14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

లాంకో వారి "స్ప్రే" ఉత్పాదనలు


నిన్నటి నుంచి ప్రతి చానలు, ప్రతి పత్రికా పాపం లగడపాటి రాజగోపాల్ను మిరియాల పొడి ఉపయోగించాడని నిందిస్తున్నాయి.    ఇదే మిరియాల పొడి చారులో వేస్తే అబ్బా రుచి అమోఘంగా వుంది, జలుబు రొంప దెబ్బకు కొట్టుకు పోయిందని మనం లొట్టలు వేసుకొని వాడతాము. పాపం రాజగోపాల్ గారు కూడా అదే చెప్పదలుచుకున్నారు.    లాంకో బ్రాండ్ మిరియాలను 'కాషా'యంగాను, రొంప తగ్గించడానికి మరియు దుష్టులనుండి రక్షణ కొరకు ఎలా ఉపయోగ పడుతుందో ప్రయోగాత్మకంగా భారతీయులకు వివరించాడు. ఇదే విన్యాసం ప్రకటన రూపంలో వివిధ మాధ్యమాల ద్వారా జన బాహుళ్యానికి చేరువ అవడానికి కనీసం 10 కోట్లు ఖర్చు అవుతుంది.  ఈ ప్రయోగంతో మనకు తెలిసింది ఏమిటంటే, ఇది ఒక ఉత్తమమైన స్వీయ రక్షణ  ఆయుధం.   ఇక ముందు మాటల్లేవ్ - మాట్లాడుకోవటాల్లేవ్, కేవలం మిరియాల పొడి మాత్రమే, బస్తీ మే సవాల్.  పోలీసులు కూడా టియర్ గాస్ బదులు మిరియాల గాస్ వదలచ్చు.  ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ.   పై పెచ్చు, ఇది ఆయుర్వేద ఔషధం కూడాను.  రైతులు ఇక నుంచి మిరియాల సాగు ఎక్కువ చెయ్యవచ్చు.   చేనుకు చేవ రైతుకు రొక్కం.     

కాంగ్రెస్ మార్షల్స్ ఏమి చేసేది ముందుగా చెప్పలేదు, రాజగోపాల్ కూడా పెప్పర్ వాడతానని ముందుగా చెప్పలేదు, కాబట్టి చెల్లుకు చెల్లు.  ఈ విషయంలో మహా మేధావి, రాజీవ్ గాంధీని పబ్లిక్ గా ఉరి తీయాలని నొక్కి వక్కాణించిన ఉత్తమ పార్లమెన్టేరియన్ ను మాత్రం సలహా అడగ కండి, ఆయన దీనిని 'తొండి' అని చెప్పి సోనియా గాంధీ మెప్పు పొందుతాడు.   

నన్నడగితే, సోమవారం నుండి పార్లమెంటులో తాడాట (టగ్  ఆఫ్ వార్) పెట్టి ఎవరు గెలుస్తారో తేల్చాలండి.  కాకపోతే ఈ తాడును బాబు గారికి, కచరా గారికి, సోనియాకు  మెడకు చుట్టి క్షీర సాగర మధనమ్లా చేస్తే చూసే వాళ్లకు కూడా  వినోదం మీడియా వాళ్లకు రేటింగ్స్ బాగుంటాయి.   ఎందుకంటే, నామా నాగేశ్వర రావు గారు బయటికి వచ్చి  నేను నారాయణను, మొదుగులను కొట్టి మరీ బిల్లు పెట్టించాను అని చెప్పి బాబు గారితో పాటు అపోలోకు వెళ్లి నారాయణను పలకరించి వచ్చాడు. కొట్టింది కాంగ్రెస్, తెదేపా వాళ్ళు; తన్నులు తిన్నది తెదేపా, కాంగ్రెస్ వాళ్ళు; లాభం కచారాకు, బాబుకు, సోనియమ్మకు.  కాబట్టి   ఇలాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్న ఈ ముగ్గురు మూర్ఖులకు క్షీర సాగర మధనమో, కుంభీ పాకమో తప్పకుండా జరిపించాలండి.    

3 కామెంట్‌లు :

  1. పెప్పర్ స్ప్రే అనేది ఒక విషవాయువు, నల్ల మిరియాల పొడి కాదండీ.

    రిప్లయితొలగించండి
  2. గొట్టి గారు ఆయన వాడిన స్ప్రే నేను పంపలేదు. మీరు ఎక్కువ సంతొషంలో వున్నారు. అందుకనే నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. తెలంగానా వారు ఎంతో కష్టపది తెలంగానా సాధించు కున్నారు. అంటే, ప్రతి కష్టం తరువాత సుఖం వుంటుంది. అలాగే ప్రతి సంతోషం తరువాత దుఖం వుంటుంది. దీనిని ద్రుష్టిలో వుంచుకొని మెలిగితే జీవితం సాఫీగా వుంటుంది. ఆల్ ది బెస్ట్ సర్ !

    రిప్లయితొలగించండి