26, జనవరి 2014, ఆదివారం

బిల్లు తిప్పి పంపినా విభజన ఆగదు


ఏ శక్తి, ఒక్క భాజపా తప్ప, రాష్ట్ర విభజన బిల్లును ఆపలేదు.   అది ఆర్టికల్ 3కు వున్న అధికారం. యుద్ధ విమానంలో వచ్చిన  బిల్లును 24 గంటలలో తిప్పి పంపండి, చర్చించడానికి ఏమి వుంది  అని చాలా మంది చెప్పారు.   దిల్లీలో వున్న రాజ్యాంగేతర శక్తి, తీసేసిన తాసిల్దార్ డిగ్గీ కూడా చెప్పాడు.   ఆయన గారు ఇంకొక అడుగు ముందుకేసి, శాసన సభ అభిప్రాయం ఏదైనా కావచ్చు, పార్లమెంటు నిర్ణయం ఫైనల్ అని సెలవిచ్చారు. ఇది కూడా వాస్తవమె.   అలాంటప్పుడు ఈ బిల్లును తిరస్కరించినా లేక ఆమోదించి తిప్పి పంపినా  జరిగే నష్టం ఏమీ లేదు, మనల్ని విడదీయడానికి కాని కలపడానికి కాని ఆర్టికల్ 3 వుంది కదా.   గడువుకన్నా ముందే, రేపే బిల్లును తిరస్కరిస్తూ తిప్పి పంపిస్తే సరి.   భవిష్యత్లో కేంద్రంలో ఎవరు అధికారంలో వుంటే వారు శాసన సభలను గమనంలోకి తీసుకోకుండా మళ్ళీ కలపవచ్చు.   పార్లమెంటులో సాధారణ మెజారిటీతో మళ్ళీ కలిపెయ్యవచ్చు.   ఈ రాజకీయ రాక్షస క్రీడ ఇలా జరుగుతున్నంత కాలం తెలుగు వాడి పరువు గంగ పాలు కాక తప్పదు.   

7 కామెంట్‌లు :

  1. రిప్లయిలు
    1. భాజపా మాట మారింది?! మోడీ నుంచి వెంకయా నాయుడు వరకూ ఆంధ్రా కి అన్యాయం జరగటానికి వీల్లేదంటూ 'ఇచ్చేది మేమే' అనటంలో అర్ధమేమిటి? అదీ ఇంకా పై సభలో బిల్లు పెట్టక ముందు. కాంగ్రెసు పెట్టిన బిల్లుని పాస్ చేసే ఉద్దేశమే ఉంటే ఆ మాటెందుకు వస్తుంది, గమనించండి. సీమాంధ్రకు అన్యాయం జరిగేలా కానీ బిల్లు చెత్తగా ఉంటే గానీ బిల్లుని సమర్ధించే ప్రసక్తే లేదని కూడా అంటున్నారు.అప్పుడే గుడ్ బై చెప్పెయ్యకండి. కధలో ఇంకా చాలా మలుపులు వస్తాయి.

      తొలగించండి
    2. ఉత్తర కుమారుల లాంటి సమై"ఖ్య"వీరులు ఇప్పటికి ఎన్నో "బ్రహ్మాస్త్రాలు" సంధించారు. ఉద్యోగుల సమ్మె, 371-డీ గురించి కేసు, రాయల తెలంగాణా ఊహాగానాలు, భద్రాద్రి పెడబొబ్బలు, శివప్రసాద్ కచేరీలు, నన్నపనేని మూర్చ, వేలాది సవరణలు, కిరణ్ కుమారుడి బాట్ విన్యాసాలు, draft vs. original bill ఒకటేమిటి ఎన్నో వినోద కార్యక్రమాలు.

      AP is going out in style!

      తొలగించండి
    3. మా బ్రహ్మాస్త్రాలు ఫెయిల్ అవటం సంగతికేం గానీ, ఇవ్వాళ వూహాగానాలు అంటున్నావు మరి అంతటి వీరులూ రాయల తెలంగాణా మొట్టికాయ కి ముందు ఇలాగే మాట్లాడి మొట్టికాయ తగలంగానే ఉద్యమ నేత నుంచీ అందరూ అలా గిలగిల్లాడి పోయి భయ పడి పోయారేం? అయినా మొదట్లో కాంగ్రెసు తన లాభం కోసం విడగొడుతున్నదయ్యా అంటే లాభం లేకుండా యెవరు చేస్తారు అని దీర్ఘాలు తీసి కాంగ్రెసునే సమర్ధించారు గదా,మరి ఇప్పుడు విలీనానికి ఒప్పుకేవటానికి యెందుకు తటపటాయిస్తున్నారు? రాష్ట్ర స్థాయిలో సొంత పార్టీయే రెండుగా చీలిపోయి సగం మంది తమని ధిక్కరించి ఇబ్బ్బంది పెడుతున్నా వెనకడుగు వెయ్యకుండా మీకు సాయం చేస్తున్న మీ మిత్రుడికి తను కోరింది ఇవ్వకుండా తప్పుకు పోవాలని చూడ్డం యేం మర్యాదయ్యా?మీకు కావలసిందేదో చల్లగా మీరు తీసుకుపోవడమే తప్ప మీ వైపు నుంచి యేదీ ఇవ్వరన్న మాట!బల్లే కిల్లాడీలు గా మీరు!!

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  2. తన సొంత పార్టీ లోనే యేకాభిప్రాయం సాధించుకోలేని వాళ్ళు యెదటి వాళ్లని యేకాభిప్రాయం చెప్పమని గద్దిస్తున్నారు - మూఢమతే?!

    రిప్లయితొలగించండి
  3. Mr jai
    your TAT - AP is going out in style!

    my TIT - భశుం for తెలంగాణా!

    రిప్లయితొలగించండి