్కబోతోందని సమాచారం.   కాలేజీలో ప్రవేశానికి కూడా ఈ నిబంధన పెట్టినట్లయితే, సగానికి పైగా ఇంగాజీరింగు కళాశాలలు మూత పడతాయి.       


చట్ట సభలలో ఎంపీలుగా ఎం ఎల్ ఏ లు గా ఎన్నిక కాబడడానికి స్థానికత, వాళ్ళ నాన్న, తాత ఎక్కడ పుట్టింది అవసరం లేదు కానీ,  ఫీజు రియంబర్సుమెంటుకు మాత్రం కావాలి.    మరాఠీ, ఒరియా, కన్నడ మాతృభాషగా కలిగిన వ్యక్తులు 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్న వ్యక్తులు కూడా మన రాష్ట్రం నుండి శాసన సభకు గెలవ వచ్చు.   ఈ దేశంలో పుట్టని, ఈ దేశంతో సంబంధం లేని వారు కూడా ఈ దేశాన్ని వెనుక వుండి పరిపాలించ వచ్చు.


ప్రకాశం జిల్లాలో పుట్టి పెరిగిన పుల్లెల గోపీ చందు గారు తెలంగాణా బాడ్మింటన్ అసోసియేషన్కు నిన్ననే కార్యదర్శిగా ఎన్నికయ్యారు.   మరి వారి స్థానికతకు కొలబద్ద ఏమిటో!   

గత మూడు సంవత్సరాలనుండి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన వారు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని దిగ్విజయమైన బందుతో మొదలు పెట్టి  అదే రెచ్చగొట్టే విధానాల ద్వారా ఐదు సంవత్సరాలు పబ్బం గడుపుకోవాలనుకోవడం శోచనీయం.  


4 కామెంట్‌లు :

  1. నేను మరో బ్లాగులో (http://praja.palleprapancham.in/2014/06/blog-post_9144.html) చేసిన వ్యాఖ్యను ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను. I apologize if some parts of the comment are irrelevant to the present post but I hope the thrust will be clear.

    ========================================================================

    ఈ వార్తకు ఆధారం ఏమిటో YK బాబు గారు చెబితే బాగుండేది. Looks like kite flying to me.

    మన దేశంలో రాష్ట్రాలకు సార్వభౌమాధికారం లేదు. అంచేత మనందరిదీ ఒకే పౌరసత్వం. ఎవరూ తెలంగాణా రాష్ట్రానికో ఇతర రాష్ట్రాలకో పౌరులు కారు.

    స్థానికత (nativity) కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు & ప్రభుత్వ నిధుల మీద ఆధార పడిన విద్యాసంస్థలలో చేరిక గురించి మాత్రమె. ఆర్టికల్ 371-డీ ప్రకారం స్థానికత నిబంధనలను ప్రకటించే/మార్చే హక్కు కేంద్ర ప్రభుత్వానిదే. రాష్ట్రపతి ఉత్తర్వులను తిరగరాసే హక్కు తెలంగాణకు లేదు.

    స్తానికతకు జన్మస్థలం, పూర్వీకుల మూలాలు, మాతృభాష లాంటి విషయాలతో సంబంధం కల్పించడం అశాస్త్రీయం (బహుశా రాజ్యాంగ వ్యతిరేకం కూడా కావొచ్చు నేను ఈ విషయాన్ని లోతుగా చూడలేదు). స్తానికతకు నివాస కాలం (domicile) అనే కొలబద్ద మాత్రమె అన్నింటా సరిపోతుంది.

    అడ్మిషన్లకు తీసుకున్న ప్రమాణాన్ని కాదని వేరే అంశాన్ని (అందునా అశాస్త్రీయమయిన పద్దతిని) ఫీజులు చెల్లించడానికి వాడడం arbitrary అనిపించుకుంటుంది.

    అంచేత తండ్రి జన్మస్థానం లాంటి విషయాలను తెరపై తెచ్చే ప్రతిపాదన నిజంగా ఉంటె దాన్ని మానేయడం మంచిది.

    ఇకపోతే చదువుకు ప్రభుత్వ ఉద్యోగానికి స్థానికత నిబంధనలు వేరేగా ఉన్నాయన్న విషయం YK బాబు గారు గమనించలేదు అనుకుంటా.

    రిప్లయితొలగించండి
  2. 1. i think, somebody will go to court as Devadasi's & Jogini's does not have a father name in records. So they will say father & Mother Both need to be born in Telangana.
    2.Then our "Jai Gottimukkala" also will be in SOUP. Then he understands the settler word correctly. I remember somewhere he mentioned that his mother is from SA.
    3. Bhadrachalam people, khammam, nalgonda, hyd , mahbubnagar will have lot of relations on both sides which makes these cases more and more and they all will feel alienated and go to courts.
    3. For people who born in Bhadrachalam Andhra division and staying in Bhadrachalam T-Division it will be real night mare. they would lose on both ends. Its better the entire bhadrachalam division is merged back to Andhra.
    4. Already Bhadrachalam A-Division part people are not getting power from T and no buspasses for them. They dont get Jobs in T. T - People will do timepass dharnas for them but they dont give a penny to them.
    5. This Bhadrachalam division is added to T 55yrs back, just compare 55yrs back khammam with bhadrachalam. This division got nothing in the last 55years. Its better they comeback again to andhra.

    రిప్లయితొలగించండి
  3. Just for more info, JC Divakar reddy of Ananthpur was born in Gadwal Mahbubnagar. Ki Ku Re also in Hyd, Pramod mahajan in Adilabad.... their children can get reimbursement ;-)

    రిప్లయితొలగించండి
  4. I think We can make Mohammad been tuglak to reincarnate.I heard that He is a misinterpreted genius.Any way, he s more apt ruler if we can have a better interpretation now!

    రిప్లయితొలగించండి