28, అక్టోబర్ 2013, సోమవారం

కొత్త రాష్ట్ర రాజధాని తీర ప్రాంతంలోనే వుండాలి.


రాష్ట్ర విభజన అనివార్యం.  మంచికో చెడుకో ఇంత దూరం వచ్చిన తరువాత ఇప్పుడు వెనుకంజ వేస్తే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం వుంది.     తీర సీమాన్ధ్రలో పార్టీలకు సంబంధం లేకుండా మనం ఎన్నుకున్న ఎంపీలలో సగం మంది బడా పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, దళారులు  వున్నారన్నది నగ్న సత్యం.   వీరికి వున్న వ్యాపార లావాదేవీల రీత్యా, వాటిలోని లొసుగులు మరియు సంబంధ బాంధవ్యాల వలన వారికి ప్రజా ప్రయోజనాల కన్నా, వ్యాపార లాభ నష్టాలే ముఖ్యం.   విద్యా, ఉపాధి, సాగు మరియు తాగు నీరు విషయాలలో కొంత మేర తీరాంధ్ర ప్రదేశ్ కు నష్టం జరగవచ్చు.   కానీ రాయల సీమ నష్టం అపారం, తీర్చలేనిది.   


ఇక రాష్ట్ర రాజధాని విషయానికొస్తే, రాయల సీమలో ఉండాలని కొందరు తీర ప్రాంతంలో వుండాలని మరికొందరు కొట్లాటలకు దిగే సమయం చాలా దగ్గరలో వుంది.    రాజధానితో కూడుకున్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడం ఆనవాయితీగా మారుతున్న సందర్భంలో, కొత్త రాజధాని తీర ప్రాంతంలో వుండటం న్యాయం.   ఇప్పటికే, రాయలసీమ ప్రాంతంలో జూనియర్ క చ రా బండ బూతులన్నీ నేర్చుకున్నాడు.   ఆరు నూరైనా కత్తి నూరైనా 2018లో ప్రత్యెక రాష్ట్రం సాధిస్తా అని తిమ్మమ్మ మర్రిమాను మీద ప్రమాణం చేశాడు.  


మళ్ళీ వోట్ల కోసమో, సీట్ల కోసమో, మనోభావాల కోసమో, ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నాయనో, మాది మాకు కావాలనో,   అరవ్వాడికి ఇష్టం లేదనో  ఉద్యమమొస్తే, తీర ప్రాంతం మళ్ళీ రాజధాని వేటలో పడాలి.   లేదా రాయలసీమ వాసులు కూడా విడిపోవడానికి సిద్ధంగా వుంటే, ఇప్పుడే మూడు ముక్కలు చేసి, ఏం, హిందీ మాట్లాడే వాళ్లకు 16 రాష్ట్రాలు వుండగా లేనిది తెలుగు మాట్లాడే వారికి 3 రాష్ట్రాలు వుంటే తప్పేంటి అని ఒక డైలాగ్ కొట్టెయ్యాలి.      


పెద్ద మనసుతో రాజధానిని కర్నూలుకు తరలించిన టంగుటూరి లాంటి నాయకులు ప్రస్తుతం మన సమాజంలో లెరు.   మనకు మిగిలిన నాయకులలో 90 శాతం మంది సారా కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లు, పవర్ బ్రోకర్లు లేదా జోకర్లు మాత్రమే.   కాబట్టి రాజధాని ప్రయత్నాలు ఇప్పటినుంచే మొదలవ్వాలని అభిలషిస్తున్నాను.     

3 కామెంట్‌లు :

  1. avunu, baagaa chepparu. ippudE moodau, veelaite naalugu raaShtraalugaa vidadeeyaali, meerannatlu raajadhani rayala seemalo pettakapote, vallaki kopam vastumdi, teera pedite, adi abhivrudhdhi ayaaka vere raashtram immanadaaniki ippatike emdaro ka cha daa lu unnaru. alage kalimga andhra vaallu koodaa wings lo wait chestunnaaru.

    రిప్లయితొలగించండి
  2. కొత్త రాజధానిని ఏర్పరచేటప్పుడు పాలన సౌలభ్యం,అందరికీ అందుబాటులో ఉండటం ముఖ్యం! నిర్మాణానికి అవసరమయ్యే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండాలి! సీమాంధ్ర లోని మెజారిటీ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి! లేకపోతే కేంద్ర నిర్ణయానికే వదలి వెయ్యాలి!రాగద్వేషాలకి అతీతంగా తొందరగా నిర్ణయించాలి!

    రిప్లయితొలగించండి
  3. అయ్యా అపకారి గారు,

    మెజారిటీ ప్రజల అభిప్రాయమా? విభజనకు అలాంటి ప్రాతిపదిక ఏమీ తీసుకోలేదే? రాగ ద్వేషాలకు అతీతంగానా - సాటి తెలుగు వాళ్ళను ద్వేషించడం అనేదే కదా విభజనకు ప్రాతిపదిక. భలే వేదాలు వల్లిస్తున్నారు సార్, ముచ్చటేస్తుంది మీ మాటలు చదువుతుంటే. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులు హరిస్తుంటే, మళ్ళీ రాజధాని ఎక్కడ పెట్టాలో కేంద్రం నిర్నయించాలా. రాజధాని కోసం రెందు ప్రాంతాలు తన్నుకు చావాలి, బందులు జరగాలి, మీ లాంటి వాళ్ళు ఆనందపడాలి, బొలెడు తతంగం వుంది. మంచి ఎంటర్టైన్మెంట్ సార్ మీ లాంటి వాళ్ళకు.

    రిప్లయితొలగించండి