2009 డిసెంబర్ నెలలో కె సి ఆర్ దీక్ష సందర్భంగా బాబు గారు రెచ్చిపోయి మీరు తీర్మానం చెయ్యండి ఒక సంతకం పెట్టేస్తా అని బావమరిది బాలకృష్ణ గారిలా తొడలు కొట్టి సవాలు చేశాడు. పాపం ఆయన ముచ్చట కాదన లేక రోశయ్య గారు దగ్గరుండి సంతకం పెట్టించారు. ఆ, వీళ్ళు నిజంగా విభజిస్తారా అన్న ఒక అపోహ. అప్పుడు మొదలైన ఆయన తప్పటడుగులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి. జూలై 30 తరువాత మొదలైన ఆయన సమన్యాయం ఇంతవరకు ఎవరికీ అర్ధం కాలేదు.
మా పోలిట్ బ్యూరో ఇచ్చిన ఉత్తరానికి కట్టుబడి ఉన్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అర్ధరహిత నిర్ణయం సరికాదు అంటాడు. మరి అర్ధవంతంగా ఎలా విభజించాలి చెప్పండి బాబూ అంటే, తీర్పు ఇచ్చిన తరువాత విచారణ జరపడం ఏమిటీ అంటాడు. ఒక వేళ శాసన సభలో తీర్మానం వస్తే, మీరు అనుకూలంగా వోటు వేస్తారా లేక వ్యతిరేకంగానా అంటే, కాంగ్రెస్ పార్టీ కేవలం రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి తీసుకున్న నిర్ణయం ఇది అంటాడు. మరి కాంగ్రెస్ పార్టీపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ఓడించలేదు అంటే, బెయిల్ కోసం, పాకేజీల కోసం మేము వేరేవరినో ఎందుకు సపోర్టు చెయ్యాలి అంటాడు (అప్పటికి తమ పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదన్నది బహిరంగ రహస్యం). పోనీ, సమన్యాయం అంటే ఏమి చెయ్యాలి అంటే, కాంగ్రెస్- తెరాసా - వైకాపా కలిసిపోయి తెదేపాను అంతం చేసే కుట్ర ఇది అంటాడు. పోనీ మంత్రుల బృందాన్ని కలిసి ఎలా చేస్తే బాగుంటుందో చెప్పమంటే - నన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చెయ్యండి, ఆరు నెలలో ఈ సమస్యను పరిష్కరిస్తాను అంటాడు. మీరు 2009లో టి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు కదా అంటే, ఆ రోజు కె సి ఆర్ కు మంత్రి పదవి ఇస్తే, ఇవ్వాళ ఆ పార్టీ పుట్టివుండేది కాదు అంటాడు. మీరు విభజనకు అనుకూలం కదా అంటే, మా తొమ్మిదేళ్ళ పరిపాలనలో బిల్లుగెట్, బిల్లు క్లింటన్లు వచ్చారు. బ్రహ్మాండమైన రోడ్లు, సైబరాబాద్ నిర్మాణం, బిందు సేద్యం, తుంపర సేద్యం, ఇ-సేవ లాంటి ఎన్నో కార్యక్రమాలతో ముందుకుపోయం అంటాడు.
బాబు గారూ - మీరు కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా వున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ మేధావులకు కొదవ లేదు. నాలుగు దశాబ్దాల మీ రాజకీయ జీవితంలో కాంగ్రెస్ నుంచి మీరు ఏమీ తెలుసుకోలేదంటే, మీ మేధాశక్తిని శంకించాల్సి వస్తుంది. పొంతన లేని సమాధానాలతో ప్రజలని పిచ్చెక్కిస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపా కేవలం తెలంగాణలో మాత్రమె తమ ఉనికిని చాటుకోవడాని నిర్ణయించుకున్నాయి. మీ హృదయం నిండా సమైక్యం నిండి వున్నదని సగటు తీర సీమంధ్ర ఓటరుకు తెలుసు. కానీ మీరు మాత్రం ఇరు ప్రాంతాలలో బ్రతికి బట్టకట్టాలని ప్రయత్నిస్తున్నారు. కేవలం కొన్ని సీట్ల కోసం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టి ఆర్ ఆశయాలను తుంగలో తొక్కి సమైక్యంపై రాజీ పడ్డారు. ఈ ప్రయత్నంలో రెండు ప్రాంతాలలో బ్రష్టు పట్టి, మీ రాజకీయ జీవితానికి శుభం కార్డు పడే ప్రమాదం వుంది, తస్మాత్ జాగ్రత్త. మీ మేధస్సు, పరిపాలనా నైపుణ్యం, రాజకీయ చాణుక్యం తీర సీమాంధ్ర పునర్నిర్మాణంలో మీ అవసరం ఎంతో వుంది. మీరు ఇప్పటికైనా రెండు పడవలలో కాళ్ళు పెట్టడం తక్షణం మానేసి తీర సీమాన్ధ్రలో మాత్రమె వుండాలని విజ్యప్తి. 2014 లో అధికారంలోకి రాకపోయినా కనీసం 2019లో మీరు తప్పక వస్తారు.
చాలా బాగా చెప్పారు. ఆయన మీ పోస్ట్ చదవాలి మరి.
రిప్లయితొలగించండిఅంతా ఇమిటేషన్ రాజకీయం అయిపోయింది బాబు పని. రాజశేఖర రెడ్డి పాడె యాత్ర యేదో చసి పవర్లోకి వచ్చాడు కాబట్టి తనూ మొదలెట్టాడు. ఆయన తెరాస తో కలిసి పవర్లోకొచ్చ్చాడనుకుని తెరాసతో కల్సాడు.జగన్ హైదరాబాదులో డేరా వేస్తే తను డిల్లీలో వేశాడు :-) యెన్ని చేసినా వర్కౌట్ అవ్వడం లేదు పాపం :-(
రిప్లయితొలగించండిపాపం అనాల్సింది babu గారిని కాదు, తెలుగు ప్రజలని!!! అదేదో movie లో comedian phone అనుకోని iron-box తో రెండు చెంపలు కాల్చుకోన్నట్టు, ఒకటికి రెండు సార్లు babu ని పనిష్ చేస్తున్నాం అనుకోని Congress ని ఎన్నుకొని తమ బతుకులకి తామే అన్యాయం చేసుకొన్నారు.....papam ananlsindi babu garini kadu, telugu prajalani!!! adedo movie lo comedian phone anukoni iron-box to rendu chempalu kalchukonnattu, okatiki rendu sarlu babu ni punish chestunnam anukoni Congress ni ennukoni tama batukulaki tame anyam chesukonnaru.....
రిప్లయితొలగించండి