12, నవంబర్ 2013, మంగళవారం

తెరాసను జాతీయ పార్టీగా చూడాలని వుంది


తెలంగాణా రాష్ట్ర సమితిని కేవలం ఉప ప్రాంతీయ పార్టీగా పరిగణిస్తూ గేలి చేస్తున్నవారికి హెచ్చరికలా ఆ పార్టీ 2014లో జాతీయ పార్టీ అయ్యే అవకాశం  వుంది.    భద్రాద్రి రాములోరి దయవలన ఖమ్మం జిల్లాలోని కొంత ప్రాంతం, ఆలంపూరు శివుడి దయవలన మహబూబ్ నగర్లోని కొన్ని మండలాలు మరియు సొనియమ్మ దయవలన నల్లగొండ జిల్లాలోని మునగాల పరగణాలు తీర సీమాన్ధ్ర రాష్ట్రంలో కలిసే అవకాశం వుంది.   ఈ ప్రాంతాలన్నీ 1956 సమైక్యానికి పూర్వం ఆంధ్రాలోవే.   ఇరు ప్రాంతాలలోని  తెలుగు వాళ్ళకు సి డబ్ల్యు సి వాక్కు బైబిల్ తో సమానం.   గతంలో తెరాసా వారు కాంగిరేసు వాళ్ళు  కూడా  మెర్జర్ - డి మెర్జర్, మాకు ఆంధ్రా ప్రాంతం నుంచి సూది మొన మోపే అంత భూ భాగం కూడా వద్దన్నారు.   మనందరికీ తెలుసు తెరాసా అన్నా కచరా అన్నా మాటకోసం ప్రాణం ఇచ్చే వ్యక్తిత్వం.  తెలంగాణా కాంగ్రెస్ వారికి అమ్మ మాట వేద వాక్కు.   కాబట్టి, విభజన జరిగినంత మాత్రాన, వైఎసార్ పార్టీ తెలంగాణా లో బోర్డు తీసేస్తుందా, భద్రాచలం, మునగాల మరియు గద్వాల ప్రాంతంలో తెరాసా ఉనికి కోల్పోతుందా!   భవిష్యత్లో రాయలసీమ విడిపోవడం ఖాయం.   ఆ దిశగా ఇప్పటికే బైరెడ్డి గారు బండ బూతులు కూడా నేర్చుకున్నారు. మూడో రాష్ట్రం కూడా కార్య రూపం దాల్చితే, తెదేపా, వై ఎస్ ఆర్ సి పి, తెరాస జాతీయ పార్టీలుగా ఆవిర్భవించే అవకాశం వుంది.  ఏం తెలుగు మాట్లాడే వారికి మూడు రాష్ట్రాలు మూడు జాతీయ పార్టీలు వుంటే తప్పేంటి?



                  

2 కామెంట్‌లు :

  1. ainaa meetho kalisi undaadaaniki e pratnhamu valu siddhangaa leru.. endhukante meeru entha kacharagallo andhariki telusu.

    రిప్లయితొలగించండి
  2. assalu kalisi vundaddu. 1956 poorvam elaa vundo alaane vidipodaamani manaspoortigi cheptunnaanu.
    nenu ekkadaa kalisi vundaalani cheppaledu ajyaani gaaru

    రిప్లయితొలగించండి